Download App

ప్రధాని మోడీ పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు భరోసా…

మార్చి 24, 2026 By Suresh Thota
ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద భౌగోళిక రాజకీయ (Geopolitical) సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ వేదికగా వివరణ ఇచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, భారత్ వంటి దేశాలపై చూపుతున్న ప్రభావాన్ని ఆయన విశ్లేషించారు. ఆపరేషన్ సురక్ష : కోటి మంది భారతీయుల...
ప్రధాని మోడీ పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు భరోసా…

ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద భౌగోళిక రాజకీయ (Geopolitical) సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ వేదికగా వివరణ ఇచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, భారత్ వంటి దేశాలపై చూపుతున్న ప్రభావాన్ని ఆయన విశ్లేషించారు.

ఆపరేషన్ సురక్ష :

కోటి మంది భారతీయుల భద్రతే లక్ష్యం, యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న భారతీయుల ప్రాణాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఇప్పటికే 3.75 లక్షల మంది భారతీయులను యుద్ధ భూమి నుండి సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చామని, ఇది ప్రభుత్వ చొరవకు నిదర్శనమని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల్లో జీవనోపాధి పొందుతున్న కోటి మంది భారతీయుల భద్రత విషయంలో కేంద్రం ఆందోళన చెందుతోందని, వారి కోసం విదేశీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో 24/7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఇంధన సంక్షోభం : భారత్ ‘ప్లాన్ బి’ (Plan B)

యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థ (Supply Chain) దెబ్బతిన్న వైనాన్ని మోదీ వివరించారు. ముఖ్యంగా ‘హార్మూజ్ జలసంధి’ (Strait of Hormuz) ద్వారా నౌకల రాకపోకలు నిలిచిపోవడం పెద్ద సవాలుగా మారిందని ఆయన అన్నారు. కేవలం కొన్ని దేశాలపై ఆధారపడకుండా, ప్రస్తుతం భారత్ 41 దేశాల నుండి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ప్రపంచంలో ఏ ప్రాంతంలో సమస్య వచ్చినా దేశానికి చమురు కొరత ఉండదు. అలాగే దేశంలో అత్యవసర పరిస్థితుల కోసం వ్యూహాత్మకంగా 53 లక్షల మెట్రిక్ టన్నుల పెట్రోల్ నిల్వలను ప్రభుత్వం సిద్ధం చేసింది అన్నారు.

ఎల్పీజీ (LPG) అవసరాల్లో దేశీయంగా 60 శాతం భారత్‌లోనే ఉత్పత్తి చేస్తూ స్వయంసమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఆర్థిక మాంద్యంపై ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని,
ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యం (Global Recession) కోరల్లో చిక్కుకుంటున్న తరుణంలో, భారత్ తన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకుంటోందని ప్రధాని భరోసా ఇచ్చారు.

రైల్వేల విద్యుదీకరణను వేగవంతం చేయడం ద్వారా ఏటా 180 కోట్ల లీటర్ల డీజిల్‌ను ఆదా చేస్తున్నామని, ఇది దేశ ఖజానాపై భారాన్ని , ఖర్చులను తగ్గిస్తుందని వివరించారు.

“కోవిడ్ వంటి మహమ్మారిని ఎదుర్కొన్న అనుభవం మనకుంది. అప్పట్లో ప్రపంచమంతా కుదేలైనా భారత్ నిలబడింది. ఇప్పుడు కూడా అదే పట్టుదలతో ఏ సంక్షోభాన్ని అయినా ఎదుర్కొంటాం” అని మోదీ ఉద్ఘాటించారు.

దౌత్యం ద్వారా శాంతికే పెద్దపీట వేస్తున్నామని, యుద్ధం దేనికీ పరిష్కారం కాదని, కేవలం చర్చల ద్వారానే శాంతి సాధ్యమని భారత్ మొదటి నుంచి చెబుతోందని మోదీ గుర్తు చేశారు. యుద్ధాన్ని ఆపేందుకు తాను వ్యక్తిగతంగా ప్రతిరోజూ పశ్చిమాసియా దేశాధ్యక్షులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ప్రపంచ శాంతి స్థాపనలో భారత్ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తుందని, ప్రపంచ దేశాలన్నీ చర్చల వైపు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ముగింపు:

అంతర్జాతీయంగా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, భారతీయులకు నిత్యావసరాలు, ఇంధనం మరియు భద్రత విషయంలో ఎలాంటి లోటు రాకుండా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మోదీ ప్రసంగం స్పష్టం చేసింది. ప్రపంచం ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద భౌగోళిక రాజకీయ (Geopolitical) సంక్షోభంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ సాక్షిగా ఈ విధంగా వివరణ ఇచ్చారు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading