Download App

‘నాలుగు తత్వాల’ సమ్మేళనమే… ఈ 12 రాశులు…

ఏప్రిల్ 9, 2026 By Suresh Thota
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, విశ్వం ఎలాగైతే పంచభూతాలతో నిర్మితమైందో, అలాగే 12 రాశులు నాలుగు ప్రధాన తత్వాల (Elements) కింద విభజించబడ్డాయి. అవి :- అగ్ని, భూమి, వాయు మరియు జల తత్వాలు. ఈ తత్వాలే మనిషి ఆలోచనా తీరును, ప్రవర్తనను, వారి ఆరోగ్యాన్ని మరియు వారి జీవన...
'నాలుగు తత్వాల' సమ్మేళనమే… ఈ 12 రాశులు…

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, విశ్వం ఎలాగైతే పంచభూతాలతో నిర్మితమైందో, అలాగే 12 రాశులు నాలుగు ప్రధాన తత్వాల (Elements) కింద విభజించబడ్డాయి. అవి :- అగ్ని, భూమి, వాయు మరియు జల తత్వాలు. ఈ తత్వాలే మనిషి ఆలోచనా తీరును, ప్రవర్తనను, వారి ఆరోగ్యాన్ని మరియు వారి జీవన విధానాన్ని నిర్ణయిస్తాయి.

నాలుగు తత్వాల రాశులు ఏమి ఉన్నాయే తెలుసుకుందాం. మేషం, సింహం, ధనస్సు. “అగ్నితత్వ” రాశులు :- ఈ రాశులలో చైతన్యం ఎక్కువ మరియు నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. కాలపురుష చక్రం మేషం నుండి మొదలవుతుంది. మేషం కి అధిపతి కుజుడు అధిక శక్తి కలిగిఉంటాడు. సింహం కి అధిపతి రవి ధైర్యం, సాహసం కలిగి ఉంటాడు. ధనుస్సుకి అధిపతి గురువు పై రెండు రాశుల లక్షణాలు ఉంటాయి. ​అగ్నితత్వ రాశుల వారు ఉత్సాహవంతులు మరియు ఆత్మవిశ్వాసం కలిగిన వారు. వీరు ఎప్పుడూ ఇతరులను నడిపించేనాయకత్వ స్థానాల్లో ఉంటారు.
​మేషం: ప్రతి పనిలో చొరవ చూపుతారు. నిర్భయంగా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం వీరి ప్రత్యేకత.

సింహం: పరిపాలనా సామర్థ్యం, లౌకిక జ్ఞానం మెండు. వీరు గౌరవ పదవులను, గుర్తింపును కోరుకుంటారు.

ధనస్సు: శాస్త్రాల పట్ల మక్కువ, ధర్మ చింతన ఎక్కువ. వీరు ఉన్నత ఆశయాలు కలిగి ఉంటారు.

వృషభం, కన్య, మకరం. ఇవి”భూతత్వ రాశులు” :- స్థిరత్వం మరియు వాస్తవికత, మొండితనం, ఓర్పు, క్రమశిక్షణ, కార్యదక్షత. “​భూతత్వ” రాశుల వారు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారు. వీరు ఆకాశంలో విహరించకుండా నేల మీద నిలబడి ఆలోచిస్తారు. శ్రమను నమ్ముకుంటారు.

​వృషభం: స్థిరమైన మనస్తత్వం, కళల పట్ల ఆసక్తి మరియు భౌతిక సుఖాల పట్ల మక్కువ కలిగి ఉంటారు.

​కన్య: విశ్లేషణాత్మక శక్తి ఎక్కువ. ప్రతి పనిని పద్ధతిగా, తప్పులు లేకుండా చేయడంలో వీరు దిట్ట.

​మకరం: వీరు కష్టపడే స్వభావం కలవారు. అంచలంచెలుగా ఎదుగుతూ సమాజంలో ఉన్నత స్థానాన్ని సంపాదిస్తారు.

మిధునం, తుల, కుంభం. “వాయుతత్వ” రాశులు :- మేధస్సు మరియు సమాచార సంబంధాలు తెలివితేటలు, ప్రణాళికలు, కమ్యూనికేషన్.

​వీరు ఆలోచనల మీద, కొత్త ప్లాన్ల మీద ఎక్కువ కాలం గడుపుతారు. సమాజంలో అందరితో కలుపుగోలుగా ఉండటం వీరి నైజం. స్నేహ మాధుర్యాన్ని అందరికీ పంచుతారు.

​మిధునం: సమాచార సేకరణ, రచనలు మరియు మధ్యవర్తిత్వంలో వీరు సిద్ధహస్తులు. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు.

తుల: ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటారు. ఐకమత్యానికి, సామాజిక సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తారు.

​కుంభం: కొత్త ఆశయాలు, ఆదర్శాలు కలవారు. సమిష్టి ప్రయోజనం కోసం పాటుపడే మానవతావాదులు.

కర్కాటకం, వృశ్చికం, మీనం “జలతత్వ” రాశులు :- భావోద్వేగాలు మరియు అంతర్జ్ఞానం. సున్నితత్వం, ప్రేమ, ఊహాశక్తి. వీరు ఎదుటి వారి అంచనాలకి దొరకరు. “​జలతత్వ” రాశుల వారు చాలా ఎమోషనల్‌గా ఉంటారు. వీరు పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మల్చుకుంటారు.

​కర్కాటకం: కుటుంబంపై అమితమైన ప్రేమ. జ్ఞాపకశక్తి ఎక్కువ మరియు భద్రతకు ప్రాధాన్యత ఇస్తారు.

​వృశ్చికం: ప్రతి విషయాన్ని లోతుగా పరిశోధిస్తారు. వీరికి పట్టుదల ఎక్కువ, రహస్యాలను కాపాడగలరు.

​మీనం: కళాహృదయం, ఆధ్యాత్మిక చింతన కలవారు. వీరు మంచి సానుభూతిపరులు మరియు కల్పనాశక్తి కలవారు.

ఇవి మామూలుగా ఈ తత్వాలు కలిగి ఉంటాయి… ఈ రాశులలో గ్రహాలు వ్యతిరేక రాశులలో పడినప్పుడు విరుద్ధమైన పలితాలు వస్తుంటాయి. ఉదా:- సింహ రాశి అధిపతి రవి మీనం లో పడితే నిప్పు వెళ్ళి నీటిలో పడ్డట్టుగా భావిస్తారు అలా… ​ఇవి జస్ట్ రాశుల తత్వాల గురించి మాత్రమే… ఈ నాలుగు తత్వాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ప్రపంచ సమతుల్యతను కాపాడతాయి. మీ రాశి తత్వం ఏదో తెలుసుకోవడం ద్వారా మీ అంతర్గత శక్తులను మీరు మెరుగుపరుచుకోవచ్చు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading