Download App

“ఉన్నావ్” కేసుతో… రాజకీయ నాయకులకు చిక్కులు తప్పవా ?

జనవరి 2, 2026 Published by Srinivas

"ఉన్నావ్" కేసుతో… రాజకీయ నాయకులకు చిక్కులు తప్పవా ?

2017 జూన్ 4 వ తేదీన ఉత్తర ప్రదేశ్ లో ఉన్నావ్ జిల్లాలో జరిగిన ఒక దారుణ అత్యాచార సంఘటన, దాని తదనంతర పరిణామాలు ను పరిశీలిద్దాం…. ఈ కేసులో శిక్షపై హైకోర్టు మరియు సుప్రీం కోర్టు స్థాయిలో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరగడానికి కారణం ఏమిటి… సుప్రీంకోర్టు తాజా తీర్పు ఏమి ఇచ్చింది చూద్దాం..…

ఒక 17 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి తనకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి, తనపై అత్యాచారం చేశారని…. అప్పటి స్థానిక ‘బంగర్‌మౌ’ బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ పై “మఖీ” పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడానికి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేయకుండా నిరాకరిస్తూ…. నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎన్ని సార్లు తిరిగినా కేసు తీసుకోలేదు.

“2018 ఏప్రిల్ నెలలో”…

3వ తేదీన సెంగార్ అనుచరులు బాధితురాలి తండ్రి మీద దాడి చేసి…. ఒక తప్పుడు కేసు పెట్టీ అరెస్ట్ చేయించారు.

8వ తేదీన బాధితురాలు లఖ్‌నౌలో సీఎం యోగి ఆదిత్యనాథ్ నివాసం వద్ద ఆత్మహత్యాయత్నం నకు పాల్పడింది.

9వ తేదీన తండ్రి పోలీస్ కస్టడీలో మరణించాడు, పోస్టుమార్టం రిపోర్టులో తీవ్రగాయల వల్ల మరణించాడు అని వచ్చింది.

ఆత్మహత్యాయత్నంతో జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. కేసు తీవ్రత గమనించిన అలహాబాద్ హైకోర్టు తండ్రి మరణంతో CBI దర్యాప్తుకు ఆదేశించింది.

ఏప్రిల్ 12 వ తేదీన కేసు CBI కి బదిలీ అయిన తర్వాత, 13న CBI అతన్ని ప్రశ్నించడానికి అదుపు లోనికి తీసుకుని… హైకోర్టు ఆదేశంతో అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. అరెస్టు తర్వాత అతన్ని 7 రోజులు CBI కస్టడీలో ఉంచి, తర్వాత జుడిషియల్ కస్టడీకి బదిలీ చేశారు. POCSO, IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

"ఉన్నావ్" కేసుతో… రాజకీయ నాయకులకు చిక్కులు తప్పవా ?

“జూలై 2019″లో….

బాధితురాలు ప్రయాణిస్తున్న కారును “రాయబరేలీ” లో ఒక ట్రక్కు ఢీకొట్టింది…. ఈ ప్రమాదంలో ఆమె ఇద్దరు బంధువులు చనిపోగా బాధితురాలు, న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు…. ఇది హత్యాయత్నమని ఆరోపణలు రావడంతో కేసు మళ్ళీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారి చర్చనీయాంశమైంది.

“ఆగస్టు 2019″లో….

ప్రజాగ్రహం నేపథ్యంలో బీజేపీ పార్టీ సెంగార్‌ను పార్టీ నుండి బహిష్కరించింది… కులదీప్ సింగ్ సెంగార్ సీనియర్ ఎమ్మెల్యే కావడంతో రాజకీయ ఒత్తిడులు ఉంటాయని, ఆలోచించిన పిదప సుప్రీంకోర్టు విచారణను ఉత్తరప్రదేశ్ నుండి ఢిల్లీకి బదలాయించింది…

“డిసెంబర్ 2019″….

ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు సెంగార్‌ను దోషిగా తేల్చి, అతనికి జీవిత ఖైదు, 25 లక్షల రూపాయల జరిమానా విధించింది….

“మార్చి 2020″…..

బాధితురాలి తండ్రి మరణం (కస్టడీ డెత్) కేసులో కూడా సెంగార్‌ను దోషిగా తేల్చిన కోర్టు, అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది….

“డిసెంబర్ 23, 2025″…

ఢిల్లీ హైకోర్టు సెంగార్‌కు ఊరటనిస్తూ, సుమారు 7 ఏళ్లుగా జైలులో ఉన్నాడనే కారణంతో ఆయన జీవిత ఖైదును సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేసింది….

“డిసెంబర్ 29, 2025″…..

హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ CBI సుప్రీంకోర్టును ఆశ్రయించింది…. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు బెయిల్ ఉత్తర్వులపై స్టే (నిలిపివేత) విధించింది… కానిసుప్రీంకోర్టు తాజా నిర్ణయానికి కారణాలు…… బాధితురాలి భద్రత…, సాక్షుల భద్రతను, దృష్టిలో ఉంచుకుని నిందితుడు బయట ఉండటం సరికాదని అభిప్రాయపడింది.ఇదికాక సెంగార్‌పై కేవలం రేప్ కేసు కాకుండా, బాధితురాలి తండ్రి మరణానికి సంబంధించిన మరో కేసులో కూడా శిక్ష పడిందని కోర్టు గుర్తుచేసింది.

ప్రస్తుత పరిస్థితి…:

సాధారణ పౌరుడు కి పోక్సో చట్టం సె.4 ప్రకారం మినిమం 10 సంవత్సరాలు (అత్యాచారం), గరిష్ట జీవిత ఖైదు విధిస్తారు.

పబ్లిక్ సర్వెంట్ కి ఉదా : పోలీసు, ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారి…. మొదలగువారు, పోక్సో చట్టంలో సె.5 ప్రకారం…. జీవిత ఖైదు, మరణశిక్ష కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. కేసు తీవ్రతను బట్టి, అధికార దుర్వినియోగంనకు పాల్పడ్డారు కాబట్టి… ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ కు కూడా ఇదే సెక్షన్ 5(c) వర్తిస్తుందని CBI వాదిస్తుంది. .. హైకోర్టు “MLA పబ్లిక్ సర్వెంట్ కాదు” అని చెప్పి 10 సంవత్సరాలే శిక్ష అని బెయిల్ ఇచ్చింది. చట్టం అందరికీ సమానమే, కానీ పదవిలో ఉండి అధికార దుర్వినియోగం చేస్తే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది. చట్ట సభలో బిల్లు లు తీసుకువచ్చే వాళ్ళు కూడా పబ్లిక్ సర్వెంట్స్ నే అనే తీర్పు వస్తే మాత్రం రాజకీయ నాయకులు చాలా మందికి చెంప పెట్టులా ఉంటుంది.

సుప్రీంకోర్టు స్టే విధించడంతో కులదీప్ సింగ్ సెంగార్ జైలులోనే కొనసాగుతున్నాడు… ఈ కేసు తదుపరి విచారణ నాలుగు వారాల తర్వాత జరగనుంది.

ఈ కేసు భారత న్యాయ సంహిత లో కీలక ముందడుగు గా మారబోతోంది అని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading