Download App

తనను తాను మలుచుకుంటూ… ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారుస్తున్న ‘శిల్పి చంద్రబాబు’….

ఏప్రిల్ 20, 2026 • By Suresh Thota
స్వామి వివేకానంద ఒక మాట చెప్పేవారు... "మిమ్మల్ని మీరు మార్చుకోండి, ప్రపంచం తనంతట తానే మారుతుంది" అని… అది అక్షర సత్యం అని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆయన 76 వ పుట్టిన రోజు…. దేశ, రాష్ట్ర చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్న వ్యక్తి....
తనను తాను మలుచుకుంటూ… ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మారుస్తున్న 'శిల్పి చంద్రబాబు'….

స్వామి వివేకానంద ఒక మాట చెప్పేవారు… “మిమ్మల్ని మీరు మార్చుకోండి, ప్రపంచం తనంతట తానే మారుతుంది” అని… అది అక్షర సత్యం అని నిరూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.

ఈరోజు ఆయన 76 వ పుట్టిన రోజు…. దేశ, రాష్ట్ర చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్న వ్యక్తి. ముందుగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

సాధారణంగా ఒక శిల్పి రాయిని శిల్పంగా మలుస్తాడు. కానీ ఇక్కడ “తనను తానే చెక్కుకునే శిల్పం” లా ఉంటూ “రాష్ట్ర భవిష్యత్ ను చెక్కుతున్న శిల్పి చంద్రబాబు” అంటే అతిశయోక్తి కాదేమో…. తనలోని అనవసరమైన కోపం, అహంకారం, బద్ధకం వంటి ‘అదనపు రాళ్లను’ తానే స్వయంగా తొలిగించుకుని, శిల్పంగా మారడానికి అనేక ఉలి దెబ్బలను భరిస్తూ, రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా తనను తాను మార్చుకోవడానికి పడే కష్టం, అనుభవించే బాధ అతన్ని ఒక పరిపూర్ణమైన మనిషిగా గా తీర్చిదిద్దుతాయి.

బయటి ప్రపంచం కోసం కాకుండా, తన ఆత్మతృప్తి కోసం తనను తాను మెరుగుపరుచుకోవడం.

ఒక అందమైన శిల్పాన్ని చూసి అందరూ ఎలా ముగ్ధులవుతారో, తనను తాను సంస్కరించుకున్న వ్యక్తిని చూసి సమాజం కూడా తనంతట తానుగా మారుతుంది. అటువంటి సిద్ధాంతాన్ని నమ్మి, అందరికీ ఆదర్శంగా ఉండాలనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు.

తన ఆలోచనలతో, రాజకీయ పరమైన ఒత్తిడులను జయిస్తూ, తన మనసుపై పట్టు సాధించి, అలాగే సంయుక్త ఆంధ్ర ప్రదేశ్ లో కాని, విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో కాని, నిత్యనూతనమైన ఆలోచనలతో, విలక్షణమైన విజన్ తో రాష్ట్ర పురోభివృద్ధి కి పాటు పడుతూ ఆ శక్తితో యువతలో సరికొత్త ఆలోచనలు నింపిన, నింపుతున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు.

ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టిన రోజు. ఆధునిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఆయన పేరు ఒక ప్రత్యేక అధ్యాయం. పరిపాలనలో సాంకేతికతను ప్రవేశపెట్టడం, ప్రణాళికాబద్ధ అభివృద్ధికి దిశా నిర్దేశం చేయడం, దీర్ఘకాలిక దృష్టితో ముందుకు సాగడం, ఇవి అన్నీ ఆయన నాయకత్వానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చాయి. ఒక రాష్ట్రాన్ని ఎలా విజన్‌తో ముందుకు తీసుకెళ్లాలో ఆయన చూపించిన మార్గం ఇప్పటికీ అందరికీ ఆదర్శనీయమే…..

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాదును ఐటీ కేంద్రంగా మలచిన తీరు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచింది. HITEC City వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చాయి. ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా వేలాది ఉద్యోగాలు సృష్టించబడినాయి. ఈ దిశలో తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, యువతకు సరికొత్త ఉపాధి, అవకాశాలను చూపించాయి.

అమరావతి రాజధాని నిర్మాణంలో ఆయన చూపించిన దూరదృష్టి కూడా ప్రస్తావనీయమే. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో ఒక ఆధునిక నగరాన్ని నిర్మించాలని తీసుకున్న నిర్ణయం, దానికి నిత్య కృషీవలుడై చేస్తున్న ప్రయత్నం, రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేయాలనే సంకల్పాన్ని తెలియజేస్తుంది. అలాగే రహదారులు, నీటి పారుదల ప్రాజెక్టులు, పరిశ్రమల విస్తరణ వంటి రంగాల్లో ఆయన పాలనలో జరిగిన, జరుగుతున్న పురోగతి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తోంది.

ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా భవిష్యత్తు దృష్టితోనే ఉన్నాయి. డిజిటల్ గవర్నెన్స్, పెట్టుబడులను ఆకర్షించడం, మౌలిక వసతుల రూపకల్పన, అభివృద్ధి…. ఇవి అన్ని కలిసి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగలిగే రాష్ట్రంగా సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. అయితే ఈ విజన్ పూర్తిగా ఫలించాలంటే అమలు పటిష్టంగా ఉండాలి, రాజకీయ స్థిరత్వం అవసరం ఇది తప్పనిసరి.

మొత్తం చూస్తే, చంద్రబాబు నాయుడు నాయకత్వం అభివృద్ధి, ప్రణాళిక, విజన్ అనే మూడు సూత్రాలపై నిలబడి ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాలు సరిగ్గా అమలు అయితే, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఆర్థికంగా, పారిశ్రామికంగా బలమైన, సాంకేతిక రాష్ట్రంగా ఎదగడం ఖాయం. కానీ మాటలకే పరిమితం అయితే, ఈ అవకాశాలు వృథా కావడం కూడా అంతే నిజం. కాని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాటల వ్యక్తి కాదు, చేతల వ్యక్తి అని ఇప్పటికే నిరూపితమైన వ్యక్తి.

ఈ రోజు ఆయన పుట్టిన రోజు, ఆయన విజన్‌ను అర్ధం చేసుకుని, టీడీపీ కార్యకర్తలు , ద్వితీయ శ్రేణి నాయకులు కూడా, ఆయన ఆలోచనలు అమలులోకి తీసుకువస్తె, రాబోయే తరాలకు కూడా స్పూర్తిదాయకంగా ఉంటుంది.

ముగింపు : ఒక సామాన్య వ్యక్తిగా, పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగానే చనిపోవడం తప్పు. మనం ఎక్కడ పుట్టాలో నిర్ణయించుకోలేము, కానీ ఎలా జీవించాలో మన చేతుల్లోనే ఉంటుంది. కష్టపడి పని చేయడం, సరైన ప్రణాళిక, తన ఆలోచనల కు అనుగుణంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం… ఇవే మనిషిని గొప్పవాడిగా తీర్చిదిద్దుతాయి. అటువంటి వ్యక్తే చంద్రబాబు నాయుడు…

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading