Download App

సామాజిక బాధ్యత – రాజకీయ సమగ్రత… శ్రేణులకు జనసేనాని దిశానిర్దేశం

మే 16, 2026 • By Suresh Thota
మంగళగిరి వేదికగా జరిగిన "జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశం"లో పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించింది. పన్నెండేళ్ల ప్రస్థానం, పడిలేచిన కెరటంలాంటి పోరాటం, చివరకు ప్రజాక్షేత్రంలో సాధించిన అఖండ విజయం.. ఇవీ జనసేన ప్రస్థానంలో మైలురాళ్లు. అయితే, ఈ విజయం...
సామాజిక బాధ్యత - రాజకీయ సమగ్రత… శ్రేణులకు జనసేనాని దిశానిర్దేశం

మంగళగిరి వేదికగా జరిగిన “జనసేన ఉద్యమి ఆత్మీయ సమావేశం”లో పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించింది. పన్నెండేళ్ల ప్రస్థానం, పడిలేచిన కెరటంలాంటి పోరాటం, చివరకు ప్రజాక్షేత్రంలో సాధించిన అఖండ విజయం.. ఇవీ జనసేన ప్రస్థానంలో మైలురాళ్లు. అయితే, ఈ విజయం ఆషామాషీగా వచ్చింది కాదు, నిరంతర పోరాటం , తెగింపు వల్ల సాధ్యమైంది. ఇప్పుడు జనసేన సంస్థాగత నిర్మాణానికి నడుం బిగించారు. ఈ సభ బలమైన సంస్థాగత నిర్మాణానికి ఆరంభమని జనసేనాని పవన్ కళ్యాణ్ తన తాజా ప్రసంగం ద్వారా స్పష్టం చేశారు. మంగళగిరి వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు అటు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని, ఇటు రాజకీయ వర్గాల్లో ఆలోచనను రేకెత్తించాయి. కేవలం ప్రాంతీయ సమస్యలకే పరిమితం కాకుండా, రాష్ట్ర సమగ్రతను, చారిత్రక సత్యాలను ఆయన ప్రస్తావించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు

‘జై అమరావతి’ వర్సెస్ ‘జై ఆంధ్ర’… విస్తృత దృక్పథం

రాజధాని అమరావతి విషయంలో పవన్ కళ్యాణ్ ఒక కొత్త చర్చకు తెరలేపారు. “జై అమరావతి అంటే అది ఆ 33 వేల ఎకరాల ప్రాంతానికే పరిమితం అవుతుంది.. కానీ “జై ఆంధ్ర” అంటే అది ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవానికి, ఐదు కోట్ల మంది భవిష్యత్తుకు సంబంధించిన నినాదం” అని ఆయన పేర్కొన్నారు. రాజధాని అనేది కేవలం ఒక ప్రాంతం కాదు, అది రాష్ట్ర అభివృద్ధికి చోదక శక్తి అని, మనం ఆలోచించే విధానం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కలుపుకుపోయేలా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ వ్యాఖ్యలు ఆయనలోని పరిపూర్ణ నాయకుడిని, నాయకత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

​వంగవీటి రంగా గారి ప్రస్తావన: వైసీపీ ద్వంద్వ నీతిపై ధ్వజం

కుల రాజకీయాల విషయంలో వైసీపీ అనుసరిస్తున్న తీరును జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఎండగట్టారు. ముఖ్యంగా దివంగత నాయకుడు “వంగవీటి మోహన రంగా” గురించి వైసీపీ నేతలు మాట్లాడుతున్న తీరుపై ఆయన విరుచుకుపడ్డారు. VM రంగా కి ప్రాణహాని ఉందని తెలిసినప్పుడు, ఈ రోజు గొంతు చించుకుంటున్న వైసీపీ నాయకులు నాడు రక్షణగా ఎందుకు నిలబడలేదని, నాడు ఎక్కడున్నారు… అని ప్రశ్నించారు. “నేను ఒక కులంలో పుట్టాను, కానీ ఆ కులానికి మాత్రమే పరిమితం కాను” అని చెబుతూనే, VM రంగా ని తమ రాజకీయాల కోసం వాడుకుంటున్న వారికీ, చురకలు వేశారు. చనిపోయాక కథలు చెప్పడం కంటే, బతికున్నప్పుడు మనిషిని గౌరవించడం ముఖ్యం అని కుండ బద్దలు కొట్టి చెప్పారు.

సంస్థాగత నిర్మాణం: సైద్ధాంతిక సైన్యం

జనసేనను ఒక పటిష్టమైన రాజకీయ శక్తిగా మార్చేందుకు “లక్ష్య దళ్”, “నిర్వాహక్ దళ్”, “పరిపాలక్ దళ్” వంటి విభాగాలను ఆయన ప్రకటించారు. 150 మందితో మొదలై నేడు 21.5 లక్షల సభ్యత్వాలకు చేరుకోవడం వెనుక కార్యకర్తల త్యాగం ఉందని కొనియాడారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ వంటి సంస్థల నుంచి క్రమశిక్షణను, నిస్వార్థ సేవను నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే గాక, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, యూపీ నుండి కూడా సభ్యత్వాలు నమోదు కావడం చాలా గొప్ప విషయం అని, దాని వల్ల మన మీద జాతీయ సమైక్యత కోసం మరింత బాధ్యత పెరుగుతుంది అన్నారు.

పొత్తు ధర్మం – కార్యకర్తల ఆత్మగౌరవం

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పాటు వెనుక ఉన్న బలమైన కారణాన్ని పవన్ కళ్యాణ్ మరోసారి వివరించారు. వైఎస్సార్సీపీ అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే ప్రథమ ప్రాధాన్యమని, అందుకే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను పొత్తు నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. పొత్తులో కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరిస్తూ, “మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంటే నేను చూస్తూ ఊరుకోను” అని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.

సనాతన ధర్మం మరియు సామాజిక విలువలు

సనాతన ధర్మాన్ని పరిహసించే వారిపై జనసేనాని “పవన్ కళ్యాణ్” నిప్పులు చెరిగారు. వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల పాటలు పెట్టడాన్ని తప్పుబడుతూ, ఇతర మతాల వారు తమ పండగలను ఎంత భక్తిశ్రద్ధలతో చేసుకుంటారో గుర్తు చేశారు. మన సంస్కృతిని మనం గౌరవించుకోకపోతే ఇతరులకు హేళన చేసే అవకాశం ఇచ్చినట్టేనని హెచ్చరించారు.

సామాజిక బాధ్యత - రాజకీయ సమగ్రత… శ్రేణులకు జనసేనాని దిశానిర్దేశం

జాతీయవాదం – ప్రధాని మోదీ పిలుపునకు మద్దతు

అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన ధరల పెరుగుదలపై అవగాహన ఉండాలని కార్యకర్తలకు సూచించారు. “ప్రధాని మోదీ” సూచించిన ఇంధన పొదుపు చర్యలు, విదేశీ మారక ద్రవ్య నిల్వలు కాపాడేందుకు, బంగారం కొనుగోలు తగ్గించడం వంటి అంశాలను ప్రతి పౌరుడు పాటించాలని కోరారు. అరకొర జ్ఞానంతో విమర్శలు చేసే వారిని పట్టించుకోవద్దని హితవు పలికారు.

ఆరోగ్యం మరియు అంకితభావం

కరోనా కారణంగా తనకు కొంచెం అనారోగ్య సమస్యలు తలెత్తాయి అని, అది ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ గా మారింది అని, దుమ్ము , ధూళి లో తిరగడం వల్ల సైనస్ ప్రాబ్లం వచ్చింది అని మొన్న శస్త్ర చికిత్స ద్వారా అవి నయం కబడ్డాయి అని తెలిపారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ప్రజల కోసం నిరంతరం శ్రమించడం ఆయన అంకితభావాన్ని చూపుతోంది. ఆర్ఎస్ఎస్ వంటి సంస్థల నుంచి క్రమశిక్షణను నేర్చుకోవాలని, పదవుల కంటే పార్టీ సిద్ధాంతమే ముఖ్యమని ఆయన తన నాయకులకు దిశానిర్దేశం చేశారు.

​ముగింపు

పవన్ కళ్యాణ్ ప్రసంగం సారాంశం ఒక్కటే జనసేన అనేది ఒక వ్యక్తి చుట్టూ తిరిగే పార్టీ కాదు, అది ఒక సైద్ధాంతిక సైన్యం అని, తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిస్తూనే, దేశ ప్రయోజనాల కోసం “ప్రధాని మోదీ” సూచించిన పొదుపు చర్యలను పాటించాలని కోరడం ద్వారా తనలోని జాతీయవాదిని ఆయన ఆవిష్కరించారు. ప్రసంగం ఆద్యంతం “బాధ్యత” అనే అంశం చుట్టూ తిరిగింది. రాజకీయాల్లో మార్పు అంటే కేవలం పదవులు పొందడం కాదు, ఒక బలమైన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమేనని ఆయన నిరూపించారు. అటు ప్రాంతీయ ప్రయోజనాలు, ఇటు జాతీయ అంశాలు, మరోవైపు చారిత్రక సత్యాలను మేళవించి ఆయన చేసిన ప్రసంగం జనసేన శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading