ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47 మూవీ రివ్యూ
Published అక్టోబర్ 30, 2026 by Srinivas
‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ సినిమా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాల స్థాయిలో అలరిస్తుందని తాజాగా విక్టరీ వెంకటేష్ చెప్పారు. త్రివిక్రమ్, వెంకీ కాంబో 20 ఏళ్ల తర్వాత రిపీట్ అయ్యింది. మొత్తానికి ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వెంకీ ఫ్యామిలీ హీరో కాబట్టి ఈ సినిమాపై ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్‌లో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి సినిమా ఎలా ఉంది? అంచనాలను అందుకుంటుందా? తెలుసుకుందాం.

కథేంటంటే..
డబ్బున్న ఇళ్లను చేసుకుని సూరజ్ బాన్ గ్యాంగ్ టార్గెట్ చేసి ఆ ఫ్యామిలీని హతమార్చి ఇంటిని దోచేస్తుంది. ఈ గ్యాంగ్ ను పట్టుకునేందుకు ఐపీఎస్ ఆఫీసర్ దామోదర్ నాయుడు (నారా రోహిత్) రంగం లోకి దిగుతాడు. మరోవైపు బ్యాంకు ఉద్యోగి అయిన చిట్టిబాబు(వెంకటేశ్)కు భార్య స్వర్ణ(శ్రీనిధి శెట్టి), కూతురు సంపూర్ణ (యువీనా), కొడుకు శర్వ(రాజా ప్రజ్వల్)యే ప్రపంచం. స్వర్ణ వచ్చేసి చిట్టీల వ్యాపారం పేరుతో అప్పులు చేస్తూ చిట్టిబాబుకు తలనొప్పిగా తయారవుతుంది. కూతురు సంపూర్ణ తన ప్రేమ వ్యవహారంతో. తండ్రిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కొడుకు శర్వకు చదువు రాదు సరికదా.. తను చేసే అల్లరి పనులతో ఇబ్బందిగా తయారవుతాడు. ఇలా తన కుటుంబంతో వేగుతూ సాధారణ జీవితం గడుపుతున్న చిట్టిబాబుకు 100 కోట్ల లాటరీ తగులుతుంది. దీంతో గ్రేటెడ్ కమ్యూనిటీకి షిఫ్ట్ అవుతాడు. చందన్ గ్యాంగ్ కళ్ళు చిట్టిబాబు కుటుంబంపై పడతాయి. 100 కోట్లు దోచుకోవాలని స్కెచ్ గీసి ఆ ఇంట్లో పనికి కుదురుతారు. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? చందన్ గ్యాంగ్ 100 కోట్లు దోచేసిందా? చిట్టిబాబు గతం ఏంటి? సమస్యల్లో కూరుకుపోయిన తన ఫ్యామిలీని రక్షించుకోవడానికి చిట్టిబాబు ఏం చేశాడు? చిత్రంలో డీఎస్సీ బృహస్పతి ( రావు రమేశ్), చిత్తరంజన్ ( సత్య) పాత్రలు ఏంటి? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..
దర్శకుడు త్రివిక్రమ్ పాత కథను తీసుకొని సరికొత్తగా మలచడంలో దిట్ట. ఈసారి మాత్రం తన కాస్త వినూత్నమైన కథనే ఎంచుకున్నారని చెప్పాలి. సినిమా ప్రారం భంలో ఒక గ్యాంగ్ స్టార్ చేసే ఆగడాలని చూపించి కథలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత చిట్టి బాబు ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే సీరియస్ 3 తో ప్రారంభించి కామెడీ వేలోకి తీసుకెళ్ళిపోయారు. ఫస్టాఫ్ అంతా గ్యాంగ్స్టర్ పరిచయం చిట్టి బాబు ఫ్యామిలీ ఇంట్రడక్షన్.. లాటరీ తగలడం.. చిట్టిబాబు ఫ్యామిలీ గ్రేటర్ కమ్యూనిటీ లోకి మారడం.. వారిని చందన్ గ్యాంగ్ టార్గెట్ చేయడం వంటి అంశాలతో నడిపించేశారు. సినిమాకు ఇంటర్వెల్ బ్యాంక్ చాలా కీలకమని చెప్పాలి. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ మనకు అర్జున్ సబ్జా బ్లాస్ట్ సినిమాను గుర్తుకు తెస్తుంది. సెకండ్ హాఫ్ ను కూడా బాగానే నడిపించారు కానీ సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్ వచ్చేసరికి తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. ఏది ఏమైనా సినిమా మాత్రం బోర్ కొట్టకుండా నడిపించారు. ఫ్యామిలీ ఆడియన్స్ ను సినిమా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా త్రివిక్రమ్ డైలాగ్ స్ అలా ఆకట్టుకున్నాయి. క్లైమాక్స్ ను బలంగా రాసుకొని ఉంటే బాగుండేది.

ఎవరెలా చేశారంటే…
ముఖ్యంగా సినిమా గురించి చెప్పాల్సి వస్తే వెంకీ నటన గురించి చెప్పాలి. చిట్టిబాబు గా వెంకటేష్ తన పాత్రలో జీవించేశారు. కామెడీ, సీరియస్ సన్నివేశాలు అన్నింటిలోనూ ఆకట్టుకున్నారు. శ్రీనిధి విషయానికొస్తే అద్భుతంగా నటించింది. యాక్షన్స్ సన్నివేశాల్లో సైతం ఆకట్టుకుంది. సత్యా కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అని చెప్పాలి. నారా రోహిత్ సైతం తన పాటల్లో ఒదిగిపోయారు. రావు రమేష్ కీలక పాత్రలో నటించి మెప్పించారు. మిగిలిన నటీనట్లు అంతా తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.
టెక్నికల్ పరంగా..
దర్శకుడు త్రివిక్రమ్ సినిమాని చాలా ఆసక్తికరంగా నడిపించారు. క్లైమాక్స్ ని బలంగా రాసుకొని సినిమా మరో స్థాయిలో ఉండేది. ఎడిటింగ్ విషయంలో శ్రద్ధ తీసుకొని ఉండాల్సింది. మ్యూజిక్ సినిమాను ఓ మెట్టు ఎక్కించింది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పాటలు బాగా వైరల్ అవుతున్నాయి. బిజీ ఎం కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నాయి.
ఫైనల్ గా…
వెంకీ అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా మంచి ఛాయిస్.
Rating: 



(3/5)
