Download App

“మెగా” వారసులు జన్మించే లగ్నం…?

జనవరి 29, 2026 By Suresh Thota
జనవరి 31 వ తేదీన రాంచరణ్, ఉపాసన దంపతులకు కవలలు పుట్టబోతున్నారు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 31వ తేదీ నిజమే అని కొంతమంది జ్యోతిష్య పండితులు కూడా ఘంటాపథంగా చెబుతున్నారు. ఏ ఏ ముహూర్తాలలో పట్టవచ్చు అని కూడా సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు. ఇది ఎంత...
"మెగా" వారసులు జన్మించే లగ్నం…?

జనవరి 31 వ తేదీన రాంచరణ్, ఉపాసన దంపతులకు కవలలు పుట్టబోతున్నారు అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 31వ తేదీ నిజమే అని కొంతమంది జ్యోతిష్య పండితులు కూడా ఘంటాపథంగా చెబుతున్నారు.

ఏ ఏ ముహూర్తాలలో పట్టవచ్చు అని కూడా సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు. ఇది ఎంత వరకు మనం కూడా తెలుసుకుందాము.

31 వ తేదీ శనివారం ఉదయం మకర లగ్నంతో ప్రారంభం అవుతుంది. లగ్నాధిపతి తృతీయంలో ఉండి, తృతీయ, వ్యయాధిపతి గురువు, సప్తమాధిపతితో కలసి షష్టమ స్థానంలో ఉంటాడు కాబట్టి ఆ లగ్నం పెట్టకపోవచ్చు. ఇక వృషభ లగ్నంనకు అవకాశం ఉంది. మిధున లగ్నం లేదా తులా లగ్నంనకు అవకాశం ఉంది. మెగా కుటుంబం లో రాజయోగానికి కారకుడు శని మహరాజ్… అందువల్ల వీళ్ళు ఒకవేళ ముహూర్తం పెట్టించుకుంటే శని బలంగా ఉన్న లగ్నాలకే ప్రాధాన్యత ఇవ్వవచ్చు… వీళ్ళుగాని, వీరి ఇంటి జ్యోతిష్య పండితులు కాని, ఇందులో తల్లి ఉపాసన మకర రాశి… పిల్లలు మిధున రాశి అవుతారు కాబట్టి… రాశి రీత్యా షష్ట అష్టాకలు పడతాయి కాబట్టి… ఈ లగ్నానికి 50 50 చాన్స్ ఉంది. వృషభ లగ్నం మధ్యాన్నం 12.40ని.. కి ప్రారంభం అవుతుంది.

ఇక మిథున లగ్నం నకు కూడా అవకాశం ఉంది. లగ్నం లో గురు , చంద్రుల కలయిక మంచిదే అని అంటున్నారు కొంతమంది పండితులు. ఇది కూడా మధ్యానం 2.40 ని… కు ప్రారంభం అవుతుంది… కాకపోతే అష్టమ కుజుడు అని , కుజదోషం అని అంటారు… కాని ఇది అంత దోషమైన లగ్నం కాదు.

"మెగా" వారసులు జన్మించే లగ్నం…?

ఒకవేళ తులా లగ్నము పెట్టుకుంటే రాత్రి 11.20 ని.. ప్రారంభం అవుతుంది. ఈ లగ్నం పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే… ఉపాసన “శ్రవణ” నక్షత్రం… రామ్ చరణ్ “రోహిణీ” నక్షత్రం… కావున దీనికి వాళ్ళు మొగ్గు చూపే అవకాశం ఉంది… కాని గజకేసరి యోగం ఈ లగ్నానికి ఉండదు… చంద్రుడు మిధునం నుండి కర్కాటక రాశిలోకి వచ్చేస్తాడు కాబట్టి… తులా లగ్నానికి శని యోగ జాతకుడు కాని ఈ లగ్నానికి 6 లో ఉండటం చేత… శత్రువుల మీద పై చేయి సాధిస్తాడు… ఎదురుగా వచ్చి ఏ శత్రువు నిలబడలేడు… అది ఈ లగ్నానికి ఉన్న అతి పెద్ద బలం.

కాకపోతే భగవంతుడు చాలా రకాల పరీక్షలు పెడతాడు… కవల పిల్లలకు ముహూర్తం పెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని… నవాంశ ప్రతి 14 నిముషాలు కు మారుతుంది… కవలలు పుట్టినప్పుడు ఒకే నవాంశలో పుట్టకూడదు అంటారు. ఇద్దరికి 14 నిముషాలు తేడా ఉండాలి అంటారు, కొంతమంది జ్యోతిష్య పండితులు.

ఇప్పుడు వీళ్ళు ముహూర్తం పెట్టుకున్నప్పటికీ… కొంతమంది 30వ తేదీన “మృగశిర” నక్షత్రం లో పుట్టే అవకాశం ఉంది అంటున్నారు…. కొంతమంది పండితులు.

కాలం చాలా గొప్పది… మంచి పిల్లలు పుట్టి అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుందాం.

Suresh Thota

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading