
బీహార్‌లో బీజేపీ స్వంతంగా రాజకీయ జెండా పాతింది . అంచెలంచెలుగా ఎదుగుతూ బీహార్ ను స్వాధీనం చేసుకుంది. బీహార్ రాజకీయాల్లో ఒక కీలక మలుపు తిరిగింది. దశాబ్దాల పాటు మిత్రపక్షాల ఆధారంగా అధికారంలో కొనసాగిన భారతీయ జనతా పార్టీ (BJP) ఇప్పుడు తొలిసారిగా రాష్ట్రంలో స్వతంత్రంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించింది. సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కేవలం నాయకత్వ మార్పు కాదు, ఇది బీహార్ రాజకీయ సమీకరణాల్లో ఒక పెద్ద మార్పు.
ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలను తనదైన శైలిలో నడిపించిన జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాజీనామాతో ఒక యుగానికి తెరపడింది. “పల్టు రామ్” అనే విమర్శాత్మక బిరుదుతో ప్రసిద్ధి చెందిన ఆయన, తరచూ కూటములు మార్చుకుంటూ అధికారాన్ని కాపాడుకున్నారు. అయితే, రాజ్యసభకు ఎన్నిక కావడం మరియు ఎన్డీఏలో అధికార బదిలీ ఒప్పందం నేపథ్యంలో ఆయన సీఎం పదవిని విడిచిపెట్టడం, బీహార్ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు కి సంకేతం.
అసెంబ్లీలో 89 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, ఈసారి అధికారాన్ని నేరుగా స్వాధీనం చేసుకుంది. సమ్రాట్ చౌదరిని శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం, ఆ నిర్ణయానికి ప్రధాన కారణం కేంద్ర నాయకత్వం నుండి వచ్చిన స్పష్టమైన సంకేతాలనేది బహిరంగ రహస్యం.
సమ్రాట్ చౌదరి ఎంపిక వెనుక ప్రధాన కారణం ఆయన వ్యక్తిగత ప్రతిభ మాత్రమే కాదు. బీహార్ రాజకీయాల్లో కీలకమైన ఓబీసీ కుష్వాహా (కోయెరీ) సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఆయనకు ఉన్న ప్రాధాన్యం కూడా అంతే ముఖ్యమైనది. ఇక్కడ బీజేపీ స్ట్రాటజీ క్లియర్ ఉంది.

లాలూ ప్రసాద్ యాదవ్ ఆధిపత్యం ఉన్న ఆర్జేడీకి కౌంటర్. ఓబీసీ ఓటు బ్యాంక్‌ను విస్తరించుకోవడం ఈ నిర్ణయం కేవలం ప్రస్తుత అధికారానికి కాదు, భవిష్యత్ ఎన్నికల కోసం వేసిన లాంగ్ టర్మ్ ప్లాన్.
సమ్రాట్ చౌదరి రాజకీయ ప్రయాణం పరమపద సోపానం లాంటిది.. RJDలో ప్రారంభం, 1999లో రబ్రీ దేవి ప్రభుత్వంలో పిన్న వయస్కుడైన మంత్రి, తరువాత JD(U)లో కొనసాగింపు, 2017లో BJPలో చేరి వేగంగా ఎదుగుదల
పార్టీలు మారడం ఒక బలహీనత కాదు సరిగ్గా ఉపయోగిస్తే అది పవర్ గేమ్. సమ్రాట్ అదే చేశారు. కేంద్ర ఆశీస్సులు లేకుండా ఇది సాధ్యం కాదు. సమ్రాట్ చౌదరి ఎదుగుదల పూర్తిగా గ్రౌండ్ లెవెల్ స్టోరీ కాదు. అమిత్ షా ముందుగానే ఆయనను “పెద్ద నాయకుడు”గా ప్రొజెక్ట్ చేయడం, నరేంద్ర మోదీ విజన్‌ను అమలు చేసే నాయకుడిగా ఎంపిక, శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యవేక్షణలో లెజిస్లేటివ్ ప్రాసెస్ పూర్తి.
నితీష్ కుమార్ రాజీనామాను “స్వచ్ఛంద నిర్ణయం”గా చూపించినా, వాస్తవం అంత సింపుల్ గా లేదు అని అంటున్నారు రాజకీయ పండితులు. రాజ్యసభకు మారడం రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకోవడం బీజేపీకి పూర్తి అధికారం ఇవ్వడం కూటమి లోపలి శక్తి కేంద్ర సమతుల్యత మార్పు కావచ్చు.
పాట్నాలోని లోక్ భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారం కార్యక్రమం కేవలం ఆచారపరమైనది కాదు, అది బీజేపీ శక్తి ప్రదర్శన. గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ప్రమాణ స్వీకారం చేయించగా, జేపీ నడ్డా, చిరాగ్ పాశ్వాన్, ఇతర కేంద్ర నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. జేడీయూ నుంచి విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా కూటమి సమతుల్యతను కాపాడే ప్రయత్నం జరిగింది.
ఇప్పుడు అసలు విషయం ఇదే… సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా నిలబడతారా, లేక ఇది మరో పవర్ ఎక్స్‌పెరిమెంట్‌గా మిగిలిపోతుందా? అనేది వేచి చూడాలి.
బీహార్‌లో కుల రాజకీయాలు ఎప్పుడైనా తిరగబడే అవకాశం. జేడీయూ పాత్ర భవిష్యత్తులో తగ్గిపోవడం వల్ల అంతర్గత ఉద్రిక్తతలు, ఇది సాధారణ సీఎం మార్పు కాదు. ఇది బీహార్‌లో బీజేపీ పూర్తిస్థాయి అధికారాన్ని పరీక్షించే మొదటి నిజమైన ప్రయత్నం.
సమ్రాట్ చౌదరి విజయం ఒక్కటే నిర్ణయిస్తుంది: బీహార్ లో బీజేపీ స్వతంత్ర శక్తిగా నిలుస్తుందా… లేక… మళ్లీ కూటమి రాజకీయాలకే పరిమితం అవుతుందా అని, వేచి చూడాలి.
