
ఢిల్లీ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం సాధించిన భారతీయ జనతా పార్టీని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. ప్రధాని మోదీపై విశ్వాసం మరోసారి రుజువైందన్నారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను నిలపాలనే లక్ష్యంలో మోదీ పనిచేస్తున్నారని, ఆ లక్ష్య సాధనలో ఇప్పుడు ఢిల్లీ ప్రజలు కూడా భాగమయ్యారని అన్నారు పవన్ కల్యాణ్. మోదీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు.
డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు పవన్. ఈ సందర్భంగా అమిత్ షాపై కూడా ప్రత్యేకంగా ప్రశంసల జల్లు కురిపించారు. అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం మంచి సత్ఫలితాలనిస్తున్నాయని అన్నారు.
