Download App

కాకినాడ జేఎన్‌టీయూలో ‘హలో లోకేష్’…

జనవరి 30, 2026 By Rahul N
కాకినాడలోని Jawaharlal Nehru Technological University, Kakinada లో నిర్వహించిన ‘హలో లోకేష్’ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేష్ స్పష్టంగా సమాధానాలిచ్చారు. కార్యక్రమానికి జేఎన్‌టీయూ ఈసీఈ 3వ సంవత్సరం విద్యార్థిని ప్రాప్తి...
కాకినాడ జేఎన్‌టీయూలో ‘హలో లోకేష్’...

కాకినాడలోని Jawaharlal Nehru Technological University, Kakinada లో నిర్వహించిన ‘హలో లోకేష్’ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి లోకేష్ స్పష్టంగా సమాధానాలిచ్చారు. కార్యక్రమానికి జేఎన్‌టీయూ ఈసీఈ 3వ సంవత్సరం విద్యార్థిని ప్రాప్తి సంధానకర్తగా వ్యవహరించారు.

ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా నిలిపే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. అభివృద్ధి ప్రయాణంలో విద్యార్థులను భాగస్వాములను చేస్తామని, విద్యా రంగంలో నాణ్యతతో పాటు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

కాకినాడ జేఎన్‌టీయూలో ‘హలో లోకేష్’...

అనంతరం జేఎన్‌టీయూ కాకినాడలో ‘నందనం’ పేరుతో నూతనంగా నిర్మించిన పీజీ బాయ్స్ హాస్టల్ భవనాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంలో ఇది కీలక అడుగుగా నిలుస్తుందని తెలిపారు.

ఇక యూనివర్సిటీ ప్రాంగణంలో జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఇన్నోవేషన్ ఫెయిర్’ను మంత్రి సందర్శించారు. 20 స్టాళ్లలో వివిధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలను పరిశీలించి, వారి సృజనాత్మకతను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆవిష్కరణాత్మక ఆలోచనలను ప్రోత్సహిస్తాయని మంత్రి పేర్కొన్నారు.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading