Download App
Movie Poster

Vadala

Cast: Jagapathi Babu, Laya, Hrutika Srinivas, Avasarala Srinivas, Ravi Varma, Jenny

Director: Akella V. Krishna

Music Director: Karthik B. Kodakandla

Producer: Kishore Naidu Chirumamilla, Tammareddy Bharadwaja

Release Date: July 17, 2026

వదలా మూవీ రివ్యూ

Published జూలై 17, 2026 by Srinivas

ఒకప్పుడు జగపతిబాబు, లయ మంచి హిట్ పెయిర్. తిరిగి ఇంత కాలానికి ఇద్దరూ జంటగా ‘వదలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 20 ఏళ్ల పాటు సంతోషకరమైన దాంపత్య జీవితం గడిపిన వారి లైఫ్‌లోకి ఒక అనుకోని వ్యక్తి వచ్చి.. తానెవరో తెలియకుండా వారితో ఒకాట ఆడుకుంటే ఏంటి పరిస్థితి? కనిపించని శత్రువుతో ఎలా పోరాడారు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా? చూద్దాం.

Vadala telugu movie review

కథేంటంటే..

డాక్టర్ అయిన యోగి సిద్ధార్థ్‌ (జగపతిబాబు)కు భార్య ప్రియ (లయ), తన ఇద్దరు పిల్లలే ప్రపంచం. 20 ఏళ్ల వారి సంసార జీవితం ఎలాంటి కలతలు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. అలాంటి వారి జీవితంలోకి అముద (హృతిక శ్రీనివాస్‌) అనే యువతి ప్రవేశిస్తుంది. ఓ రోడ్డు ప్రమాదంలో అముద గాయపడుతుంది. ఆమెకు చికిత్స చేసి సిద్దార్థ్ కాపాడుతాడు. దీంతో సిద్ధార్థ్‌పై అమితమైన ప్రేమను పెంచుకుని ముందుకు అతని కుటుంబానికి దగ్గరవుతుంది. ఆ తరువాత ఎలాగైనా సిద్దార్థ్‌ను దక్కించుకోవాలనే లక్ష్యంతో సైకోలా మారుతుంది. ఈ క్రమంలోనే సిద్దార్థ్, ప్రియను విడగొట్టేందుకు ఓ ప్లాన్ చేస్తుంది. దానిలో భాగంగానే ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి వారిద్దరికీ ఫోన్లు, సందేశాలు పంపుతూ వారిని మానసికంగా వేధించడం మొదలు పెడుతుంది. ఆ తరువాత కథ ఏమైంది? అముద అనుకున్నది చేయగలిగిందా? అసలు అముద ఎవరు?బాంబు బ్లాస్ట్‌లో ప్రాణాలు కోల్పోయిన నివాస్‌ (శ్రీనివాస్‌ అవసరాల)కి అముదకు ఉన్న సంబంధం ఏంటి? అముద నుంచి సిద్ధార్థ్‌ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? వంటి విషయాలను సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Vadala telugu movie review

ఎలా ఉందంటే..

‘వదలా’ చిత్రం సైకలాజికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌‌గా దర్శకుడు తీర్చిదిద్దాడు. సంతోషంగా సాగిపోతున్న ఓ దాంపత్య జీవితంలోకి మరో మహిళ ప్రవేశిస్తే.. తలెత్తిన పరిణామాలేంటి? అన్నదే కథాంశం. పాయింట్ అయితే బాగుంది కానీ ప్రెజెంట్ చేసిన తీరే లోపభూయిష్టంగా ఉంది. సినిమా మొత్తం చూసినా కూడా ఐదారు పాత్రలకు మించి కనిపించవు. ఈ సినిమాకు ప్లస్ ఏంటంటే.. నిడివి. రెండు గంటల్లోపే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా సింపుల్ ఫ్యామిలీ డ్రామాగానూ.. సెకండాఫ్ కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్‌గానూ ఉంటుంది. సిద్దార్థ్-ప్రియల జీవితంలో ఆముద సృష్టించే కల్లోలం.. వారి పిల్లల ప్రాణాలకు ఏర్పడే ముప్పు అన్నీ ఆసక్తికరంగానే అనిపిస్తాయి. అయితే ఆముద పాత్ర ఫ్లాష్ బ్యాక్‌ను స్ట్రాంగ్‌గా రూపొందించి ఉంటే సినిమా మంచి థ్రిల్లింగ్‌గా అనిపించేది. గతం రివీల్ అయిన తర్వాత కథేంటనేది చూసే ప్రేక్షకుడికి అర్థమైపోతూ ఉంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పర్వాలేదనిపిస్తుంది. కొన్ని సీన్లు థ్రిల్లింగ్‌గా అనిపించినా కూడా అంతలోనే రొటీన్ ఫార్మాట్‌లోకి కథ వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. చివరకు ఎండింగ్ కూడా వాస్తవ విరుద్ధంగా అనిపిస్తుంది. పైగా ఏమాత్రం థ్రిల్ అనిపించదు.

ఎవరెలా చేశారంటే..

జగపతిబాబుకి ఇలాంటి కథలు కొత్తేం కాదు కాబట్టి తన పాత్రలో జీవించేశారు. కుటుంబాన్ని ఎంతో ప్రేమించే వ్యక్తిగా ఆకట్టుకున్నారు. అలాగే ఓ సైకో యువతి చేతిలో చిక్కుకుని అల్లాడిపోయే వ్యక్తిగా అద్భుతంగా నటించారు. ఇక లయ కూడా తన పాత్రలో అద్భుతంగా నటించింది. భర్తని అమితంగా ప్రేమించే భార్యగా లయ తన పాత్రలో ఒదిగిపోయింది. హృతిక విషయానికి వస్తే విలన్‌గా తన నటనతో ఆకట్టుకుంది. శ్రీనివాస్‌ అవసరాల, రవివర్మ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ పరంగా..

దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం అయితే లేదు. పైగా ఫస్ట్ హాఫ్‌ను ఒక రొటీన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందించారు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే ఏమాత్రం ఆకట్టుకోదు. సన్నివేశాలన్నీ మనకు ఊహకు తగినట్టుగానే నడుస్తుంటాయి. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి.

ఫైనల్‌గా: ‘వదలా’.. కొంచెం థ్రిల్.. కొంచెం బోర్..

Rating: (2/5)

మరిన్ని వార్తలు

No categories found.