Download App

ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుంది: సీఎం చంద్రబాబుతో సింగపూర్ మంత్రుల భేటీ

జూలై 29, 2025 By Srinivas
సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మంత్రి...
ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుంది: సీఎం చంద్రబాబుతో సింగపూర్ మంత్రుల భేటీ

సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా సింగపూర్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ మంత్రి టాన్ సీ లెంగ్ ముఖ్య ప్రకటన చేశారు. 2014–2019 మధ్యలో అమరావతి అభివృద్ధికి తమ సహకారం అందించామని, అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఇబ్బంది పెట్టడంతో సింగపూర్ కన్సార్టియం ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు తెలిపారు.

ఏపీ అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుంది: సీఎం చంద్రబాబుతో సింగపూర్ మంత్రుల భేటీ

“ఆంధ్రప్రదేశ్, అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామ్యం కొనసాగుతుంది. రాష్ట్రంలో పెట్టుబడులు, కార్యకలాపాల విస్తరణకు మేము సిద్ధంగా ఉన్నాం,” అని మంత్రి ప్రకటించారు.

సింగపూర్ ప్రభుత్వ ఈ ప్రకటనపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ, “ఏపీ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను,” అని అన్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading