Download App

ఈ “ప్రళయ” గర్జనతో పాక్ కి ముచ్చెమటలు…

జనవరి 2, 2026 Published by Srinivas

ఈ "ప్రళయ" గర్జనతో పాక్ కి ముచ్చెమటలు…

భారత క్షిపణి శక్తిని మన DRDO సంస్థ డిసెంబర్ 31, 2025 న ఉదయం 10:30 గంటలకు, ఒడిశా తీరానికి సమీపంలో ఒకే లాంచర్ నుంచి అత్యంత తక్కువ వ్యవధిలో రెండు ‘ప్రళయ్’ క్షిపణులను విజయవంతంగ ప్రయోగించింది.

ఈ ప్రయోగం భారత సాయుధ దళాల అప్పగించే ముందు పరీక్షలో భాగంగా నిర్వహించబడింది. అంటే ఈ పరీక్ష తర్వాత DRDO సైన్యం నకు వినియోగించడానికి ముందు జరిపే పరీక్ష… దీని పరిధి 150 కిలోమీటర్ల నుండి 500 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

ప్రయోగం ప్రత్యేకత ఏమిటంటే…. ఒకే లాంచర్ నుంచి అత్యంత వేగంగా వరుసగా క్షిపణి వెంట క్షిపణులను ప్రయోగించడం.. శత్రు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఒక్కసారిగా గందరగోళం లోకి నెట్టివేయగల సామర్థ్యం ఇక మన సొంతం. రెండు క్షిపణులు ముందుగా నిర్ణయించిన టార్గెట్ ను అత్యంత ఖచ్చితత్వంతో చేదించాయి . నిర్దేశించిన వేగం తో…. “ప్రళయ్” విజయవంతంగా తన పరీక్షలను పూర్తి చేసింది.

ఫ్లైట్ ట్రాకింగ్‌ను Integrated Test Range (ITR), చాందిపూర్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక రాడార్ మరియు ట్రాకింగ్ సెన్సర్లు నిర్ధారించాయి. లక్ష్య ప్రాంతానికి సమీపంలో నౌకలపై అమర్చిన టెలిమెట్రీ సిస్టమ్స్ కూడా దీని ఖచ్చితత్వాన్ని ధృవీకరించాయి. భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్ ప్రతినిధులు, DRDO శాస్త్రవేత్తలు కలసి దీనిని వీక్షించారు.

ఈ "ప్రళయ" గర్జనతో పాక్ కి ముచ్చెమటలు…

ప్రళయ్ క్షిపణి ఎందుకు కీలకం….500 కిలోల నుండి 1000 కిలోల వరకు పేలోడ్ తీసుకువెళ్లగలదు. ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి, అత్యంత వేగం, ఖచ్చితత్వం కూడిన లక్ష్య చేదన, శత్రు రాడార్‌లను తప్పించుకునే సామర్థ్యం, శత్రు ఎయిర్‌బేసులు, లాజిస్టిక్ హబ్‌లు, కమాండ్ సెంటర్ల ను నాశనం చేయడానికి కీలక ఆయుధం. వ్యూహాత్మకమైన ఈ పరీక్ష భారత్ యొక్క దేశీయ క్షిపణి సాంకేతిక ఆధిక్యతకు నిదర్శనం.

రష్యా, యుఎస్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల సరసన భారత కూడా చేరింది…. ఈ రేంజ్ క్షిపణి ల తయారీ లో…. కాని చైనాను నమ్మడం లేదు ప్రపంచదేశాలు…. మొన్న కాంబోడియా లో చైనా తయారీ లఘుశ్రేణి రాకెట్స్ 4 ప్రయోగం తరువాత మొత్తం యూనిట్ అంతా…. అక్కడే పేలిపోయింది..

ఇందుమూలంగా చాలా దేశాలు భారత్ తో సంప్రదింపులు జరుపుతున్నాయి…. వాళ్ళ యొక్క సైనిక అవసరాల నిమిత్తం…. ఈ ప్రళయ్ క్షిపణి పాక్ పాలిట సింహ స్వప్నమే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading