సినిమా వార్తలు

తేజ సజ్జ కెరీర్‌లో బిగ్ రికార్డ్.. ‘మిరాయ్‌’ ఫస్ట్ డే బాక్సాఫీస్

Published by
Rahul N

హనుమాన్ విజయం తర్వాత యంగ్ హీరో తేజ సజ్జ తన కెరీర్‌లో మరో పెద్ద రికార్డ్ అందుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో భారీ హైప్ క్రియేట్ చేసిన మిరాయ్ విడుదల రోజే బాక్సాఫీస్ దగ్గర ఊహించని రికార్డు సాధించింది. టీమ్ అనుకున్న అంచనాలను మించి కలెక్షన్లు నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఓవర్సీస్ ప్రీమియర్స్లో తేజ సజ్జ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. నార్త్ అమెరికాలో మొదటి రోజే 700K డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, హనుమాన్ రికార్డును దాటేసింది. తెలుగు రాష్ట్రాల్లో గంటకు 20 వేల రేంజ్‌లో టికెట్ సేల్స్ నమోదవుతుండగా, ఈవెనింగ్-నైట్ షోలతో వేగం రెట్టింపు అయింది.

వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే లెక్కలు చూస్తే సినిమా ఏకంగా 27 కోట్ల గ్రాస్ దాటేసింది. మొదట 14–16 కోట్ల వరకు వస్తుందని భావించిన వసూళ్లు చివరికి డబుల్ మార్క్‌లోకి చేరడంతో ట్రేడ్ సర్కిల్స్ షాక్ అయ్యాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలోనూ మంచి వసూళ్లు రాబట్టింది.

హనుమాన్ ఫస్ట్ డే 12 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి 300 కోట్ల వరకు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అదే రూట్‌లో మిరాయ్ కూడా మొదటి రోజే 27 కోట్ల గ్రాస్ అందుకోవడంతో లాంగ్ రన్ ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మొత్తానికి, మిరాయ్ ఫస్ట్ డే 27 కోట్ల గ్రాస్‌తో ఊహకందని రికార్డ్ సృష్టించింది. రెండో రోజు నుంచి మరింత వేగం పెరిగే అవకాశం ఉండటంతో లాంగ్ రన్‌లో ఇది తేజ సజ్జా కెరీర్‌ని మరోస్థాయికి తీసుకెళ్లే బ్లాక్‌బస్టర్ అవుతుందని ట్రేడ్ టాక్.

సినిమాలో తేజ సజ్జ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకోగా, మంచు మనోజ్ విలనిజం మాస్ ఆడియన్స్‌ను బాగా కనెక్ట్ చేసింది. శ్రీయ సరణ్ తల్లి పాత్రలో ఎమోషనల్ టచ్ ఇచ్చింది. టెక్నికల్‌గా కార్తీక్ ఘట్టమనేని ప్రెజెంటేషన్, విజువల్స్, సౌండ్ డిజైన్ అన్నీ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.

మిరాయ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Rahul N