Download App

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్…

జనవరి 31, 2026 By Suresh Thota
భారత దేశంలో వారసత్వ రాజకీయ పరంపర లో మరొక కుటుంబం వెళ్ళూనుకుంటుంది. మొన్న జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం పాలైన విషయం విదితమే… ఇప్పుడు ఆయన భార్య సునేత్ర పవార్ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు....
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్…

భారత దేశంలో వారసత్వ రాజకీయ పరంపర లో మరొక కుటుంబం వెళ్ళూనుకుంటుంది. మొన్న జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం పాలైన విషయం విదితమే… ఇప్పుడు ఆయన భార్య సునేత్ర పవార్ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సునేత్ర పవార్ 1963 అక్టోబరు 18 న మహారాష్ట్రలో జన్మించారు. ఆమె రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. కాని భర్త రాజకీయాలలో చాలా బిజీగా ఉండటం తో రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు, 2024లో రాజకీయంగా ప్రాథమికంగా ప్రవేశించారు.

సునేత్ర పవార్ Environmental Forum of India అనే సంస్థను 2010లో స్థాపించారు. ఇది పర్యావరణ పరిరక్షణ, ఆర్గానిక్ వ్యవసాయం వంటి పర్యావరణ కార్యక్రమాల మీద పనిచేస్తుంది. ప్రస్తుతం ఆమె బారమతి టెక్స్ టైల్ పార్క్ వంటి పరిశ్రమల సంస్థ కు చైర్మన్‌గా ఉన్నారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్…

అజిత్ , సునేత్ర దంపతులకు ఇద్దరు కుమారులు. పార్ధ్ పవార్, జయ పవార్… పెద్ద కుమారుడు రాజకీయాల్లోనే కొనసాగుతున్నాడు. చిన్న కొడుకు వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు. సునేత్ర పవార్ రాజకీయ రంగ ప్రవేశం 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో జరిగింది. ఆమె బారామతి స్థానం నుండి వదిన సుప్రియా సూలే పై పోటీ చేశారు. NCP అజిత్ మరియు శరద్ పవార్ వర్గాలుగా చీలిపోయిన తర్వాత, అజిత్ పవార్ తన పార్టీ బలోపేతానికి భార్యను బరిలోకి దించారు. మొదటి ఎన్నిక బారామతి (పవార్ కుటుంబ కోట) నుంచి తొలిసారి పోటీ చేశారు కానీ సుప్రియా సూలె చేతిలో 1.5 లక్షల ఓటాల తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు ఇది ఆమె రాజకీయ జీవితం.

మధ్యాహ్నం 2:00 గంటలకు జరిగే NCP శాసనసభాపక్ష సమావేశంలో ఆమెను తమ నాయకురాలిగా అధికారికంగా ఎన్నుకుంటారు.

నూతన ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ప్రమాణ స్వీకారం నేడు, అంటే 2026 జనవరి 31 వ తేదీ, శనివారం సాయంత్రం 5 గంటలకు జరగనుంది. ముంబైలోని రాజ్‌భవన్ లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

2026లో అజిత్ పవార్ హఠాన్మరణంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. రాష్ట్రంలో తొలి మహిళా డిప్యూటీ సీఎంగా రికార్డులెక్కనున్నారు.

Suresh Thota

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading