మోదీ, పుతిన్ ల…. మధ్య పోలిక
December 23, 2025 Published by Srinivas

మొండివాడు రాజుకన్నా బలవంతుడు అనే నానుడి ఉంది. ఆ మొండివాడే సరళమైన ఆలోచనతో కూడిన రాజైతే….. ఒక”పుతిన్” , ఒక “మోడీ”….. ఎవరికి తలవంచని నైజం. మాట పెదవి దాటితే దానికి నువ్వు బందీ…. లేకపోతే నీకు ఆ మాట బంది…. ఇది అక్షరాల పుణికి పుచ్చుకుని ఆచరణలో పెడుతున్నవాళ్ళు ఈ ఇద్దరూ.
ప్రపంచంలో అతిపెద్ద దేశం రష్యా ఇది 17,098,242 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో యూరప్, ఆసియా ఖండాలలో విస్తరించి ఉంది, భూమి మొత్తం లో రష్యా సుమారు 11% ఉంటుంది. దీనికి అధ్యక్షుడు వ్లాదమీర్ పుతిన్.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం, సుమారు 142.86 కోట్లు (2023 లెక్కల ప్రకారం), మరియు 2025 నాటిక146 కోట్ల కు చేరుకుంటుంది అని ఒక అంచనా , చైనా రెండవ స్థానంలో ఉంది. ఇంతటి జనాభా కు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ.

ప్రపంచంలో సోవియట్ యూనియన్ (USSR) 1991 డిసెంబర్ 26న అధికారికంగా 15 దేశాలుగా విడిపోయింది. రష్యా శకం ముగిసిపోయిందని అందరూ అనుకుంటున్నప్పుడు…. నేను ఉన్నాను అని నిలబడినవాడు “వ్లాధమీర్ పుతిన్”.
ఆర్థికంగా పతనమై, భౌగోళికం విడిపోయి రష్యా సామ్రాజ్యం బలహీనంగా, ప్రపంచం ముందు అవమానించబడుతున్న రోజుల్లో, నిశ్శబ్దంగా వచ్చాడు. సరైన క్షణం కోసం వేచిచూశాడు. అందరూ అతన్ని తక్కువ అంచనా వేశారు. రష్యాను ఎగతాళి చేశారు.
“ఈ దేశం మళ్లీ లేవదు” అని అనుకున్నారు. గూఢచర్యం నేర్పిన క్రమశిక్షణతో, ఏకాగ్రత తో రష్యాను అగ్రరాజ్యం గా నిలపాలనే తపన తో నిశ్శబ్దంగా రాతి ని చీల్చుకుంటూ వెళ్ళే అశ్వత్థ వృక్షం ల పుతిన్ ఎదిగాడు.
అతనికి ఒకే ఒక్క నమ్మకం బలమైన దేశానికి బలమైన నాయకత్వం అవసరం అనుకున్నాడు.
“సోవియట్ యూనియన్ పతనం 20వ శతాబ్దంలో జరిగిన అతిపెద్ద భౌగోళిక-రాజకీయ విపత్తు.”
కొంతమందికి అవి మాటలు మాత్రమే. అతనికి తెలుసు తన లక్ష్యం ఏమిటో…. అతను రష్యాను బలమైన శక్తి గా తిరిగి నిర్మించాడు..
రష్యా ఎప్పటికీ రష్యా నే….. అని ప్రపంచానికి గుర్తు చేశాడు. ఆంక్షలు వచ్చాయి,ఒత్తిళ్లు వచ్చాయి, హెచ్చరికలు వచ్చాయి. కానీ పుతిన్ ని కదప లేకపోయాయి. తన లక్ష్యం తనకి తెలుసు అది సాధించడానికి తను ఏమి చేయాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో లో తెలుసు కాబట్టి అంత విశాల దేశాన్ని డేగ దృష్టి తో కాపాడుతూ అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతున్నాడు.

ఇక “నరేంద్ర మోడీ” ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన, అనేక మతాలు, కులాలు, సంస్కృతులు కలిగిన దేశం నకు ప్రధాని గా 2014 లో అధికారంలోకి వచ్చారు. అప్పటినుండి అప్రతిహతంగా ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. అంతకు ముందు గుజరాత్ సీఎం 12 సంవత్సరాల పైగా పని చేశారు. ఈయనకు బలమైన పార్టీ వ్యవస్థ గా బీజేపీ ఉంది.
ఈయన కు ముందు కాంగ్రెస్ హయాంలో 2G స్పెక్ట్రమ్ స్కామ్ ద్వారా ₹1.76 లక్షల కోట్ల నష్టం, బొగ్గు గనుల వేలం ద్వారా ₹1.86 లక్షల కోట్ల నష్టం , కామన్‌వెల్త్ గేమ్స్ ₹900 కోట్లకు పైగా అక్రమాలు ఇంకా చాలా కుంభకోణాలు వెలుగు చూసాయి.
కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం,బలమైన నాయకత్వం అనే భావన, మరియు జాతీయవాదం వెన్ను చూపని తత్వం, మొక్కవోని దైర్యం, అకుంఠిత దీక్ష తో ఆర్థికంగా భారత దేశాన్ని, ప్రపంచంలో టాప్ ఆర్థిక వ్యవస్థలలో ఒకటి గా నిలిపాడు. అతి పెద్ద హిందూ సనాతన ధర్మం పరిరక్షణకు నడుం బిగిస్తూ… శతాబ్దాల నుండి కొలిక్కిరాని రామ జన్మ భూమి సమస్యని పరిష్కరించి….హిందూ ధర్మానికి చిహ్నమైన అయోధ్య దేవాలయ నిర్మాణం పూర్తి చేసి జయ కేతనం ఎగురవేశాడు. తను అనుకున్న లక్ష్యం సాధించాడు.
పరిపాలన పరంగా ,మౌలిక సదుపాయాల విస్తరణ (రోడ్లు, రైల్వేలు, డిజిటల్) స్టార్టప్‌లు, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, దేశ భద్రత, విదేశాలలో దేశ ప్రతిష్ఠ , సరిహద్దుల్లో కఠిన వైఖరి, G20, Global South నాయకత్వం, ఏ దేశానికి భయపడని నైజం…. తో భారత్ గ్లోబల్ పవర్ అన్న గుర్తింపు కేవలం మోడీ వల్ల సాధ్యమయింది. ఆత్మవిశ్వాసతో ముందుకు సాగుతున్న దేశం అని ప్రపంచం వేనోళ్ళ కొనియాడుతుంది. బలమైన నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైంది.
పుతిన్ మాట…
“రష్యా మీ కాలనీ కాదు.
రష్యా తన విధిని తానే రాసుకుంటుంది.” అంటే….
మోదీ మాట…
“घर में घुसकर मारेंगे” అంటే
ఉగ్రవాదులను, పాకిస్తాను ఉద్దేశించి… మీ ఉగ్రవాద అడ్డాలలోకి, వచ్చి మరీ కొడతాం అన్నారు.
వీరు ఇద్దరూ ప్రపంచ రాజకీయాల్లో వణుకు పుట్టిస్తున్నారు. వీరి దారులు వేరు కావచ్చు రాజకీయ ధోరణుల్లో…. అంతిమ లక్ష్యం మాత్రం. “దేశ ప్రయోజనాలే ముఖ్యం”. “Nation is first”.
