Download App
Movie Poster

Scene

Cast: Suriya, Nazriya Nazim, Naslen, Sushin Shyam

Director: Jithu Madhavan

Music Director: Sushin Shyam

Producer: Jyotika – Suriya

Banner: Zhagaram Studios & 2D Entertainment

Release Date: November 6, 2026

సీన్ మూవీ రివ్యూ

Published నవంబర్ 6, 2026 by Srinivas

సూర్య ప్రధాన పాత్రలో.. ఆయన సతీమణి జ్యోతిక నిర్మించిన చిత్రం ‘సీన్’. ఆస్కార్ చిత్రమైన ‘బాలన్: ది బాయ్’కు కథ, స్క్రీన్‌ప్లే అందించిన జితూ మాధవన్ ఈ చిత్రాన్నిడైరెక్ట్ చేశారు. అంతకు ముందు ఆయన దర్శకత్వం వహించిన ‘రొమాంచమ్, ఆవేశం’ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. అయితే ‘సీన్’ చిత్రం టాలీవుడ్‌లో అయితే పెద్దగా జనాల్లోకి వెళ్లలేదు. దీనికి కారణం ప్రమోషన్స్ పెద్దగా నిర్వహించకపోవడమే. దీంతో సినిమాపై అంచనాలు కూడా లేవు. ఎలాంటి అంచనాలు లేకుండా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ‘సీన్’ ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? తెలుసుకుందాం.

Scene Movie Review

కథేంటంటే…

ప్రేమ్‌రాజ్ (సూర్య‌) ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. క్రైమ్ బ్రాంచ్‌లో పని చేసే ప్రేమ్‌రాజ్‌.. ఎన్నో క్లిష్ట‌మైన కేసుల‌ను సైతం ఇట్టే పరిష్కరించడంలో దిట్ట. ఓ కెమికల్ రియాక్షన్ కార‌ణంగా ప్రేమ్‌రాజ్ కంటిచూపు క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గిపోతుంది. అయితే తను బ్లైండ్ అనే విషయాన్ని మాత్రం బయటకు తెలియనివ్వడు. విక్ట‌ర్ (టోవినో థామ‌స్‌) అనే సీరియ‌ల్ కిల్ల‌ర్ కార‌ణంగా ప్రేమరాజ్ దాచిన నిజం క్రైమ్ బ్రాంచ్ హెడ్ స్టీఫెన్‌కు తెలిసిపోతుంది. దీంతో ప్రేమ్‌రాజ్‌ను ఉద్యోగం నుంచి తీసేస్తాడు. అదే సమయంలో సిటీలో ఒకే త‌ర‌హాలో వరుస హత్యలు జరుగుతుంటాయి. త‌న‌పై వ‌చ్చిన కొన్ని ఫేక్ ఆరోప‌ణల కార‌ణంగా ఈ కేసును సాల్వ్ చేస్తాన‌ని స్టీఫెన్‌తో ప్రేమ్‌రాజ్‌ ఛాలెంజ్ చేసి రంగంలోకి దిగుతాడు. ఈ సీరియ‌ల్ కిల్ల‌ర్ కేసు ఇన్వేస్టిగేష‌న్‌లో తనకు సాయంగా ప్రేమ్‌రాజ్ మాయ (న‌జ్రియా న‌జీమ్‌)ను నియమించుకుంటాడు. ఆ తరువాత కళ్లు లేని ప్రేమ్‌రాజ్ తన ఇన్వెస్టిగేషన్‌ను ఎలా నిర్వహించాడు? ఎలాంటి ఆధారాలు లేకుండా హ‌త్య‌లు చేస్తున్న‌ తెలివైన కిల్ల‌ర్‌ ఈశ్వర (నస్లెన్) ఎలా పట్టుబడ్డాడు? మాయ‌తో ప్రేమ్‌రాజ్‌కు ఏర్ప‌డిన ప‌రిచ‌యం ఎలా ప్రేమ‌గా మారింది? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

సీన్ Movie Review

ఎలా ఉందంటే…

సీరియల్ కిల్లర్ సినిమాల్లో సీరియస్‌నెస్ తప్ప సరదాకు దాదాపుగా ఛాన్స్ ఉండదు. కానీ దర్శకుడు జీతు మాధవన్ మాత్రం ఒక సీరియల్ కిల్లర్ కథను తనదైన శైలిలో పూర్తిగా భిన్నంగా తెరకెక్కించారు. ‘రోమాంచం’, ‘ఆవేశం’ సినిమాలతో హారర్, గ్యాంగ్‌స్టర్ జానర్లకు ఎంటర్‌టైనింగ్ ట్విస్ట్ ఇచ్చిన జీతు మాధవన్, ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను తనదైన శైలిలో రూపొందించారు. ఇది ఆయన జీతూ మాధవన్ కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రంగా నిలవనుందనడంలో సందేహం లేదు. ఆసక్తికర విషయం ఏంటంటే… ఈ సినిమాలోని వండర్స్ ఆసక్తికరంగా హీరో పాత్ర పరిచయంతోనే మొదలవుతాయి. ఇప్పటి వరకూ యూనిక్ స్క్రిప్ట్స్‌తో మెస్మరైజ్ చేసిన జీతు.. ఈ సినిమా విషయంలోనూ ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచలేదు. ప్రేమ్‌రాజ్‌కు మాయను జత చేయడం.. ఒక్కొక్కరికి ఒక్కో లోపం పెట్టడం.. తద్వారా ఫన్ జెనరేట్ చేయడం వంటివి మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. మరోవైపు ఈశ్వర (నస్లెన్) పాత్రను కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈశ్వర తెలివైన సీరియల్ కిల్లర్.. అతను ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ కిల్లర్‌గా కూడా పనిచేస్తుంటాడు. ఇలాంటి తెలివైన హంతకుడిని తన బలహీనతతో పోరాడుతూనే ప్రేమ్‌రాజ్ ఎలా పట్టుకుంటాడన్న అంశం ఆసక్తిని రేకెత్తిస్తుంది. సినిమా మొదట్లో కాస్త ఫ్లాట్‌గా అనిపిస్తుంది. కానీ హీరో బలహీనతను పరిచయం చేసిన క్షణం నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. ఇన్‌బరాజ్, ఈశ్వర్ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ ప్రేక్షకులను పూర్తిగా కథలో లీనమయ్యేలా చేస్తుంది. చాలా తక్కువ మంది ఆర్టిస్టులను తీసుకుని ప్రతి ఒక్కరికీ మంచి స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. దర్యాప్తు సన్నివేశాలన్నింటినీ ప్రేమ్‌రాజ్ ఇంటి చుట్టూ తిప్పడం.. ఇంటికి కూడా ప్రాధాన్యతనివ్వడం ఆసక్తికరం. చివరకు క్లైమాక్స్‌లో ఇంటికి ఇచ్చిన ఎలివేషన్ చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఓవరాల్‌గా సినిమా అయితే ఈ వీకెండ్‌లో వచ్చిన వాటన్నింటిలో ది బెస్ట్ అని చెప్పాలి.

సీన్ Movie Review

ఎవరెలా నటించారంటే…

సూర్య ఎంతో సహజంగా, రిలాక్స్‌డ్‌గా నటించి మెప్పించారు. స్టైలిష్ లుక్‌తో చాలా జోవియల్‌గా కనిపించాడు. నజ్రియా అయితే తన పాత్రలో జీవించేసింది. ఎక్స్‌ప్రెషన్స్‌తో విపరీతంగా ఆకట్టుకుంది. ఈశ్వర అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రలన్నీ తమ పాత్ర పరిధి మేరకు మెప్పించారు.

టెక్నికల్ పరంగా…

జీతూ మాధవన్ బ్రిలియంట్ స్క్రిప్ట్, బ్రిలియంట్ డైరెక్షన్. అదరగొట్టేశారు. స్టార్టింగ్ టు ఎండింగ్ కొన్ని లోపాలున్నా కూడా అద్భుతమైన స్క్రీన్‌ప్లే వాటన్నింటినీ కప్పేసింది. స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. ఏ ట్విస్ట్‌నూ ముందుగానే ఊహించడం చాలా కష్టం. ఎడిటింగ్ విషయంలో కాస్త శ్రద్ధ తీసుకుని ఉండాల్సింది. మ్యూజిక్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్‌గా.. బొమ్మ బ్లాక్ బస్టర్

Rating: (3/5)

మరిన్ని వార్తలు

No categories found.