Download App

నారా బ్రాహ్మణి మహిళా నాయకత్వానికి… ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో చోటు

జూలై 12, 2026 • By Suresh Thota
ఫార్చ్యూన్ ఇండియా గుర్తింపుతో "నారా బ్రాహ్మణి" మరో మైలురాయి ని చేరుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ సదస్సులో కేంద్ర మంత్రి "అనుప్రియ పటేల్" చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష ప్రభావం...
నారా బ్రాహ్మణి మహిళా నాయకత్వానికి… ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో చోటు

ఫార్చ్యూన్ ఇండియా గుర్తింపుతో “నారా బ్రాహ్మణి” మరో మైలురాయి ని చేరుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ సదస్సులో కేంద్ర మంత్రి “అనుప్రియ పటేల్” చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశేష ప్రభావం చూపిన మహిళలతో ఫార్చ్యూన్ ఇండియా 100 అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాను రూపొందించారు. ఆ జాబితా లో నారా బ్రాహ్మణి చోటు దక్కించుకున్నారు. దేశంలో పేరెన్నికగన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోడలుగా, నూతనోత్తేజం తో నవ్యాంధ్ర ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న యువ మంత్రి నారా లోకేష్ భార్యగా, బాధ్యతలను బ్యాలెన్స్ చేయడం చాలా ఒత్తిడితో కూడుకున్న పని.. ఆమె ఏం మాట్లాడినా, ఎక్కడికి వెళ్లినా మీడియా మరియు ప్రజల ఫోకస్ ఉంటుంది. ఎలాంటి చిన్న పొరపాటు దొర్లినా అది కుటుంబ రాజకీయ ప్రతిష్టపై ప్రభావం చూపిస్తుంది. అటువంటి తరుణంలో ద్విపాత్రాభినయం చేయడం మామూలు విషయం కాదు. ఒకవైపు వందల కోట్ల టర్నోవర్ ఉన్న “హెరిటేజ్ ఫుడ్స్” వ్యాపారాన్ని నడపడం, పారిశ్రామికవేత్తగా ఆమె కనబరుస్తున్న ప్రతిభకు తార్కాణం. హెరిటేజ్ ఫుడ్స్ ప్రయాణం, రైతులతో మమేకమై నిర్మించుకున్న నమ్మకం, డైరీ రంగంలో నూతన ఆవిష్కరణలతో పాటు, రైతుల జీవనోపాధిని మెరుగుపరచడమే ఆవిడ విజయానికి కారణం.

ప్రతి తల్లిదండ్రి జీవితంలో మరచిపోలేని క్షణాలు కొన్ని ఉంటాయి. పిల్లలు చదువులో, ఉద్యోగంలో లేదా జీవితంలో ఎదగడం ఒక ఆనందమైతే, తమ స్వంత కృషి, విలువలు, అంకితభావంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం అంతకంటే గొప్ప గర్వకారణం. హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ “నారా బ్రాహ్మణి” ఫార్చ్యూన్ ఇండియా 2026 ప్రకటించిన “100 అత్యంత ప్రభావవంతమైన మహిళల” జాబితాలో చోటు దక్కించుకోవడం అలాంటి అరుదైన సందర్భమే.

ఈ సందర్భంగా నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన కుమార్తెను అభినందిస్తూ చేసిన వ్యాఖ్యలు కేవలం తండ్రి ప్రేమను మాత్రమే కాదు, కృషి ద్వారా వచ్చిన విజయానికి ఇచ్చిన గౌరవం గా ప్రతిబింబించాయి. “తల్లిదండ్రులకు తమ పిల్లలు తమ స్వంత కృషి, విలువలు, అంకితభావంతో గుర్తింపు పొందడం కంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదు” అనే ఆయన మాటల్లో ఒక తండ్రి హృదయం లోని ఆనందం కనిపించింది.

నారా బ్రాహ్మణి ఈ గుర్తింపును కుటుంబ నేపథ్యం కారణంగా కాకుండా, తన నాయకత్వ సామర్థ్యం, నిర్వహణ నైపుణ్యం, వ్యాపార దూరదృష్టి ద్వారా సంపాదించుకున్నారని బాలకృష్ణ తన సందేశం ద్వారా స్పష్టంగా తెలియజేశారు. హెరిటేజ్ ఫుడ్స్‌ను ఆధునిక వ్యాపార అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, డైరీ రంగంలో నూతన ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వడం, రైతులతో విశ్వాసపూర్వక బంధాన్ని నిర్మించడం, వారి జీవనోపాధి మెరుగుపడేలా కృషి చేయడం వంటి అంశాలే ఈ జాతీయ స్థాయి గుర్తింపుకు బలమైన కారణాలుగా నిలిచాయి.

వ్యాపార ప్రపంచంలో లాభనష్టాలే కాదు, సమాజంపై చూపే ప్రభావం కూడా ఒక సంస్థ విలువను నిర్ణయిస్తుంది. ఆ దిశగా హెరిటేజ్ ఫుడ్స్ ప్రయాణంలో నారా బ్రాహ్మణి పోషించిన పాత్రకు ఫార్చ్యూన్ ఇండియా గుర్తింపు ఇవ్వడం, భారత కార్పొరేట్ రంగంలో మహిళా నాయకత్వం మరింత బలోపేతమవుతోందనడానికి నిదర్శనం.

బాలకృష్ణ తన సందేశంలో మరో ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించారు. నారా బ్రాహ్మణి సాధించిన విజయం యువతులకు, ముఖ్యంగా యువ మహిళలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం, కష్టపడి పనిచేస్తే ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించవచ్చనే సందేశాన్ని ఇవ్వడమే కాక, “వారసత్వం ఒక అవకాశం ఇవ్వొచ్చు, కాని గుర్తింపును నిలబెట్టేది వ్యక్తిగత ప్రతిభ, కృషి, నాయకత్వమే” అనే విలువైన సందేశం ఇచ్చారు. ఫార్చ్యూన్ ఇండియా వంటి ప్రతిష్ఠాత్మక వేదికపై “నారా బ్రాహ్మణి” స్థానం సంపాదించడం, మహిళలు వ్యాపార నాయకత్వంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నారనే విషయాన్ని మరోసారి చాటిచెప్పినట్లైంది.

చివరగా, బాలకృష్ణ తన కుమార్తెకు ఆశీర్వాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ప్రతి తండ్రి తన పిల్లల గురించి కోరుకునే దానికంటే భిన్నంగా ఇందులో ఏమీ లేదు. అయితే ఈ సందేశం ప్రత్యేకత ఏమిటంటే, అది విజయాన్ని కుటుంబానికి మాత్రమే పరిమితం చేయకుండా, కృషి, నాయకత్వం, విలువలు, సమాజానికి చేసే సేవ, అనే నాలుగు స్తంభాలపై నిలబెట్టి అభినందించింది.

అందుకే నారా బ్రాహ్మణికి లభించిన ఈ గౌరవం వ్యక్తిగత విజయంగా మాత్రమే కాకుండా, ప్రతి మహిళ నాయకత్వానికి, రైతు-కేంద్రిత వ్యాపార దృక్పథానికి, కష్టాన్ని నమ్ముకున్న ప్రతి యువతికి ఒక ప్రేరణగా నిలిచే గుర్తింపుగా చెప్పవచ్చు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading