Download App

ఏబీ వెంకటేశ్వరరావుపై కేసు పూర్తిగా రద్దు – ఏపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన

జూలై 16, 2025 • By Rahul N
మాజీ ఇంటలిజెన్స్ అదనపు డీజీపీ ఏ.బీ. వెంకటేశ్వరరావుపై నమోదైన కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా విరమించుకుంది. హైకోర్టు ఎఫ్‌ఐఆర్ మరియు చార్జిషీట్‌ను రద్దు చేసిన నేపథ్యంలో, ఇకపై ఆయనపై ఎటువంటి చట్టపరమైన లేదా శాఖాపరమైన చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన...

మాజీ ఇంటలిజెన్స్ అదనపు డీజీపీ ఏ.బీ. వెంకటేశ్వరరావుపై నమోదైన కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా విరమించుకుంది. హైకోర్టు ఎఫ్‌ఐఆర్ మరియు చార్జిషీట్‌ను రద్దు చేసిన నేపథ్యంలో, ఇకపై ఆయనపై ఎటువంటి చట్టపరమైన లేదా శాఖాపరమైన చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ జారీ చేసిన జి.ఓ. ఆర్.టి. నెం.1334లో వివరాలు వెల్లడయ్యాయి. ఏసీబీ చేసిన కేసులో 120(బి) – క్రిమినల్ కుట్ర, 420 – మోసం, 409 – నమ్మకద్రోహం వంటి సెక్షన్లు, అలాగే అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలు ఉన్నాయి. అయితే, వెంకటేశ్వరరావు వేసిన క్రిమినల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ఈ ఎఫ్‌ఐఆర్‌ను తోసిపుచ్చింది.

దీంతో, ఈ కేసును సుప్రీంకోర్టులోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావించి, స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయకూడదని నిర్ణయించింది. తద్వారా, కేసును పూర్తిగా ముగిస్తామంటూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదలయ్యాయి.

ఈ నిర్ణయాన్ని అమలుచేయాలని డీజీపీకి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading