Download App

Kaaka Release Date: పంతం నెగ్గించుకున్న కాకా దర్శకుడు… సంక్రాంతి రేసు నుంచి విశ్వంభర వెనక్కి!

నవంబర్ 29, 2026 • By Srinivas
Kaaka Vs Vishwambhara: సంక్రాంతి రిలీజుల విషయంలో నెలకొన్న గందరగోళానికి మెగాస్టార్ చిరంజీవి తెర దించారు. ఈ విషయంలో దర్శకుడు కేఎస్ రవీంద్ర తన పంతం నెగ్గించుకున్నారు. సంక్రాంతి బరిలో కాకా సినిమాను దించుతున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). విశ్వంభర వస్తుందా? కాకా దిగుతారా? అని గత కొన్ని...
Kaaka Release Date: పంతం నెగ్గించుకున్న కాకా దర్శకుడు… సంక్రాంతి రేసు నుంచి విశ్వంభర వెనక్కి!

Kaaka Vs Vishwambhara: సంక్రాంతి రిలీజుల విషయంలో నెలకొన్న గందరగోళానికి మెగాస్టార్ చిరంజీవి తెర దించారు. ఈ విషయంలో దర్శకుడు కేఎస్ రవీంద్ర తన పంతం నెగ్గించుకున్నారు.

సంక్రాంతి బరిలో కాకా సినిమాను దించుతున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). విశ్వంభర వస్తుందా? కాకా దిగుతారా? అని గత కొన్ని రోజులుగా గందరగోళం నెలకొంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు… విశ్వంభర విడుదల వాయిదాకు పలు కారణాలు ఉన్నాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ ఒక్కటే కారణం కాదు… ఓటీటీ డీల్ వంటివి కూడా ఆ సినిమా విడుదలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పుడు ఆ డౌట్స్ , కన్ఫ్యూషన్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పడింది.

జనవరి 13న కాకా విడుదల

Chiranjeevi Announces Kaaka Release Date: జనవరి 13న సంక్రాంతి కానుకగా కాకా సినిమాను థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్టు చిరంజీవి ప్రకటించారు. దాంతో మరోసారి విశ్వంభర వెనక్కి వెళ్ళిందని పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.

థియేటర్లలోకి విశ్వంభర ఎప్పడు వస్తుంది? అనేది పెద్ద పజిల్. ఆ మూవీ రిలీజ్ వాయిదా పడటం ఇదేమీ మొదటిసారి కాదు. అయితే ఓటీటీ డీల్ క్లోజ్ కావడంతో సంక్రాంతికి విశ్వంభర వస్తుందని ప్రచారం జరిగింది. అది తెలిసి కాకా దర్శకుడు బాబీ కొల్లి (Director Bobby Kolli) ఫీలయ్యాడని ఇండస్ట్రీ వర్గాల టాక్.

చిరంజీవికి బాబీ డై హార్డ్ ఫ్యాన్. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుపై ఎంత అభిమానం ఉందో చూపించారు. ఆ మూవీ సంక్రాంతి 2023కి విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ రెస్పాన్స్ అందుకుంది. ఆల్మోస్ట్ 200 కోట్ల కలెక్షన్స్ సాధించింది. అందుకని కాకా సినిమాను కూడా సంక్రాంతి బరిలో దింపాలని బాబీ ప్లాన్ చేశారు. మధ్యలో విశ్వంభర వచ్చే అవకాశం ఉందని వార్తలు రావడంతో బాబీ హర్ట్ అయ్యారు. ఎలాగైనా సరే సంక్రాంతి బరిలో కాకా సినిమా రిలీజ్ కావాలని పట్టుబట్టారు. పంతం నెగ్గించుకుని మరీ సంక్రాంతి బరిలో కాకాను దించుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేత రిలీజ్ డేట్ అనౌన్స్ చేయించారు. దాంతో విశ్వంభర మరోసారి వెనక్కి వెళ్ళక తప్పలేదు. ఆ మూవీకి ఎప్పడు మోక్షం కలుగుతుందో? వెయిట్ అండ్ సీ.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts