వార్తలు

Naa Anveshna Anvesh: అదుపు లేని మాటలతో… అసలుకే మోసం…

Published by
Suresh Thota

“నడమంత్రపు సిరి… నరం మీద పుండు” ఒకటే అంటారు పెద్దలు… డబ్బు రావడం ఒక ఎత్తు అయితే, పేరు రావడం మరొక ఎత్తు… వాటిని నిలుపుకోవడం కోసం చాలా కష్టపడాలి… కాని ఇది అంతా మన యొక్క తెలివితేటలు, మనల్ని మించిన వాడు లేడు అని విర్రవీగితే దానిని మూర్ఖత్వం అంటారు… ఇది ఈ అన్వేష్ కు సరిగ్గా సరిపోతుంది ఏమో…

ప్రముఖ తెలుగు యూ ట్యూబర్ అన్వేష్ నిర్వహిస్తున్న “నా అన్వేషణ” ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెటా యాజమాన్యం పూర్తిగా బ్లాక్ చేసింది. ఈ చర్యకు ముందు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు కీలకంగా మారింది. భారతదేశం మరియు హిందూ మతంను కించపరిచే విధంగా, అవమానకరమైన వ్యాఖ్యలు తో బాటు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు, చేశారనే ఆరోపణలపై హైదరాబాద్ CCS పోలీసులు కేసు నమోదు చేసి, అన్వేష్ ఖాతా వివరాలు అందించాలని, అలాగే అతని సోషల్ మీడియా అకౌంట్ పై చర్యలు తీసుకోవాలని అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్ కు లేఖ రాశారు. పరిశీలన అనంతరం ప్లాట్‌ఫాం నిబంధనల ఉల్లంఘనగా గుర్తించి ఖాతాను తొలగించారు.

ఈ వ్యవహారంలో నటి కరాటే కళ్యాణి పోలీసులు లకు పిర్యాదు చేశారు… అన్వేష్ తన పోస్టుల్లో హిందూ దేవి దేవతలు అయిన గణపతి, అయ్యప్ప స్వామి… అలాగే రామాయణం లో సీతా మాత , మహాభారతంలోని ద్రౌపది దేవి వంటి వారి పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు పై అవమానకర వ్యాఖ్యలు చేయడంతో… విశ్వ హిందూ పరిషత్ లాంటి హిందూ సంఘాలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాయి. పోలీసులు భారతీయ న్యాయ సంహిత, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి ఖాతా డేటా సేకరించినట్లు సమాచారం.

దీని మూలంగా ఫాలోవర్ల తగ్గుదల మొదలైంది. వివాదాలకు ముందు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు సుమారు 18 లక్షల ఫాలోవర్లు ఉండగా, వివాదాల తర్వాత 13 లక్షలకు పడిపోయాయి. బ్యాన్ తర్వాత ఖాతా పూర్తిగా కనుమరుగైంది.

యూట్యూబ్ ఛానల్‌పై అధికారికంగా ఎలాంటి నిషేధం విధించలేదు. అయితే వివాదాల సమయంలో లక్షలాది మంది సబ్‌స్క్రైబర్లు అన్‌సబ్‌స్క్రైబ్ చేసినట్లు అంచనా. కొన్ని సంఘాలు అన్వేష్ యూట్యూబ్‌ చానల్ పైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఛానల్ కొనసాగుతుండగా, భవిష్యత్తులో మరిన్ని చర్యలు ఉంటాయి అని నెటిజన్లు అంటున్నారు.

అందుకే ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని చెబుతారు చెబుతారు… పెద్దలు.

Suresh Thota