Download App

గ్రామ స్వరాజ్యానికి… పవన్ కళ్యాణ్ కొత్త బాట…

మే 19, 2026 • By Suresh Thota
"ఇంటిని చూసి ఇల్లాలు గురించి చెప్పవచ్చు, రాజ్యాన్ని చూసి రాజు గుణం చెప్పవచ్చు అన్నారు" పెద్దలు. ఒక ఇల్లు బాగుండాలంటే ఆ ఇంటి ఇల్లాలు ఎంత ముఖ్యమో, ఒక రాజ్యం బాగుండాలంటే ఆ దేశాన్ని పాలించే రాజు (నాయకుడు)గుణం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు...
గ్రామ స్వరాజ్యానికి… పవన్ కళ్యాణ్ కొత్త బాట…

“ఇంటిని చూసి ఇల్లాలు గురించి చెప్పవచ్చు, రాజ్యాన్ని చూసి రాజు గుణం చెప్పవచ్చు అన్నారు” పెద్దలు. ఒక ఇల్లు బాగుండాలంటే ఆ ఇంటి ఇల్లాలు ఎంత ముఖ్యమో, ఒక రాజ్యం బాగుండాలంటే ఆ దేశాన్ని పాలించే రాజు (నాయకుడు)గుణం కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేవు. కాని రాజుల స్థానంలో నాయకులు వచ్చారు. ఇప్పటి కాలానికి మంత్రి ని చూసి ఆ శాఖ గురించి చెప్పవచ్చు.

ఒక దేశం ఎంత పురోగతి సాధించిందనేది ఆ దేశంలోని నగరాలలో, ఆకాశ హర్మ్యాలును, అద్దాల మేడలను బట్టి కాదు, పల్లెల్లోని మౌలిక వసతులను బట్టి కొలుస్తారు. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముతూ.. ఆంధ్రప్రదేశ్ పల్లె సీమల రూపురేఖలను మార్చేందుకు నడుం బిగించారు, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ . కేవలం నిధులు కేటాయించడమే కాదు, కేటాయించిన ప్రతి పైసా ప్రజల కళ్ల ముందే ఖర్చవ్వాలనే, సరికొత్త పాలనా సంస్కరణకు ఆయన శ్రీకారం చుట్టారు.

ఇటీవల పంచాయతీ రాజ్, ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం.. పల్లెల అభివృద్ధిపై ఆయనకున్న స్పష్టమైన దార్శనికతకు (Vision) అద్దం పడుతోంది. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామాభివృద్ధిని ఎలా సాదించవచ్చో, ఆయన తీసుకున్న నిర్ణయాలు నిరూపిస్తున్నాయి.

గ్రామ స్వరాజ్యానికి… పవన్ కళ్యాణ్ కొత్త బాట…

పబ్లిక్ డ్యాష్ బోర్డులతో జవాబుదారీతనం…. అవును పాలనలో అవినీతికి తావుండకూడదన్నా, పనుల్లో జాప్యం తగ్గాలన్నా, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గట్టిగా నమ్ముతారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, వాటి పురోగతిని ఎప్పటికప్పుడు ప్రజలు నేరుగా తెలుసుకునేలా ఒక ప్రత్యేక పబ్లిక్ డ్యాష్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

1)ఎక్కడ రోడ్డు పడుతోంది…?
2)పని ఎంతవరకు వచ్చింది…?
3)ఏ గడువు లోగా పూర్తి చేయాలి….?
ఇలాంటి వివరాలన్నీ ప్రజల కళ్ల ముందు ఉంచడం ద్వారా అటు అధికారుల్లో, ఇటు కాంట్రాక్టర్లలో పూర్తి బాధ్యత పెరుగుతుంది. “స్వర్ణ పంచాయతీ పోర్టల్” ద్వారా ఇప్పటికే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆన్‌లైన్ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా పన్నుల వసూళ్లను పూర్తి చేసిన పంచాయతీ రాజ్ శాఖ, అదే స్ఫూర్తితో వచ్చే ఏడాది కూడా సొంత ఆదాయ వనరులను పెంచుకుంటూ ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

చెత్త నుండి సంపద సృష్టి…. స్వచ్ఛ రథం నుండి గ్రీన్ షాప్ వైపు…. గ్రామాల్లో పారిశుధ్యం అనేది కేవలం అధికారుల బాధ్యత మాత్రమే కాదు, అది ప్రజా ఉద్యమంగా మారాలనేది ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” ఆకాంక్ష. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా తీసుకొచ్చిన “స్వచ్ఛ రథాలు” ఈ రోజు పల్లెల్లో అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్లలోని పొడి వ్యర్థాలను తీసుకొచ్చి ఈ రథాలకు అందిస్తూ, దానికి ప్రతిఫలంగా నిత్యావసర వస్తువులను తీసుకెళ్లే వినూత్న విధానం గ్రామీణ జీవన శైలిని మారుస్తోంది.

గడిచిన ఏప్రిల్ నెలలోనే ఈ “స్వచ్ఛ రథాల” ద్వారా రికార్డు స్థాయిలో 18.86 లక్షల కేజీల పొడి చెత్తను సేకరించడం విశేషం. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. అంటే.. ఒకప్పుడు రోడ్ల మీద మురికిగా పడి ఉండే వ్యర్థాలను నేడు సంపదగా మార్చారు. ఇదే స్ఫూర్తితో తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా విజయవంతమైన గ్రీన్ షాప్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా, అన్ని నియోజకవర్గాల్లోనూ విస్తరించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్లాస్టిక్ రహిత, పరిశుభ్రమైన పల్లెలే లక్ష్యంగా ఈ సరికొత్త ఆర్ధిక,సామాజిక ప్రయోగం ముందుకు సాగుతోంది.

నిర్దిష్ట సమయం.. రాజీ లేని నాణ్యతతో పల్లెల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక విధానం అనుసరిస్తున్నారు. “నిరంతరం క్షేత్రస్థాయి పరిశీలనలు ఉంటేనే రోడ్ల పరిస్థితి అర్థమవుతుంది.” అధికారులు ఏ పని మొదలుపెట్టినా దానికి నిర్దిష్ట గడువు (Deadline) విధించుకోవాలని, నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడకూడదని తేల్చి చెప్పారు. ప్రజల నుండి వచ్చే ప్రతి వినతిని బాధ్యతగా స్వీకరించి, సకాలంలో నాణ్యమైన రహదారులను నిర్మించడమే లక్ష్యంగా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగం పనిచేయాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్.

ముగింపు: మహాత్మా గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కేవలం ఉపన్యాసాల ద్వారా రాదు.. ఇలాంటి పారదర్శకమైన, వినూత్నమైన ఆలోచనల ద్వారానే సాధ్యమవుతుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ, ఈఎన్సీ బాలునాయక్ వంటి ఉన్నతాధికారుల సమన్వయంతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నడిపిస్తున్న ఈ పాలనా రథం.. ఏపీ పల్లె సీమలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పారదర్శకత, ప్రజా భాగస్వామ్యం తోడైనప్పుడు.. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియగా మారుతుంది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading