Download App
Movie Poster

Jailer 2

Cast: Rajinikanth, Ramya Krishnan, Hrithik Roshan, Vidya Balan, SJ Suryah, Yogi Babu

Director: Nelson Dilipkumar

Music Director: Anirudh Ravichander

Banner: Sun Pictures

Release Date: October 15, 2026

జైలర్ 2 మూవీ రివ్యూ

Published అక్టోబర్ 15, 2026 by Srinivas

‘జైలర్’ సినిమా చాలా మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ‘జైలర్ 2’ కోసం ఎంతగానో ఎదురు చూశారు. ప్రేక్షకుల ఎదురు చూపులు ఫలించాయి. నేడు ‘జైలర్2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి టైగర్ ముత్తువేల్ పాండియన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను సినిమా అందుకుందా? తెలుసుకుందాం.

Jailer 2 Movie Review

కథేంటంటే…

తన కుమారుడి మరణం తర్వాత టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) తన కుటుంబంతో కలిసి తమిళనాడుకు వెళ్లిపోతాడు. అక్కడ కోయంబత్తూరులోని ఓ సూపర్ మార్కెట్‌లో ముత్తువేల్ పని చేస్తుంటాడు. అక్కడ తన కొడుకు మరణానికి కారణమైన వర్మ (వినాయకన్) పైన ఉన్న బాస్ ఎవరో తెలుసుకొని అతన్ని చంపేసేందుకు యత్నిస్తూ ఉంటాడు. అలాగే దేవతామూర్తుల విగ్రహాల అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు సూత్రధారిని కనిపెట్టే పనిలో పడతాడు. ఈ క్రమంలోనే మూడు ట్రక్కుల దేవతా విగ్రహాలను పట్టుకుని ముత్తువేల్ దాచేస్తాడు. ఆ తరువాత అసలు సూత్రదారిని కనిపెట్టే క్రమంలో మూర్తి దగ్గర డ్రైవర్‌గా చేరుతాడు. అక్కడే ఉంటూ దేవతా విత్రహాల స్మగ్లింగ్‌కి చెందిన వాడే దిలీప్ (సురాజ్ వెంజారమూడు) అని తెలుసుకుంటాడు. అతడిని చంపేస్తాడు. అసలు సూత్రధారి బోధి కల్పక్‌ (ఎస్‌జే సూర్య) అని తెలుసుకుంటాడు. అతడిని పట్టుకునే క్రమంలో పలువురు నేరస్థులను ఎదుర్కొంటాడు. చివరకు ఈ అక్రమ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చేశాడు? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఈ కథలో కాంత (విద్యాబాలన్), చక్రి (మిథున్ చక్రవర్తి) పాత్రలు ఏమిటి? అనే అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..

‘జైలర్ 2’ పూర్తిగా రజనీకాంత్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. కథ విషయానికి వస్తే కొత్తదనం ఏమీ కనిపించదు. దేవతా విగ్రహాల సూత్రదారి ఎవరో తెలుసుకునేందుకు యత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే కథను నడిపించిన తీరు చాలా బాగుంది. నటీనటులు సీరియస్‌గా మాట్లాడుకుంటారు కానీ మనకు అది చాలా హిలేరియస్‌గా అనిపిస్తుంది. చిన్న చిన్న డైలాగ్సే నవ్వు తెప్పిస్తాయి. ప్రేక్షకులను అలరించే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను అందించిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌ను అభినందించాలి. కథను ముందుకు నడిపించే క్రమంలో కొత్త పాత్రలను దర్శకుడు పరిచయం చేశారు. అవన్నీ కూడా ముత్తువేల్ తన లక్ష్యాన్ని చేరుకోవడంలో తమ వంతు సహకారం అందిస్తూ ఉంటాయి. ఆయన తెరపై కనిపించిన ప్రతిసారీ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించేలా సన్నివేశాలను దర్శకుడు తీర్చిదిద్దాడు. హృతిక్ రోషన్ పోషించిన రాడీ పాత్ర సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. ప్రమాదంలో ఉన్న జైలర్‌ను కాపాడేందుకు అతను రంగంలోకి దిగే సన్నివేశం ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. 20 ఏళ్ల క్రితం చేసిన సహాయాన్ని తాను మర్చిపోలేదని చెబుతూ అతను అందించే సహకారం ఆకట్టుకుంటుంది. కథలో మరింత బలమైన మలుపులు, ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండి ఉంటే సినిమా మరింత ఆకట్టుకునేది.

Jailer 2 Movie Review

నటీనటుల నటన

రజనీకాంత్‌ గురించి చెప్పేదేముంది? అదరగొట్టేశారు. ఈ సినిమా రజినీకాంత్ వన్ మ్యాన్ షో అనడంలో సందేహం లేదు. శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్ మరోసారి కీలక పాత్రల్లో కనిపించి మెప్పించారు. ముత్తువేల్ తన మిషన్‌లో విజయం సాధించేందుకు వీరంతా సహకరిస్తారు. సూరజ్ వెంజరమూడు, విద్యా బాలన్, ఎస్‌జే సూర్య, మిథున్ చక్రవర్తి ప్రత్యేక పాత్రలు కథకు చాలా పెద్ద అసెట్‌ మారాయి. ముఖ్యంగా హృతిక్ రోషన్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారు. రమ్యకృష్ణ, మీర్నామీనన్ పాత్రలకు సీక్వెల్‌లో పెద్దగా ప్రాధాన్యమివ్వలేదు. మిగిలిన వారంతా తమ పాత్రల్లో చక్కగా నటించారు.

టెక్నికల్ పరంగా..

అనురుధ్ సంగీతం అదరగొట్టేశారు. ముఖ్యంగా బీజీఎం సినిమాకు హైలైట్ అని చెప్పాలి. పాటలు పర్వాలేదనిపించాయి. విజువల్స్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.

ఫైనల్‌గా..

రజినీకాంత్ ఫ్యాన్స్‌కు మంచి కమర్షియల్ ఫెస్టివల్ వైబ్‌ను అందించే చిత్రం. కథను పక్కనబెడితే రజినీ మ్యాజిక్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు.

Rating: (3/5)

మరిన్ని వార్తలు

No categories found.

Trending Now