Download App

పవన్ కళ్యాణ్ మ్యాజిక్ డ్రెయిన్స్ పథకం చాలా మంచిది… PV సింధు

మే 5, 2026 By Suresh Thota
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం ఇప్పటికీ ఒక తీవ్రమైన సవాలుగానే ఉంది. మురుగు నీటి పారుదల వ్యవస్థల లోపం, నిల్వ నీటి సమస్యలు, దుర్వాసనలు, ఇవన్నీ కలిపి ప్రజల ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన "మ్యాజిక్ డ్రెయిన్స్"...
పవన్ కళ్యాణ్ మ్యాజిక్ డ్రెయిన్స్ పథకం చాలా మంచిది… PV సింధు

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం ఇప్పటికీ ఒక తీవ్రమైన సవాలుగానే ఉంది. మురుగు నీటి పారుదల వ్యవస్థల లోపం, నిల్వ నీటి సమస్యలు, దుర్వాసనలు, ఇవన్నీ కలిపి ప్రజల ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన “మ్యాజిక్ డ్రెయిన్స్” అనే కాన్సెప్ట్ సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇది మూడు స్థాయిల ఫిల్టర్ బెడ్స్, ఇంకుడు గుంతల ద్వారా మురుగు నీటిని భూగర్భ జలాలుగా మార్చడం అనే వినూత్న ఆలోచన గా కనిపిస్తోంది. ముఖ్యంగా సిమెంట్ డ్రెయిన్లతో పోలిస్తే 80 శాతం వరకు వ్యయం తగ్గుతుందని చెప్పడం పెద్ద ప్లస్ పాయింట్. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ క్రీడాకారిణి P. V. సింధు ప్రశంసించడం వల్ల ఇది మరింత ప్రచారంలోకి వచ్చింది.

P V సింధు మాట్లాడుతూ…. ఇటువంటి పథకాలు ప్రజలు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించే వెసులుబాటు కల్పిస్తాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో ఇలాంటి ముందు చూపుతో కూడిన వినూత్న కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, శ్రీ పవన్ కళ్యాణ్ గారి దార్శనికత్వంలో గ్రామీణాంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. ఇక్కడ వరకు ఓకే.

పవన్ కళ్యాణ్ మ్యాజిక్ డ్రెయిన్స్ పథకం చాలా మంచిది… PV సింధు

కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న….లేవనెత్తుతున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు…. ఈ “మ్యాజిక్” డ్రైన్ నిజంగా గ్రౌండ్ లెవెల్‌లో పనిచేస్తుందా…. లేదా…. ఇది కూడా పేపర్ మీద బాగానే కనిపించే మరో స్కీమ్‌గా మిగిలిపోతుందా….? ఇలాంటి వ్యవస్థలు సక్సెస్ కావాలంటే రెండు కీలక అంశాలు అవసరం. ఒకటి సరిగ్గా డిజైన్, రెండోది నిరంతర పర్యవేక్షణ తో కూడిన నిర్వహణ. ఫిల్టర్ బెడ్స్ క్లాగ్ అయితే…..? ఇంకుడు గుంతలు సరిగ్గా పనిచేయకపోతే….? గ్రామ స్థాయిలో ఎవరు మానిటర్ చేస్తారు. ఇవన్నీ ఇప్పటికీ క్లియర్ కాని ప్రశ్నలే.

గతంలో కూడా గ్రామీణ అభివృద్ధి పేరిట అనేక పథకాలు ప్రారంభమయ్యాయి, కానీ నిర్వహణ లోపంతో విఫలమయ్యాయి, ఇది మనకు కొత్త విషయం కాదు. ఇంకో కోణం కూడా చూడాలి. మురుగు నీటిని భూగర్భ జలాల్లోకి పంపడం అనే ఐడియా సరిగ్గా అమలు అయితే మంచిదే. కానీ ఫిల్ట్రేషన్ లోపిస్తే అదే నీరు భూగర్భ జలాలను కలుషితం చేసే ప్రమాదం ఉంది. దీని వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే, ఇదే “సొల్యూషన్” కాదు. తప్పుగా అమలు చేస్తే “రిస్క్” కూడా….

అయినా సరే, ప్రతి కొత్త ఆలోచనను మొదట్లోనే తిరస్కరించడం సరైంది కాదు. గ్రామీణ పారిశుధ్యానికి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన పరిష్కారం కనుగొనడం అత్యవసరం. ఈ దిశగా “మ్యాజిక్ డ్రెయిన్స్” ఒక ప్రయోగాత్మక ప్రయత్నంగా చూడవచ్చు. కానీ దీన్ని విజయవంతం చేయాలంటే కేవలం ప్రచారం సరిపోదు డేటా, ఫలితాలు, పారదర్శకత అవసరం.

మొత్తానికి, పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఈ ఆలోచన లో మంచి పలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో గట్టి పరీక్షలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది నిజంగా గ్రామీణాంధ్రలో పారిశుధ్య విప్లవాన్ని తీసుకురాగలదా? లేదా మరో తాత్కాలిక ప్రచార ప్రాజెక్ట్‌గా మిగిలిపోతుందా? అన్నది రాబోయే రోజుల్లో కాలమే నిర్ణయిస్తుంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading