
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు మంచి వార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 47.77 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించారు. ఈ వివరాలను వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు వెల్లడించారు.
వారి ప్రకారం, లబ్ధిదారుల్లో 98 శాతం రైతుల ఈకేవైసీ ప్రక్రియ గ్రామ, వార్డు సచివాలయాల సర్వే ద్వారా పూర్తయింది. ఇంకా 60 వేల మంది రైతుల వివరాలు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు. రైతుల సేవలో మరింత సులువుగా ఉండేందుకు త్వరలోనే అన్నదాత సుఖీభవ వెబ్‌సైట్ అందుబాటులోకి తీసుకురానున్నారు.
రైతులకు ఏడాదికి రూ. 20,000 సాయం
అర్హత గల ప్రతి రైతు కుటుంబానికి:
- రూ.6,000 — కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకం ద్వారా
- రూ.14,000 — ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా
మొత్తంగా రూ.20,000 వార్షిక ఆర్థిక సహాయం అందనుంది.
రెండు విడతలుగా నగదు జమ
ఈ పథకంలో:
- సొంత భూమి, అసైన్డ్ భూములు, ఇనాం భూముల రైతులు అర్హులు.
- వ్యవసాయ శాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం, 2025 అక్టోబర్, 2026 జనవరి నెలల్లో రెండు విడతలుగా డబ్బు రైతుల ఖాతాల్లో జమ కానుంది.
- కేంద్ర వాటా రాగానే, రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కలిపి రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనుంది.
అన్నదాత సుఖీభవ అర్హతకు సంబంధించిన మార్గదర్శకాలు
- వెబ్ ల్యాండ్ లో ఆధార్ జత చేయని రైతులు, లేదా తప్పు వివరాలున్నవారు రెవెన్యూ అధికారులను సంప్రదించి సమస్య పరిష్కరించుకోవాలి.
- భూమిలేని ఓసి, బిసి, ఎస్సి, ఎస్టి కవులు రైతులు ఈ పంటలో పేర్లు నమోదు చేసుకుని గుర్తింపు కార్డు పొందాలి.
గత ప్రభుత్వ హయాంలో కేవలం డీ పట్టాదారులు, ఆర్‌ఒఎఫ్‌ఆర్ సాగుదారులు మాత్రమే రైతు భరోసా కింద లబ్ధిపొందగా, ప్రస్తుత ప్రభుత్వం అసైన్డ్, ఇనాం, డీ పట్టాదారుల సహా అన్నిరకాల భూముల రైతులను పథకంలో చేరిస్తోంది.
స్టేటస్ చెక్ చేసుకోవడంపై సూచనలు
రైతులు తమ లబ్ధిదారుల స్థితిని అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు:
https://annadathasukhibhava.ap.gov.in/
అన్నదాత సుఖీభవ చెక్ చేయండిలా:
- వెబ్‌సైట్‌కి వెళ్లి ‘Know Your Status’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
- ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి
- Search బటన్‌పై క్లిక్ చేయగానే మీ స్టేటస్ కనిపిస్తుంది
- Approved అని వస్తే, మీరు లబ్ధిదారే
- లేకపోతే, రెవెన్యూ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేయాలి
రైతులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.
