Download App

కర్నూలులో మోదీ పర్యటనకు సర్వం సిద్ధం – సమన్వయంతో పనిచేయాలని మంత్రి లోకేష్ ఆదేశాలు

అక్టోబర్ 10, 2025 • By Srinivas
ఈనెల 16వ తేదీన కర్నూలులో జరగబోయే ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ సభను విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే తాటిపై పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ మహాసభకు సంబంధించిన...
కర్నూలులో మోదీ పర్యటనకు సర్వం సిద్ధం – సమన్వయంతో పనిచేయాలని మంత్రి లోకేష్ ఆదేశాలు

ఈనెల 16వ తేదీన కర్నూలులో జరగబోయే ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ సభను విజయవంతం చేయడానికి రాష్ట్ర ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకే తాటిపై పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సూచించారు.

ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఈ మహాసభకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో మంత్రుల బృంద సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత హాజరయ్యారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ముఖ్యమంత్రి కార్యాలయ సీనియర్ అధికారులు కార్తికేయ మిశ్రా, పీయూష్ కుమార్, అహమ్మద్ బాబు తదితర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

కర్నూలులో మోదీ పర్యటనకు సర్వం సిద్ధం – సమన్వయంతో పనిచేయాలని మంత్రి లోకేష్ ఆదేశాలు

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ — “ప్రధాని పర్యటన రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకమైనది. అందువల్ల ప్రతి ఒక్కరు తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి, కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలి. ప్రజల రాకపోకలు, భద్రత, లాజిస్టిక్స్, కమ్యూనికేషన్‌ అన్నీ సమన్వయంతో సాగాలి,” అని ఆదేశించారు.

సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని మోదీ పలు కీలక ప్రకటనలు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపే ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున, అన్ని విభాగాలు పూర్తి స్థాయి సన్నద్ధతలో ఉన్నాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

మరిన్ని వార్తలు

Trending Now

No trending articles in this category from the last 3 days.