Download App

Renu Desai: తిరువీర్ లాంటి భర్త అమ్మాయిలకు దొరకాలి – రేణూ దేశాయ్

నవంబర్ 29, 2026 • By Srinivas
Renu Desai On Thiruveer: యంగ్ యాక్టర్, హీరో తిరువీర్ మీద రేణూ దేశాయ్ ప్రశంసల వర్షం కురిపించారు. అతడి లాంటి భర్త అమ్మాయిలకు దొరకాలన్నారు. Renu Desai Birthday: డిసెంబర్ 4న రేణూ దేశాయ్ బర్త్ డే. ఆ రోజున జీ5 ఓటీటీలో శ్రీమతి (Zee5 Original...

Renu Desai On Thiruveer: యంగ్ యాక్టర్, హీరో తిరువీర్ మీద రేణూ దేశాయ్ ప్రశంసల వర్షం కురిపించారు. అతడి లాంటి భర్త అమ్మాయిలకు దొరకాలన్నారు.

Renu Desai Birthday: డిసెంబర్ 4న రేణూ దేశాయ్ బర్త్ డే. ఆ రోజున జీ5 ఓటీటీలో శ్రీమతి (Zee5 Original Movie Srimathi) సినిమా ప్రీమియర్ అవుతోంది. అందులో యంగ్ హీరో తిరువీర్, హీరోయిన్ నివేదా థామస్ జంటగా నటించారు. రేణూ దేశాయ్ కీలక పాత్రలో నటించారు. ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరువీర్ మీద ప్రశంసల వర్షం కురిపించారు రేణూ దేశాయ్.

తిరువీర్ లాంటి భర్త దొరికితే అదృష్టం!

ఈ ఏడాది బర్త్ డేకి జీ5 ఓటీటీలో శ్రీమతి ప్రీమియర్ అవుతుండటం సంతోషంగా ఉందన్నారు రేణూ దేశాయ్. అదే సమయంలో తిరువీర్ గురించి కూడా ఆమె చాలా మాట్లాడారు.

తిరువీర్ కంటే ముందు అతని భార్య కల్పన తనకు ముందు పరిచయం అని రేణూ దేశాయ్ తెలిపారు. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం కంటే ముందు నుంచి తనకు కల్పన తెలుసని ఆమె చెప్పారు. కల్పనకు తిరువీర్ ఇచ్చే ఫ్రీడమ్ తెలుసు అని, అటువంటి భర్తలు అందరికీ దొరకాలని, దొరికితే అదృష్టం అన్నారు రేణూ దేశాయ్.

ఇప్పటికీ సిటీల్లో మహిళలకు ఇబ్బందులే!

ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమా స్ఫూర్తితో శ్రీమతి సినిమా రూపొందించారు. వంటింటి కుందేలు తరహాలో పెళ్లైన తర్వాత భార్యలను వంటగదికి పరిమితం చేయడం తప్పు అనేది సినిమా కాన్సెప్ట్. భార్య ఇష్టాలను గుర్తించాలని, ఆమెకు ఉద్యోగం చేయాలని అనిపిస్తే… చేయించాలని ఓ సందేశం కూడా ఉంటుంది. శ్రీమతి సినిమాలో చూపించిన విధంగా ఇప్పటికే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి టాప్ సిటీల్లో మహిళలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని రేణూ దేశాయ్ అన్నారు. ఈ విషయాలు చెబితే ట్రోల్ చేస్తారని, ట్రోల్ చేసినా ఐ డోంట్ కేర్ అన్నారు రేణూ దేశాయ్.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts