Download App

అన్నీ ఆరా తీస్తున్నాను – మంత్రి కందుల దుర్గేష్

మే 25, 2025 • By Rahul N
చిత్ర పరిశ్రమకు, ఎగ్జిబిటర్లకు, డిస్టిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకే హోం శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో విచారణ చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఈ...
అన్నీ ఆరా తీస్తున్నాను - మంత్రి కందుల దుర్గేష్

చిత్ర పరిశ్రమకు, ఎగ్జిబిటర్లకు, డిస్టిబ్యూటర్లకు ప్రొడ్యూసర్లకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకునేందుకే హోం శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో విచారణ చేపడుతున్నామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలోని హుకుంపేటలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించారు.

జూన్ 1వ తేదీ నుండి సినిమా థియేటర్ల బంద్ చేయబోతున్నారన్న విషయం కొన్ని రోజులుగా ప్రచారంలోకి వచ్చిందని, ఈ క్రమంలో ఎందుకు ఈ వాతావరణం తెరపైకి వచ్చిందని, దీనికి ప్రోద్భలం అందిస్తున్న వ్యక్తులెవరు, జరుగుతున్నదేమిటి తదితర అంశాలన్నింటిపై విచారణ జరిగితే చిత్ర పరిశ్రమకు ఉపయోగపడే విధానాలను అవలంబించేందుకు వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ విషయం తెలియగానే హోం శాఖ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ తో చర్చించానన్నారు. ఈ అంశంపై లోతుగా విచారణ చేయాలని ఆదేశించానన్నారు. తద్వారా అసలు విషయం వెలుగులోకి వస్తుందని అనంతరం తమ చర్యలుంటాయన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అన్ని అంశాలను పరిశీలించి, లోతుగా అధ్యయనం చేసి సినీ పరిశ్రమకు సహకారం అందించాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు చెందిన వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్యలను ఆరా తీసి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని భరోసానిచ్చిన విషయం గుర్తుచేశారు.

ఇప్పటివరకు సినీ పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ ఆకస్మాత్తుగా థియేటర్ల బంద్ అనే అంశం తెరపైకి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు.దీని వెనుక ఉన్న కారణాలను ఆరా తీస్తున్నామన్నారు. జూన్ 12వ తేదీన సినీ నటులు పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు చిత్రం విడుదలవుతున్న సందర్భంలో ఈ రకమైన వాతావరణం ఎందుకు వచ్చిందో తెలియడం లేదన్నారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. థియేటర్ల మూసివేత అనే అంశంలో ఎవరితోనైనా చర్చించి నిర్ణయం తీసుకున్నారా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు

Trending Now

No trending articles in this category from the last 3 days.