
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువత ఆశల ప్రతీకగా నిలుస్తున్న నారా లోకేష్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. పుట్టినరోజు ఆనందాన్ని వ్యక్తిగతంగా జరుపుకునే క్షణాలకంటే, రాష్ట్ర భవిష్యత్తు, యువత అవకాశాల గురించే ఆలోచిస్తూ నిరంతరం పనిచేయడం నారా లోకేష్ నాయకత్వానికి ప్రత్యేకతగా నిలుస్తోంది.

పుట్టినరోజు నాడు కూడా ఆయన విశ్రాంతి లేకుండా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సదస్సులో పాల్గొంటూ, ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర ప్రయోజనాలను బలంగా వినిపిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్న ఆయన నిబద్ధతకు ఇది మరో నిదర్శనం.
మంత్రిగా నారా లోకేష్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభించిన పథకాలు ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, యువత ఉపాధి అవకాశాలపై ఆయన చూపుతున్న దృష్టి రాష్ట్రానికి దీర్ఘకాల ప్రయోజనాలను అందించేలా ఉంది. పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ సృష్టి లక్ష్యంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్ ఆంధ్రప్రదేశ్‌కు బలమైన పునాదిగా మారుతున్నాయి.

ఇక ప్రజలతో నేరుగా మమేకమయ్యే నాయకుడిగా కూడా నారా లోకేష్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. “ఆపదలో ఉన్నా… ఆదుకోండి”, “నా సమస్యను పరిష్కరించండి” అంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకున్న వేలాది మందికి రాజకీయాలకు అతీతంగా సహాయం చేయాలనే మహోన్నత సంకల్పంతో ఆయన ముందడుగు వేశారు. రాజకీయంగా వచ్చే ప్రతి విమర్శకు మాటలతో కాకుండా, పనితోనే సమాధానం చెబుతూ, సహాయం అంటేనే నారా లోకేష్ అనే పేరు గుర్తొచ్చే స్థాయికి ఎదిగారు.
ఈరోజు వేలాది మంది హృదయాలను గెలుచుకున్న యువనేతగా, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే ఆపద్బాంధవుడిగా నారా లోకేష్ ప్రజల్లో విశేషమైన ఆదరణ పొందుతున్నారు. ఆయన ఇచ్చే స్ఫూర్తితో సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చేందుకు అనేక మంది సిద్ధంగా ఉండటం ఆయన నాయకత్వ విజయానికి నిదర్శనం.

ఈ ప్రత్యేక సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి అంకితమైన యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా, మరిన్ని విజయాలతో ఆయన రాజకీయ ప్రయాణం కొనసాగాలని ఆకాంక్షిద్దాం.
