ఆంధ్ర ప్రదేశ్

ప్రధానమంత్రి ప్రశంసలందుకున్న మంత్రి లోకేష్ – యోగాంధ్ర విజయవంతం

Published by
Srinivas

ప్రపంచ వ్యాప్తంగా గమనింపజేసేలా విశాఖపట్నంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ఈరోజు విజయవంతంగా ముగిసింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ విశిష్ట కార్యక్రమం రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.

ఈ సందర్బంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. యోగాంధ్రను విజయవంతంగా నిర్వహించడంలో లోకేష్ తన వంతు పాత్రను అద్భుతంగా పోషించారని, ఈ స్థాయి విజయానికి ఆయన కృషి ఎంతో ముఖ్యమైందని ప్రధాని ప్రశంసలు కురిపించారు.

5 లక్షల మందికి పైగా ప్రజల పాల్గొనంతో గిన్నిస్ రికార్డ్ దిశగా సాగిన యోగాంధ్ర, రాష్ట్ర పరిపాలన సామర్థ్యాన్ని దేశానికి చాటిచెప్పింది. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ప్రధానమంత్రి చేసిన ఈ అభినందనలు మంత్రి లోకేష్‌కు మరింత గౌరవాన్ని తీసుకొచ్చాయి.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయింది. ఒకే చోట 3 లక్షల మందితో నిర్వహించిన యోగాసనాల ప్రదర్శనతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.