Download App

వల్లభనేని వంశీపై కిడ్నాప్ కేసు

ఫిబ్రవరి 13, 2025 By Srinivas
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ మేరకు కేసు నమోదు చేశారు.కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్...

వల్లభనేని వంశీపై కిడ్నాప్ కేసు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కిడ్నాప్ కేసు నమోదైంది. ఎస్సీ, ఎస్టీతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఈ మేరకు కేసు నమోదు చేశారు.

కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ను వంశీ కిడ్నాప్ చేశారనేది ఆయనపై అభియోగం. ఈ మేరకు వంశీపై సత్యవర్ధన్ బంధువులు ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలోని అపార్ట్ మెంట్ లో ఉన్న ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకెళ్లారు. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు పెట్టారు. మొత్తం 7 సెక్షన్ల కింద ఆయనపై కేసు పడింది.

వల్లభనేని వంశీపై కిడ్నాప్ కేసు

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిపై పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఆయన హాజరై ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. 2 రోజుల క్రితం వల్లభనేని వంశీకి చెందిన అనుచరులు సత్యవర్ధన్ ను కోర్టుకు కారులో తీసుకొచ్చారు. అనంతరం కోర్టు నుంచి నేరుగా వెళ్లి వంశీని సత్యవర్ధన్ కలిశారు. ఆ తర్వాత సత్యవర్ధన్ ను వంశీ విశాఖకు పంపించారు.

ఈ క్రమంలో సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి, బెదిరించారని ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, సత్యవర్ధన్ ను పోలీసులు విచారించగా… కేసు విత్ డ్రా చేసుకోవాలని వల్లభనేని వంశీ తనను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపించారు. దీంతో వంశీని అదుపులోకి తీసుకున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading