సినిమా వార్తలు

ఓజీ – సాహోకు లింక్ ఉందా?

Published by
Rahul N

ఓజి (They Call Him OG) ట్రైలర్ రిలీజ్ అయ్యి కొన్ని గంటలే అయ్యింది. అభిమానులకే కాదు, సాధారణ ప్రేక్షకులకు కూడా నచ్చేసింది. 2 రోజులు ఎప్పుడు గడుస్తాయా… సినిమా ఎప్పుడు చూద్దామా అని వేచి చూస్తున్నారు.

అయితే ఏ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా, దాని ఫ్రేమ్స్‌ని విడదీసి విశ్లేషించడం, దానిలోని రహస్యాలను బయటపెట్టే ప్రయత్నం చేయడం అభిమానులకు, నెటిజన్లకు అలవాటైపోయింది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా వస్తున్న ఓజీ ట్రైలర్ పై కూడా అదే తరహా డిస్కషన్‌ లు స్టార్ట్ అయ్యారు.

ట్రైలర్‌లోని ఓ షిప్‌యార్డ్ సీన్‌లో కనిపించిన “వాజి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్” బోర్డు ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. ఇది యాదృచ్ఛికం కాదు అని చాలామంది అంటున్నారు. ఎందుకంటే అదే పేరును ప్రభాస్ నటించిన సాహో సినిమాలో మాఫియా వరల్డ్ సెటప్‌లో ఉపయోగించారు. దీంతో సోషల్ మీడియాలో కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి – “ఓజీ(OG)కి సాహో(Saaho)కి లింక్ ఉందా? రెండూ ఒకే యూనివర్స్‌లో భాగమా? ఫ్రాంచైజ్‌గా తీసుకెళ్తున్నారా?” అనే ప్రశ్నలు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

అయితే ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం వేరేలా ఉంది. ఓజీను దర్శకుడు సుజీత్ పవన్ కళ్యాణ్ అభిమానిగా 1980ల బ్యాక్‌డ్రాప్‌లో పూర్తి మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడని చెబుతున్నారు. మరోవైపు సాహో ప్రెజెంట్ టైమ్‌లైన్‌లో సాగే కథ. కాబట్టి ఈ రెండు సినిమాలకు నేరుగా కనెక్షన్ ఉండే అవకాశం లేదని టాక్. అయినప్పటికీ ట్రైలర్‌లో కనిపించిన బోర్డు మాత్రం ఫ్యాన్స్ ఊహలను ఆపలేకపోతోంది.

మేకర్స్ నుంచి క్లారిటీ రాకపోతే ఈ రూమర్స్ మరింత పెరుగుతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

మొత్తానికి, ఈ రూమర్స్‌తోనైనా ఓజీ ట్రైలర్ హైప్ రెట్టింపు మాత్రం ఖాయం. పవన్ కళ్యాణ్ మాస్ ప్రెజెన్స్, సుజీత్ స్టైలిష్ మేకింగ్‌తో సినిమా మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

Rahul N