రాజా ది రాజా మూవీ రివ్యూ
Published జూలై 18, 2026 by Srinivas
తొలి సినిమా ‘రాజా ది రాజా’లోనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన హీరో రుత్విక్. వాస్తవానికి ఇదొక డిఫరెంట్ స్టోరీ అని.. దీనిని ట్రైలర్ రిలీజ్ తర్వాత ‘మగధీర’తో పోలుస్తున్నారంటూ నిర్మాత నిహారిక దాసరి అయితే బీభత్సమైన హైప్ సినిమాకు ఇచ్చేశారు. ఇక ట్రైలర్ చూస్తుంటే ‘మగధీర’ అని అయితే అనిపించలేదు కానీ ఏదో కొత్తగా ట్రై చేశారని మాత్రం అనిపించింది. మరి సినిమా ఎలా ఉంది? కొత్తగానే ఉందా? లేదా? తెలుసుకుందాం.

కథేంటంటే..
సీనియర్ డాక్టర్ అయిన సత్యా (నరేష్)నికి ఏకైక కుమారుడు రాజ్ కుమార్ అలియాస్ రాజా (ఋత్విక్). సత్యం ఇంట్లోనే చిన్న క్లినిక్ నడుపుతూ ఉంటాడు. తన కుమారుడు తనలా కాకుండా పెద్ద డాక్టర్‌ని చేయాలనేది అతని కల. కానీ రాజాకు మాత్రం వైద్య వృత్తిపై అంత ఇంట్రస్ట్. ఒక గొప్ప ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనేది అతని డ్రీమ్. ఇక తనకు ఇష్టం లేకున్నా తండ్రి ఆనందం కోసం ఎంబీబీఎస్ చేస్తాడు. అయినా కూడా తన కోరికను మాత్రం వదిలిపెట్టడు. ఈ క్రమంలోనే ఫ్యాషన్ రంగంలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఈ క్రమంలోనే అరవింద్ కృష్ణ (అవసరాల శ్రీనివాస్) కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు. రాజా డిజైన్స్‌కి అరవింద్‌కి బాగా నచ్చుతాయి కానీ ఆ డిజైన్స్‌కి సెట్ అయ్యే అమ్మాయి వారికి అవసరమవుతుంది. ఈ క్రమంలోనే అమ్మాయిని వెదికే బాధ్యతను సైతం రాజాకు అరవింద్ అప్పగిస్తాడు. ఎంతమందిని ఆడిషన్ చేసినా కూడా ఎవరూ రాజాకి నచ్చరు. ఆ తరుణంలో అతనికి ఆద్య (విశాఖ ధీమాన్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ అమ్మాయే తన డిజైన్స్‌కి పర్ఫెక్ట్ అని రాజా భావించి ఆమెతో స్నేహం చేస్తాడు. కాంపిటీషన్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో రాజా గురించి తండ్రికి తెలిసిపోతుంది. ఆ తరువాత ఏం జరిగింది? అసలు ఆద్య ఎవరు? పునర్జన్మ కథేంటి? వారిద్దరికీ గత జన్మలో పరిచయం ఉందా? ఆద్యకు మణిగడ్‌కి చెందిన రాజ్యానికి సంబంధం ఏంటి? అనే అంశాలను వెండితెరపై వీక్షించాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే..
సినిమాను ఒక పిరియాడిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు అనిల్ బోయిడపు తెరకెక్కించారు. అయితే సినిమాలో ప్రేక్షకులను కొన్ని ఎమోషనల్ సీన్స్ మాత్రమే ఆకట్టుకుంటాయి. మిగతా సినిమా ఏమాత్రం ఆకట్టుకోవదు. కథ, కథనాలు స్లోగా సాగడంతో ప్రేక్షకులకు విసుగు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం ఒక ఎత్తైతే.. అనవసరమైన సన్నివేశాలతో సినిమాను సాగదీశారు. రుత్విక్‌కు సంబంధించిన పిరియాడిక్ ట్రాక్ పర్వాలేదనిపిస్తుంది. అలాగే తండ్రీ కొడుకుల మధ్య జరిగే డ్రామా కూడా ఓకే అనిపిస్తుంది. ఇంతకు మించి సినిమాలో చెప్పుకొదగిన అంశాలైతే లేవు. ముఖ్యంగా కామెడీ ట్రాక్ కోసం కొందరు నటీనటులను తీసుకున్నారు కానీ ఏమాత్రం వర్కవుట్ అవలేదు. అదొక పెద్ద మైనస్ అని చెప్పాలి. కొన్ని యూత్‌కి సంబంధించిన భావోద్వేగ సన్నివేశాలు మాత్రం చక్కగా నడిపించినట్టుగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు చాలా స్లోగా అనిపిస్తాయి. కనీసం మెయిన్ క్యారెక్టర్స్ కూడా ప్రేక్షకులకు సరిగా కనక్ట్ అవరు.
ఎవరెలా నటించారంటే..
హీరో రుత్విక్ విషయానికి వస్తే అతని నటన కొన్ని సన్నివేశాల్లో ఓవర్ అయినట్టుగా అనిపించింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్ విశాఖ అయితే సినిమాకు అంతగా సెట్ అవలేదు. గ్లామర్ పరంగా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నరేష్ అయితే తన పాత్రలో జీవించారు. చాలా హూందాగా కనిపించారు. అవసరాల శ్రీనివాస్, విష్ణు ఓఐ, పార్వతీశం తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..
అనిల్ బోయిడపు కంటే ముందుగా ఇద్దరు దర్శకులు ఈ ప్రాజెక్టును టేకప్ చేసి, ఆ తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఎగ్జిట్ అయయారని టాక్. అనిల్ తన చేతుల్లోకి తీసుకున్నా కూడా ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అదే రొటీన్ పాత కథ. స్క్రీన్‌ప్లే సైతం ఆకట్టుకోలేకపోయింది. కామెడీ ట్రాక్‌ను సైతం సమర్థవంతంగా నడిపించలేకపోయారు. కొన్ని సన్నివేశాల్లో డీఓపీ బాగుంది. మార్క్ కె రాబిన్ మ్యూజిక్ సినిమాకు ప్లస్. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.
ఫైనల్‌గా.. వర్కవుట్ అవలే ‘రాజా ది రాజా’
Rating: 



(1.75/5)
