Download App

ఏపీకి ఈ 10 నెలల్లో ఎన్డీఏ కేటాయింపులు: మోదీ

మే 3, 2025 By Srinivas
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి హాజరైన ప్రధాని.. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం, 15వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఇక హడ్కో ద్వారా అమరావతి నిర్మాణానికి 11వేల...
ఏపీలో రైల్వే అభివృద్ధికి భారీగా నిధులు: ప్రధానమంత్రి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి హాజరైన ప్రధాని.. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం, 15వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు.

ఇక హడ్కో ద్వారా అమరావతి నిర్మాణానికి 11వేల కోట్లు ఇప్పించామని, పోలవరం ప్రాజెక్టుకు కొత్తగా 12,157 కోట్ల రూపాయలు కేటాయించామని అన్నారు మోదీ. ఇలా ఏపీ సమగ్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు.

ఏపీకి ఈ 10 నెలల్లో ఎన్డీఏ కేటాయింపులు: మోదీ

ఈ 10 నెలల్లో కేంద్రం నుంచి వివిధ పథకాల కింద, రాష్ట్రానికి వచ్చిన నిధుల్ను ప్రధాని వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • పేదలకు అందించే టిడ్కో(TIDCO) గృహాల నిర్మాణానికి రూ.4400 కోట్లు
  • రాష్ట్రంలో రైల్వే రంగ అభివృద్ధి కోసం రూ.73,743 కోట్లు
  • తిరుపతి జిల్లా కృష్ణపట్నంలో రూ.2139 కోట్లతో KRIS సిటీ
  • అనకాపల్లి జిల్లా పూడి మడకలో రూ.1,85,000 కోట్లతో NGEL గ్రీన్ హైడ్రోజన్ కేంద్రం
  • అమరావతికి రూ.2,245 కోట్లతో నూతన రైల్వే లైన్ మంజూరు
  • స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కొరకు రూ.11, 440 కోట్లు
  • విశాఖ జిల్లా నక్కపల్లిలో రూ.1877కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్
  • CRIF పథకం క్రింద 200.06 కి.మీ పొడవున 13 రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.400 కోట్లు
  • రణస్థలం 6-లేన్ ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధికి రూ.252.42 కోట్లు
  • గుంటూరు – నల్లపాడు ROB నిర్మాణానికి రూ.198 కోట్లు
  • పెట్రోలియం యూనివర్శిటీ ఏర్పాటు కోసం రూ.168 కోట్లు
Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading