Download App

నారా లోకేష్: “మాతృభాషే పునాది – భారత్ ఫస్ట్ మా ధ్యేయం”

సెప్టెంబర్ 10, 2025 • By Srinivas
ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్ 2025లో పాల్గొన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు కీలక అంశాలపై స్పందించారు. నూతన విద్యా విధానం (NEP) నుండి కులగణన, కేంద్రంతో పొత్తు, తెలుగు గర్వం వరకు తన అభిప్రాయాలను స్పష్టంగా తెలిపారు. NEP & మూడు భాషల...
నారా లోకేష్ : "మాతృభాషే పునాది – భారత్ ఫస్ట్ మా ధ్యేయం"

ఇండియా టుడే సౌత్ కాన్‌క్లేవ్ 2025లో పాల్గొన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు కీలక అంశాలపై స్పందించారు. నూతన విద్యా విధానం (NEP) నుండి కులగణన, కేంద్రంతో పొత్తు, తెలుగు గర్వం వరకు తన అభిప్రాయాలను స్పష్టంగా తెలిపారు.

NEP & మూడు భాషల విధానం

లోకేష్ మాట్లాడుతూ, “మూడు భాషల విధానాన్ని మేము సమర్థిస్తున్నాం. విద్యా పునాది ఎల్లప్పుడూ మాతృభాషలోనే ఉండాలి. హిందీని ఎవరూ బలవంతం చేయడం లేదు. రాజకీయాలకోసం భాషను వాడొద్దు” అని స్పష్టం చేశారు. “నేను మూడు భాషల ఫలితం. చదువుపై దృష్టి పెట్టాలి, రాజకీయాలపై కాదు” అని అన్నారు.

స్కిల్ సెన్సస్ కులగణన కాదు

చంద్రబాబు నాయుడు విజన్ గురించి మాట్లాడుతూ, “స్కిల్ సెన్సస్, కులగణన కాదు” అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన నైపుణ్యం పోర్టల్ ద్వారా ప్రతి పౌరుని నైపుణ్యాలను మ్యాప్ చేసి, శిక్షణ, పరిశ్రమల అనుసంధానం, ఉపాధి అవకాశాలకు వినియోగిస్తామని వివరించారు. పాఠ్యాంశాలలో లింగ వైవిధ్యాన్ని ప్రతిబింబించే సంస్కరణలు కూడా చేపడుతున్నామని చెప్పారు. “మేము టాలెంట్ డ్రైవన్ ఎకానమీని నిర్మిస్తున్నాం” అని లోకేష్ తెలిపారు.

నారా లోకేష్ : "మాతృభాషే పునాది – భారత్ ఫస్ట్ మా ధ్యేయం"

ఎన్డీఏతో దీర్ఘకాలిక బంధం

రాజకీయ కూటముల గురించి మాట్లాడుతూ లోకేష్, “2029 తరువాత కూడా టిడిపి ఎన్డీఏతోనే ఉంటుంది. మేము కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి భేషరతుగా మద్దతు ఇస్తాం. భారత్ అభివృద్ధి, స్థిరత్వమే మా లక్ష్యం” అని అన్నారు. మాకు దేశం ముఖ్యం అని స్పష్టం చేశారు.

తెలుగు గర్వం – భారత్ ఫస్ట్

ప్రాంతీయత , జాతీయత ఒకదానితో మరొకటి విరుద్ధం కాదని లోకేష్ పేర్కొన్నారు. “మా మార్గదర్శక తత్వం – భారత్ ఫస్ట్” అన్నారు. ఎన్డీఏ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థికి టిడిపి మద్దతు తెలపడం కూడా అదే సిద్ధాంతానికి అనుగుణమని చెప్పారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

మరిన్ని వార్తలు

Trending Now

No trending articles in this category from the last 3 days.