Download App

ఉగాది నుంచి పీ-4 ప్రాజెక్టు

ఫిబ్రవరి 28, 2025 By Srinivas
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ-4 పథకాన్ని ఉగాది నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 4 గ్రామాల్లో ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని నిర్వహిస్తారు. సాధ్యాసాధ్యాలు, టెక్నికల్ అవరోధాలు అన్నింటినీ పరిశీలించి, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.సంపదలో ఉన్నత కుటుంబాలు,...

ఉగాది నుంచి పీ-4 ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ-4 పథకాన్ని ఉగాది నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 4 గ్రామాల్లో ముందుగా పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని నిర్వహిస్తారు. సాధ్యాసాధ్యాలు, టెక్నికల్ అవరోధాలు అన్నింటినీ పరిశీలించి, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు.

సంపదలో ఉన్నత కుటుంబాలు, పేద కుటుంబాల్ని ఆదుకోవడమే పీ-4 ఉద్దేశం. ఇందులో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదు. కేవలం పేద కుటుంబాల్ని మాత్రమే ఎంపిక చేస్తుంది. వాళ్లను సంపన్న కుటుంబాలతో కలుపుతుంది. కుటుంబాల్ని మ్యాచ్ చేయడం, వాళ్ల మధ్య కనెక్షన్ ఏర్పాటుచేయడం, ట్రాక్ చేయడం వరకు మాత్రమే ప్రభుత్వం చేస్తుంది.

సహాయం ఏ రూపంలో జరిగినప్పటికీ అది నేరుగా సంపన్న కుటుంబం నుంచి లబ్దిదారు కుటుంబానికి అందుకుంది. మధ్యలో ఎవ్వరూ ఉండరు. పైలెట్ ప్రాజెక్టు కింద 5869 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. వీటిలో ఉన్న ప్రాక్టికల్ ఇబ్బందుల్ని గమనించి, వాటిని సవరించి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో రాష్ట్రమంతటా విస్తరిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40లక్షల కుటుంబాలు పీ-4 పథకానికి అర్హులని ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి సంబంధించి సర్వే ఆల్రెడీ మొదలైంది. లబ్దిదారుల వివరాల్ని సమృద్ధి బంధనం పోర్టల్ లో నమోదు చేస్తారు. సాయం అందించాలనుకునే సంపన్న కుటుంబాల్ని ఈ పోర్టల్ ద్వారా అనుసంధానం చేస్తారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading