Download App
Movie Poster

Crazy Kalyanam

Cast: Anupama Parameswaran, Tharun Bhascker, Naresh, Akhil Raj Uddamari, Kireeti

Director: Badrappa Gajula

Music Director: Suresh Bobbili

Producer: Boosam Jagan Mohan Reddy

Banner: Arrow Cinemas

Release Date: October 16, 2026

క్రేజీ కల్యాణం మూవీ రివ్యూ

Published అక్టోబర్ 16, 2026 by Srinivas

ఒకప్పుడు అన్ని సినిమాలతో పాటే విలేజ్ ఫ్యామిలీ కామెడి ఎంటర్‌టైనర్స్ కూడా వచ్చేవి. మధ్యలో వాటి జోరు పూర్తిగా తగ్గిపోయింది. అసలు విలేజ్ బేస్డ్ స్టోరీల జోలికే దర్శకులు వెళ్లలేదు. తిరిగి ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ ప్రారంభమైంది. తాజాగా ఈ కోవకు చెందిన ‘క్రేజీ కల్యాణం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తరుణ్ భాస్కర్, అనుపమ పరమేశ్వరన్, అఖిల్ రాజ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ అయితే కడుపుబ్బ నవ్వించింది. మరి సినిమా ఎలా ఉంది? తెలుసుకుందాం.

క్రేజీ కల్యాణం Movie Review

కథేంటంటే..

పర్వతాలు (నరేష్) దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురికి బాలరాజు (తరుణ్ భాస్కర్)తో వివాహమవుతుంది. బాలరాజు సంబంధాన్ని పర్వతాలు అన్న తీసుకువస్తాడు. అయితే బాలరాజు ఏ పని చేయడు. తాగుతూ జులాయిగా తిరుగుతుంటాడు. తన చిన్న కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్) చిన్నప్పటి నుంచి తన క్లాస్‌మేట్ అయిన ఉదయ్ (అఖిల్)ను ప్రేమిస్తూ ఉంటుంది. అయితే కీర్తికి బాలరాజు వంటి అల్లుడిని తీసుకురాకుండా మంచి అల్లుడిని తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలోనే పర్వతాలు అన్న కూతురుకి ఓ అమెరికా సంబంధం వస్తుంది. అబ్బాయి కిరీటి అమెరికాలో జాబ్ చేస్తుంటాడు. అన్న ఫోన్ చేస్తే వెళ్లిన పర్వతాలు అక్కడకు వెళ్లి పెళ్లి వారిని తమ ఇంటికి టీకి ఆహ్వానిస్తాడు. అలా తన కూతురు కీర్తిని వారికి చూపిస్తాడు. కీర్తిని చూసిన కిరీటి తొలిచూపులోనే ఆమెను ఎంతగానో ఇష్టపడతాడు. ఇక ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో పర్వతాలు చాలా హ్యాపీగా ఫీలవుతాడు. తన కూతురికి తన పొలాన్ని అమ్మి రూ.30 లక్షలు కట్నమిచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలనుకుంటాడు. ఇంతలోనే కీర్తి తను ఉదయ్‌ను ప్రేమిస్తున్నట్టుగా పర్వతాలుకు చెబుతుంది. ఆ తరువాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? ఉదయ్‌తో పెళ్లికి పర్వతాలు అంగీకరించాడా? వంటి అంశాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

క్రేజీ కల్యాణం Movie Review

సినిమా ఎలా ఉందంటే..

ఒక కూరకు కావాల్సిన అన్ని పదార్థాలు ఉన్నా కూడా అన్నింటినీ మిక్స్ చేయడంలో విఫలమైతే కూర ఎలా ఉంటుందో సినిమా అలా ఉంది. దర్వకుడు బద్రప్ప గాజుల సినిమాకు కావల్సిన అన్ని అంశాలనూ తీసుకున్నాడు కానీ వాటిని మిక్స్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఎమోషన్ ఏమాత్రం వర్కవుట్ కాలేదు. కామెడీ అస్సలు పండలేదు. దీంతో సినిమా ఏమాత్రం ప్రేక్షకులకు ఎక్కదు. ఆడపిల్లను చక్కగా చదివిస్తారు కానీ వారికి మంచి లైఫ్‌ను ఇవ్వడంలో ఫెయిల్ అవుతుంటారు. తమ కూతురు ప్రేమ విషయం తెలిస్తే తమ పరువు పోతుందని గ్రామాల్లో ఫీలయ్యే తల్లిదండ్రులు ఇప్పటికీ ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకునే దర్శకుడు ఈ సినిమాను తీశాడు. అయితే చాలా లాజిక్స్ మిస్ అయ్యాయి. ఒకమ్మాయికి ఎమ్మార్వో పోస్ట్ వస్తే ఎక్కడికి వెళ్లి తెలుసుకుంటుంది? స్కూలుకు వెళ్లా? ఇంతకు మించిన దారుణం మరొకటి ఉండదు. దర్శకుడు కనీసం ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోలేదు. ఇలా చాలా విషయాల్లో దర్శకుడు లాజిక్ మిస్ అయ్యాడు. కనీసం కామెడీ వర్కవుట్ అయినా బాగుండేది. అది కూడా వర్కవుట్ అవలేదు. దీంతో సినిమా ఏ రకంగానూ ప్రేక్షకులకు నచ్చదు.

ఎవరెలా నటించారంటే…

అనుపమ పరమేశ్వరన్ తన పాత్రను అద్భుతంగా పోషించింది. నరేష్ తన పాత్రలో జీవించారు. తన కూతురి పెళ్లి సమయంలో ఆయన నటన ఆకట్టుకుంది. ఇక తరుణ్ భాస్కర్ చాలా బాగా నటించారు. అఖిల్ కూడా తన పాత్రలో ఒదిగిపోయాడు. కిరీటి, ఇతర నటులంతా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

క్రేజీ కల్యాణం Movie Review

టెక్నికల్ పరంగా…

టెక్నికల్ పరంగా సినిమా ఏమాత్రం బాగోలేదని చెప్పాలి. బీజీఎం అస్సలు బాగోలేదు. పాటలు ఒక్కటంటే ఒక్కటి కూడా బాగోలేదు. ఇక ఎడిటింగ్, నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.

ఫైనల్‌గా.. ‘క్రేజీ కల్యాణం’ అంత క్రేజీగా లేదు.

Rating: (2.5/5)

మరిన్ని వార్తలు

No categories found.

Trending Now