Download App

అభినవ కౌటిల్యుడు ‘హిమాంత్ బిశ్వా శర్మ’

డిసెంబర్ 12, 2025 • By Rahul N
ఢిల్లీలోని రాజకీయవర్గాల్లో అస్సాం ముఖ్య మంత్రి హిమాంత బిశ్వా శర్మ ని…… అనాటి కౌటిల్యుడు ని నందవంశపు రాజు మహపద్మనందుడు, తన ఎనిమిది మంది కుమారులతో పాలించేవాడు. ఒకరోజు చాణక్యుడు నందరాజుల సభకు వచ్చి అక్కడ ఉన్న …. ఉన్నతాసనముపై కూర్చున్నాడు. నందులు అక్కడికి అధికారం అనే మత్తు...
అభినవ కౌటిల్యుడు 'హిమాంత్ బిశ్వా శర్మ'

ఢిల్లీలోని రాజకీయవర్గాల్లో అస్సాం ముఖ్య మంత్రి హిమాంత బిశ్వా శర్మ ని…… అనాటి కౌటిల్యుడు ని నందవంశపు రాజు మహపద్మనందుడు, తన ఎనిమిది మంది కుమారులతో పాలించేవాడు.

ఒకరోజు చాణక్యుడు నందరాజుల సభకు వచ్చి అక్కడ ఉన్న …. ఉన్నతాసనముపై కూర్చున్నాడు. నందులు అక్కడికి అధికారం అనే మత్తు తో ఆ పీఠము పై కూర్చున్న చాణక్యుడు ను ఆ పీఠము నుండి గెంటివేసి అవహేళన గా మాట్లాడారు. రాక్షసమంత్రి ఇది అక్రమమం ,పద్ధతి కాదు అని వారించిన వినలేదు. ఉన్నతాసనమునుండి లాగబడిన చాణక్యుడు నందులపై ఆగ్రహించి అందరి మధ్యలో నన్ను ఇలా అవమానించారు. మిమ్మల్ని కూడా ఇదే విధంగా సింహాసనమునుండి లాగి, మీతలలను నరికి గానీ ఈ శిఖ (జుట్టు) ముడి వేయను అని శపథము చేసి సభామందిరమును వదలి వెళ్ళిపోయాడు. తదనంతర కాలంలో చాణక్యుడు తన రాజనీతి తో చంద్ర గుప్త మౌర్యుడ్ని చక్రవర్తి ని చేశాడు…. ఆ రాజ్యానికి…

ఇప్పుడు ఇది ఎందుకు అంటే అస్సాం ముఖ్యమంత్రి విషయంలో కూడా ఇలానే జరిగింది అని డిల్లీ రాజకీయ వర్గాల భోగట్టా….

ఒకసారి రాహుల్ గాంధీ నివాసం లో ఆయనతో సమావేశమై మాట్లాడుకుంటుండగా H B శర్మ కి పెట్టిన స్నాక్స్ ను రాహుల్ గాంధీ పెట్ టచ్ చేయబోతే ఆయన ఆ పెంపుడు జంతువు ను అధిలించబోయారట…. దానితో ఆయనకు కోపం వచ్చి సీరియస్ అయ్యారని…. అలా అవమాన భారంతో బయటకు వచ్చి…. ఈశాన్య రాష్ట్రాల్లో తానేమిటో నిరూపిస్తానని అభినవ కౌటిల్యుడు లా “హిమాంత్ బిశ్వా శర్మ” ప్రతిన బూనిన వ్యక్తి.

ఒక శక్తి లా మారి అస్సాం ముఖ్యమంత్రి గా పీఠం అధిరోహించడమే గాక ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్ ని తుడిచిబెట్టేసి బీజేపీ జెండా ఎగురవేయడం లో తన వంతు పాత్రని పోషించడమే గాక, రోహింగ్యాల ఏరివేతలో వారిని బంగ్లాదేశ్ కి తిప్పి పంపడం లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు…

భారత దేశంలో బీజేపీ నాయకుల్లో తను ఒక ముఖ్యమైన నాయకుడిగా తనదైన ముద్ర వేసి యువతను ఆకర్షిస్తున్నారు.

అవమానాన్ని మనసులో పెట్టుకుని ప్రతీకారం వైపు ఆలోచిస్తే, కోపం, ఈర్ష్య, ద్వేషం వంటి నెగెటివ్ భావాలు ఎక్కువై, మానసిక ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన పెరిగి అనారోగ్యానికి గురి అవుతారు.

అదే అవమానాన్ని “నన్ను నిరూపించుకోవాలి” అనే లక్ష్యంగా మార్చుకుంటే, అది కష్టపడి పని చేయాలనే తపన, డిసిప్లిన్, సక్సెస్‌ వైపు నడిపించే సానుకూల కసిగా మారుతుంది.

అలా మార్చుకున్నవాళ్లే ఒక అభినవ కౌటిల్యుడు “హిమాంత బిశ్వా శర్మ”. అభినవ శ్రీ కృష్ణ దేవరాయ “పవన్ కళ్యాణ్ “

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading