
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్, పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమౌతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం సహాయ సహకారాలు అందించాలని మంత్రుల్ని కోరుతున్నారు. ఇందులో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు.
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో డిఫెన్స్ క్లస్టర్ ను ఏర్పాటుచేయాలని రాజ్ నాధ్ సింగ్ ను కోరారు మంత్రి లోకేష్. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలివస్తున్న నేపథ్యంలో.. అనంతపురంలో అలాంటి క్లస్టర్ ను ఏర్పాటుచేస్తే రాష్ట్రానికి, రాష్ట్ర యువతకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని అన్నారు.
గడిచిన 7 నెలల్లో కేంద్రం అందించిన సహకారంతో అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు లాంటి అంశాల్లో జరిగిన పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు లోకేష్. ఆంధ్రప్రదేశ్ లో ఎన్సీసీ డైరక్టరేట్ ను ఏర్పాటుచేయాలని ఇప్పటికే కోరిన లోకేష్.. ఉమ్మడి డైరక్టరేట్ తెలంగాణలో ఉండిపోయిన విషయాన్ని గుర్తుచేశారు.
