Download App

క్రమశిక్షణతో… బీజేపీలో ఉన్నత స్థానం ఖాయం…

జనవరి 22, 2026 By Suresh Thota
భారతీయ జనతా పార్టీకి 12వ జాతీయ అధ్యక్షుడిగా… న్యూఢిల్లీ లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో, నితిన్ నబిన్ అధికారికంగా భారతీయ జనతా పార్టీ 12వ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం పార్టీ పరంగా మాత్రమే కాకుండా, దేశ రాజకీయాల్లోనూ ఒక కీలక మలుపుగా భావించాలి. 45...
క్రమశిక్షణతో… బీజేపీ లో ఉన్నత స్థానం ఖాయం…

భారతీయ జనతా పార్టీకి 12వ జాతీయ అధ్యక్షుడిగా… న్యూఢిల్లీ లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో, నితిన్ నబిన్ అధికారికంగా భారతీయ జనతా పార్టీ 12వ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం పార్టీ పరంగా మాత్రమే కాకుండా, దేశ రాజకీయాల్లోనూ ఒక కీలక మలుపుగా భావించాలి. 45 ఏళ్ల వయస్సులోనే బీజేపీ చరిత్రలో అత్యంత పిన్న వయస్సు జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ రికార్డు సృష్టించారు. ఇది బీజేపీ యువ నాయకత్వంపై పెడుతున్న విశ్వాసానికి స్పష్టమైన సంకేతం.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, శివ్ రాజ్ సింగ్ చౌహాన్, నితిన్ గడ్కరీ, ఇప్పటి పార్టీ అధ్యక్షులుగా పని చేసిన జెపి నడ్డా , బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు, జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.

ఇది బీజేపీలో సంస్థాగత క్రమశిక్షణ, నాయకత్వ మార్పు ఎంత పద్ధతిగా జరుగుతుందో చూపించే కార్యక్రమంగా దేశం ముందు నిలిచింది. బీజేపీ పార్టీ లో పార్టీ కోసం, అహర్నిశలు కష్టపడేవారికి, ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది అనడానికి… నితిన్ నబీన్ ఎంపికయే సాక్ష్యం…

ఈ ఎన్నిక సందర్భంగా… ప్రధాని మోదీ ఆశక్తికరమైన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

“పార్టీ విషయాలకు వస్తే నితిన్ నబిన్ నా బాస్. నేను కేవలం ఒక పార్టీ కార్యకర్తను.” ఈ వ్యాఖ్య ద్వారా బీజేపీలో వ్యక్తులకంటే సంస్థే ప్రధానం అనే భావనను మోదీ మరోసారి స్పష్టం చేశారు. “ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినందుకు నితిన్ నబిన్‌కు నా హృదయపూర్వక అభినందనలు.”

ఆయన బాధ్యత పార్టీ వరకు మాత్రమే పరిమితం కాదు. ఎన్డీఏ కూటమిలో అన్ని పార్టీలను సమన్వయం చేసుకుంటూ… దేశ ఆర్థిక మార్పులను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ తన పదవికి సమన్యాయం చేస్తూ ముందుకు సాగడమే ఈ యువ నాయకుడు నితిన్ నబిన్ యొక్క లక్ష్యం. “ఇప్పటివరకు ఆయనకు అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు.” అని అన్నారు.

క్రమశిక్షణతో… బీజేపీ లో ఉన్నత స్థానం ఖాయం…

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం… అనుభవం తో కూడిన యువకుడు, సంస్థాగత రాజకీయాల్లో లోతైన అనుభవం. భవిష్యత్ ఎన్నికల దిశగా పార్టీని సిద్ధం చేసే సామర్థ్యం అతని సొంతం…. బీహార్ లో కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మధ్య ఆయన సమన్వయం చేసుకుంటూ నడిపిన తీరు బీజేపీ పెద్దలను ఆకర్షించింది.ఈ కారణాల వల్లనే ఆయన ఎంపిక జరిగింది, అని అంటున్నారు.

ఈ నియామకం ద్వారా బీజేపీ యువ నాయకత్వాన్ని ముందుకు తెస్తోంది, దీర్ఘకాలిక రాజకీయ వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది, ఎన్డీఏను మరింత బలోపేతం చేయాలనే ఆలోచన ఈ ఎంపిక ద్వారా అవగతమవుతుంది. ఇది బీజేపీ భవిష్యత్ రాజకీయ నిర్దేశకత్వానికి సంకేతం గా భావించవచ్చు.

నితిన్ నబీన్ నేపధ్యం:

బీహార్ రాష్ట్రానికి చెందిన ఈయన 1980 మే 23న జన్మించారు, తండ్రి మాజీ ఎమ్మెల్యే నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా. నితిన్ నబిన్ విద్యాభ్యాసం పాట్నా,మరియు ఢిల్లీలో జరిగింది…

రాజకీయ ప్రస్థానం :

2006లో తండ్రి మరణం తర్వాత పాట్నా వెస్ట్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా బై ఎలక్షన్స్ లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తర్వాత బ్యాంకిపూర్ నియోజకవర్గం నుండి వరుసగా 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లో గెలిచి 5 సార్లు ఎమ్మెల్యేగా జయకేతనం ఎగురవేశారు.

2020లో బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలిచారు. 2025 లో ఐదోసారి రాజదళ్ అభ్యర్థి రేఖా కుమారిని 51,936 ఓట్ల తేడాతో ఓడించారు. మంత్రి గా 2021 నుండి 2025వరకు రోడ్డు, భవన నిర్మాణ శాఖ , పట్టణాభివృద్ధి, హౌసింగ్, చట్ట, న్యాయ శాఖల మంత్రిగా వివిధ శాఖలను సమర్థవంతంగా నిర్వర్తించారు.

భారతీయ జనతా యువజన శాఖ లో (BJYM) ఉన్నప్పటి నుండి వివిధ బాధ్యతలు నిర్వహించారు. అందుకే పార్టీ ఆయనకు ఉన్న విస్తృత అనుభవం రీత్యా కూడా ఈ ఎంపిక చేసి ఉండవచ్చు. పార్టీ సంస్థాగత శక్తిని బలోపేతం చేయడం, రాబోయే వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల ను, ఆర్గనైజ్ చేయడం. పార్టీ కార్యకర్తలకు దగ్గర గా ఉండటం.

సంక్షిప్తంగా చెప్పాలంటే నితిన్ నబీన్‌ను “గొప్ప క్రమశిక్షణ గల నాయకుడు గా చెప్పవచ్చు. టీవీ డిబేట్లలో లేదా సభల్లో ఆవేశంనకు గురి అవకుండా, పాయింట్-టు-పాయింట్ మాట్లాడతారు. పార్టీ కార్యకర్తలతో నేరుగా సంబంధాలను కొనసాగిస్తూ…. గ్రౌండ్ లెవెల్ లో పని చేయగల సామర్థ్యం ఇతని సొంతం. స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఎదిగిన నాయకుడు. ఎలక్షన్ మేనేజ్‌మెంట్ మరియు క్యాడర్ నిర్వహణ లో దృఢంగా , చిత్త శుద్ధి తో ఉంటారు.

జాతీయ అధ్యక్షుడు…. సభల్లో వక్త గా కంటే, పార్టీని నడిపే కార్యనిర్వాహక దక్షత కలిగి ఉండాలి. మాటల్లో సంయమనం, నిర్ణయాల్లో స్థిరత్వం, వివాదాలకు దూరంగా ఉండే స్వభావం చాలా కీలకం. ముఖ్యంగా జాతీయ అధ్యక్ష పదవిలో ఉన్నవారికి ఇవన్నీ ఉండాలి. “మాస్ లీడర్” కంటే “క్యాడర్ లీడర్” గా పేరు తెచ్చుకోవాలి.

ఈయనంటే సీనియర్లకు ‘నమ్మకం’, జూనియర్లకు ‘ అంగీకారం’…… సీనియర్ నేతలకు “మాట వినే వ్యక్తి” యువ కార్యకర్తలకు “మనలో ఒకడు” ఇది చాలా అరుదైన కాంబినేషన్. మొత్తంగా నితిన్ నబీన్ వ్యక్తిత్వం:

“శబ్దం తక్కువ, పని ఎక్కువ”

Suresh Thota

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading