Download App

నారా లోకేష్–జెరా కీలక భేటీ: ఏపీలో గ్రీన్ అమ్మోనియా, క్లీన్ఎనర్జీ ప్రాజెక్టులకు ఆహ్వానం

జనవరి 21, 2026 • By Rahul N
దావోస్ (స్విట్జర్లాండ్): జపాన్‌కు చెందిన ప్రముఖ రెన్యువబుల్ ఎనర్జీ దిగ్గజం JERA గ్లోబల్ సీఈవో & చైర్ Yukio Kaniతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ క్లీన్ ఎనర్జీ హబ్‌గా అభివృద్ధి చేయడానికి...
నారా లోకేష్–జెరా కీలక భేటీ: ఏపీలో గ్రీన్ అమ్మోనియా, క్లీన్ఎనర్జీ ప్రాజెక్టులకు ఆహ్వానం

దావోస్ (స్విట్జర్లాండ్): జపాన్‌కు చెందిన ప్రముఖ రెన్యువబుల్ ఎనర్జీ దిగ్గజం JERA గ్లోబల్ సీఈవో & చైర్ Yukio Kaniతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ క్లీన్ ఎనర్జీ హబ్‌గా అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, జపాన్‌తో పాటు ఇతర ఆసియా మార్కెట్లకు లో-కార్బన్ అమ్మోనియా సరఫరా చేయడానికి ఆంధ్రప్రదేశ్‌లోని మూలపేట పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్, కాకినాడ పోర్ట్ మౌలిక సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ పోర్టుల సమీపంలో గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు జెరాను ఆహ్వానించారు.

నారా లోకేష్–జెరా కీలక భేటీ: ఏపీలో గ్రీన్ అమ్మోనియా, క్లీన్ఎనర్జీ ప్రాజెక్టులకు ఆహ్వానం

అలాగే, పారిశ్రామిక వినియోగదారులకు స్థిరమైన క్లీన్ ఎనర్జీ సరఫరా లక్ష్యంగా రాయలసీమ ప్రాంతంలో సౌర–పవన హైబ్రిడ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని మంత్రి కోరారు. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం వంటి పోర్ట్ ఆధారిత పారిశ్రామిక నోడ్‌లలో పునరుత్పాదక ఇంధన వనరులు, ఎల్ఎన్‌జీ/లో-కార్బన్ అమ్మోనియా మౌలిక సదుపాయాలు, తయారీ రంగాలను సమన్వయపరిచే ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ప్లాట్‌ఫారమ్‌లు రూపొందించాలని ప్రతిపాదించారు.

గ్రిడ్ విశ్వసనీయతను కొనసాగిస్తూనే ఉద్గారాల తగ్గింపునకు దోహదపడేలా, థర్మల్ పవర్ ప్లాంట్లలో అమ్మోనియా కో-ఫైరింగ్ పైలట్ ప్రాజెక్టులను అంచనా వేసి అమలు చేయడానికి APGENCO, NTPC వంటి సంస్థలతో భాగస్వామ్యం వహించాలని మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు.

నారా లోకేష్–జెరా కీలక భేటీ: ఏపీలో గ్రీన్ అమ్మోనియా, క్లీన్ఎనర్జీ ప్రాజెక్టులకు ఆహ్వానం

ఈ సమావేశంలో స్పందించిన జెరా గ్లోబల్ సీఈవో యుకియో కాని, జపాన్ భవిష్యత్ క్లీన్ ఇంధన అవసరాల కోసం భారతదేశంలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వాల్యూ చైన్ల అభివృద్ధిపై జెరా దృష్టి సారించిందని తెలిపారు. ReNew Energy Globalతో భాగస్వామ్యంగా యుటిలిటీ-స్కేల్ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిలో జెరా పనిచేస్తోందని వెల్లడించారు. అలాగే పునరుత్పాదక శక్తితో పాటు ఎల్ఎన్‌జీ ఆధారిత విద్యుత్ పరివర్తన, గ్రిడ్-బ్యాలెన్సింగ్ పరిష్కారాలపై కూడా దృష్టి పెట్టినట్లు తెలిపారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading