Download App

13 సంస్థలకు భూ కేటాయింపులు రద్దు

మార్చి 13, 2025 By Srinivas
రాజధాని అమరావతి నిర్మాణంలో కూటమి సర్కారు వడివడిగా అడుగులేస్తోంది. గడిచిన ఐదేళ్లుగా ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనుల్ని పరుగులు పెట్టించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా గతంలో జరిపిన భూ కేటాయింపులపై పునఃసమీక్ష చేశారు. ఏకంగా 13 సంస్థలకు కేటాయింపులు రద్దు చేశారు.బీఆర్ఎస్ మెడిసిటీ, యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్...

13 సంస్థలకు భూ కేటాయింపులు రద్దు

రాజధాని అమరావతి నిర్మాణంలో కూటమి సర్కారు వడివడిగా అడుగులేస్తోంది. గడిచిన ఐదేళ్లుగా ఆగిపోయిన రాజధాని నిర్మాణ పనుల్ని పరుగులు పెట్టించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా గతంలో జరిపిన భూ కేటాయింపులపై పునఃసమీక్ష చేశారు. ఏకంగా 13 సంస్థలకు కేటాయింపులు రద్దు చేశారు.

బీఆర్ఎస్ మెడిసిటీ, యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థలకు ఎన్నిసార్లు నోటీసులిచ్చినా స్పందించలేదని, గడువు లోగా నిర్మాణాలు చేపట్టలేదు కాబట్టి వాటికి ఇచ్చిన భూ కేటాయింపుల్ని రద్దు చేస్తున్నట్టు మంత్రి నారాయణ నేతృత్వంలో ఏర్పాటైన సబ్-కమిటీ ప్రకటించింది.

అదే విధంగా ఆంధ్రాబ్యాంక్ కు ఇచ్చిన భూ కేటాయింపుల్ని కూడా రద్దు చేశారు. ఈ బ్యాంక్ ను సిండికేట్ బ్యాంకులో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో మంజీరా హోటల్స్ కు రెండెకరాలు, గ్రీన్ పార్క్ హోటల్ కు రెండెకరాలు, వరుణ్ హాస్పిటాలిటీ సంస్థకు 4 ఎకరాలు, సదరన్ ట్రావెల్స్ కు 2 ఎకరాలు కేటాయించారు. ఇవేవీ ఇంకా నిర్మాణాలు చేపట్టలేదు.

ఈ సంస్థలతో పాటు మరో 19 సంస్థలకు 2027, మార్చి 31 వరకు గడువిచ్చారు. ఈలోగా వాళ్లు నిర్మాణాలు చేపట్టకపోతే వాళ్ల భూ కేటాయింపులు కూడా రద్దు చేస్తారు. అమరావతిలో ఆధ్యాత్మిక నగరం నిర్మాణం కోసం టీటీడీకి 25 ఎకరాలు కేటాయించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా కూడా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading