Download App

రాయలసీమను రతనాల సీమగా మారుస్తా: చంద్రబాబు

మే 15, 2026 • By Suresh Thota
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నేడు అనగా 2026 మే 15 వ తేదీన, అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్లతో రమారమి, 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు...
రాయలసీమను రతనాల సీమగా మారుస్తా: చంద్రబాబు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నేడు అనగా 2026 మే 15 వ తేదీన, అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్లతో రమారమి, 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

భారత రక్షణ రంగ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఐదవ తరం యుద్ధ విమానం “అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్” (AMCA) తయారీ కేంద్రానికి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈ రోజు పునాది పడింది. కేంద్ర రక్షణ మంత్రి “రాజ్‌నాథ్ సింగ్”, ముఖ్యమంత్రి “నారా చంద్రబాబు నాయుడు” ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రాబోయే దశాబ్దాల్లో భారత వాయుసేన కు వెన్నెముకగా నిలిచే ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ వేదిక కావడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి నిదర్శనం.

రాయలసీమను రతనాల సీమగా మారుస్తా: చంద్రబాబు

ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక అసెంబ్లింగ్ యూనిట్ మాత్రమే కాదు, ఇది దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ ఎకోసిస్టమ్‌కు పునాది. ఇక్కడ అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీతో యుద్ధ విమానాల రూపకల్పన జరుగుతుంది. ప్రారంభంలో అమెరికాకు చెందిన జి.ఇ(GE ) సంస్థ ఇంజిన్లను వాడినప్పటికీ, భవిష్యత్తులో ఫ్రాన్స్ లేదా బ్రిటన్ సహకారంతో భారత్ సొంతంగా తయారు చేయబోయే శక్తివంతమైన ఇంజిన్ల అనుసంధానం కూడా ఇక్కడే జరగనుంది. తద్వారా రక్షణ రంగ ఎగుమతుల్లో భారత్ ప్రపంచ దేశాలకు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

రాయలసీమ ప్రాంతాన్ని ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేయడం వెనుక బలమైన వ్యూహం ఉంది. ఈ ప్రాంతం భౌగోళికంగా బెంగళూరు (HAL, DRDO ప్రధాన కేంద్రాలు) మరియు హైదరాబాద్ (డిఫెన్స్ లాబ్స్) నగరాలకు మధ్యలో ఉండటం మే గాక, రక్షణ రంగానికి అవసరమైన మౌలిక వసతులు, విశాలమైన భూమి, మరియు వ్యూహాత్మక రక్షణ అనుకూలతలు రాయలసీమలో మెండుగా ఉండటంతో, దీనిని “రక్షణ రంగ కారిడార్‌”గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెనుకబడిన ప్రాంతంగా ముద్రపడ్డ సీమను పారిశ్రామికంగా అగ్రపథాన నిలిపేందుకు ఇదొక గొప్ప అవకాశం.

రాయలసీమను రతనాల సీమగా మారుస్తా: చంద్రబాబు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ… పుట్టపర్తి భవిష్యత్తులో దేశం గర్వించే రక్షణ కేంద్రం కాబోతోందన్నారు. పుట్టపర్తి పేరు చెబితే సత్యసాయిబాబా గుర్తొస్తారని.. ఇప్పుడు యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుతో దేశవ్యాప్తంగా ఈ పేరు వినిపిస్తుందన్నారు. రాయలసీమ రూపు రేఖల్ని కేంద్ర సహకారంతో మార్చబోతున్నామని.. మళ్లీ రాయలసీమ ను రతనాలసీమగా మార్చే బాధ్యతను తాను తీసుకుంటున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ డిఫెన్స్ హబ్‌గా మారుస్తామని, గతంలో “కియా” మోటార్స్ కార్ల తయారీ సంస్థ ద్వారా అనంతపురం రూపురేఖలు మారినట్లే, ఇప్పుడు AMCA మరియు ఇతర రక్షణ ప్రాజెక్టుల ద్వారా వేల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని చెప్పారు. రాయలసీమ యువతకు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవసరం లేకుండా, ఇక్కడే అంతర్జాతీయ స్థాయి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏపీ ప్రభుత్వ చొరవను ప్రత్యేకంగా కొనియాడారు. “చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా పెద్ద ఆస్తి. ఆయన విజన్ , టెక్నాలజీని అంది పుచ్చుకోవడంలో ఆయన వేగం ఆశ్చర్యపరుస్తుంది” అని ప్రశంసించారు. యుద్ధ విమానాల తయారీతో పాటు, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న ‘డ్రోన్ సిటీ’ ద్వారా ఏపీ రక్షణ రంగంలో ఒక కొత్త ప్రమాణాన్ని, నెలకొల్పుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

రాయలసీమను రతనాల సీమగా మారుస్తా: చంద్రబాబు

ఏపీ ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్ట్ విజయంపై తన స్పందనను ఈ విధంగా తెలియజేశారు. “ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా మార్చాలన్న మా లక్ష్యంలో ఇదొక మైలురాయి. కేవలం విమానాల తయారీ మాత్రమే కాదు, వేల సంఖ్యలో ఎం.ఎస్.ఎం.ఈ (MSME) యూనిట్లు ఇక్కడకు రాబోతున్నాయి. రాయలసీమలో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు కొదవ లేదు, వారికి ఈ ప్రాజెక్ట్ ఒక వరం” అని లోకేష్ పేర్కొన్నారు. యువతకు శిక్షణ ఇచ్చి ఈ పరిశ్రమల్లో భాగస్వాములను చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా సుమారు 7,500 మందికి, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. దీనికి అనుబంధంగా మడకశిరలో అమ్మోనియం ప్లాంట్, అనకాపల్లిలో నేవల్ సిస్టమ్స్ వంటి మరిన్ని ప్రాజెక్టులు కూడా రాష్ట్రానికి రావడం విశేషం. దీనివల్ల ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన స్థానిక యువతకు స్థానికంగానే ఉన్నత స్థాయి ఉద్యోగాలు దక్కనున్నాయి. మరికొన్ని ప్రాజెక్టులకు పుట్టపర్తి నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

రాయలసీమను రతనాల సీమగా మారుస్తా: చంద్రబాబు

రాయలసీమ పేరు దేశవ్యాప్తంగా ,నలుదిశలా రక్షణ రంగ శబ్దంతో మారుమోగనుంది. కరువు కోరల్లో చిక్కుకున్న సీమ, ఇప్పుడు యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా మారి “ప్రపంచ చిత్రపటం”లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోబోతోంది. అటు కేంద్రం సహకారం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల తోడైతే, “ఆంధ్రప్రదేశ్” రక్షణ రంగంలో సరికొత్త అధ్యాయం లిఖించబోతుంది.

ఈ కార్యక్రమంలో… (DRDO) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, (ADA) ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ అధికారులు తో పాటు, పారిశ్రామిక భాగస్వాములు అయిన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ (Tata Advanced Systems), లార్సెన్ అండ్ టూబ్రో (L&T), భారత్ ఫోర్జ్ (Bharat Forge) సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading