Download App

ఇరాన్ తో మాట్లాడేదెవ్వరు…?

మార్చి 3, 2026 By Suresh Thota
ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు ఆఫీస్ మీద ఇరాన్ దాడి చేసినట్టుగా ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ ఇంకా ధృవీకరించలేదు. అమెరికా, ఇజ్రాయిల్ పై దూకుడుగా వ్యవహరిస్తున్న IRGC, కువైట్ లో అమెరికాకి చెందిన సైనిక స్థావరాల లక్ష్యంగా మిస్సైల్స్ తో దాడి చేసిన ఇరాన్. అమెరికా కి చెందిన అమెజాన్...
ఇరాన్ తో మాట్లాడేదెవ్వరు…?

ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు ఆఫీస్ మీద ఇరాన్ దాడి చేసినట్టుగా ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ ఇంకా ధృవీకరించలేదు. అమెరికా, ఇజ్రాయిల్ పై దూకుడుగా వ్యవహరిస్తున్న IRGC, కువైట్ లో అమెరికాకి చెందిన సైనిక స్థావరాల లక్ష్యంగా మిస్సైల్స్ తో దాడి చేసిన ఇరాన్. అమెరికా కి చెందిన అమెజాన్ డాటా సెంటర్ లపై కూడా దాడులు చేసింది. పేలుళ్ళ తో దద్దరిలిపోతున్నాయి గల్ఫ్ దేశాలు. ఇరాన్ కు మద్దతుగా లెబనాన్, హిజ్బుల్లా లాంటి సంస్థలు కూడా చేరాయి. విమానయాన రంగం కూడా పరిస్థితి అయోమయంగా ఉంది అని ఒక అంతర్జాతీయ వెబ్సైట్ పేర్కొంది.

క్రూడాయిల్ ధరలు ఆకాశాన్నంటే అవకాశం కనపడుతుంది. ప్రపంచ ప్రసిద్ధ ఆయిల్ సంస్థ “ఆరాంకో” కి చెందిన రేపైనరీ మీద ఇరాన్ దాడుల సందర్భంగా ఆయిల్ రేట్లు పెరిగే అవకాశం కనపడుతుంది అని అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాత్కాలికంగా హర్ముజ్ జల సంధి ఇరాన్ మూసివేయడం తో, ఎక్కడి కార్గో షిప్స్ అక్కడే ఆగిపోయాయి.

సౌదీ అరేబియా లోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటైన రాస్ తనూరా (Ras Tanura) రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా అక్కడ స్వల్పంగా మంటలు చెలరేగాయి. ముందు జాగ్రత్త చర్యగా అరామ్కో ఈ రిఫైనరీని తాత్కాలికంగా మూసివేసింది. గల్ఫ్ దేశాల్లో కొన్ని వందల డ్రోన్లు, మిస్సైల్స్ తో విరుచుకుపడుతుంది.

రోజుకు 5.5 లక్షల బ్యారెళ్ల చమురు ప్రాసెసింగ్ సామర్థ్యం ఉన్న ఈ రిఫైనరీ మూత వల్ల చమురు ధరలు 10% పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఒకవేళ క్రూడియల్ రేట్లు పెరిగితే , బంగారం ధర నెమ్మదిగా తగ్గి స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది అని మార్కెట్ వర్గాల నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ యుద్ధం నాలుగైదు వారాలు కొనసాగే అవకాశం ఉంది అని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం తో ఆయిల్ రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

ఇరాన్ లో ఇప్పటికే 500 మందికి పైగా చనిపోయారని, 1200 మందికి పైగా గాయపడ్డారని అనధికారికంగా తెలుస్తుంది. ఇప్పుడు ఇరాన్ ఎవరు చెప్పినా వినే స్థితిలో లేదు అంటున్నారు.

Suresh Thota

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading