Download App

నెల్లూరు: లోకేష్ చేతుల మీదుగా వీఆర్ మోడల్ పాఠశాల ప్రారంభం

జూలై 7, 2025 • By Srinivas
మంత్రి నారా లోకేష్ నెల్లూరుకు చేరుకున్న సందర్భంగా ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విద్యా రంగాన్ని సమూలంగా మార్చేందుకు కొనసాగుతున్న పీ4 కార్యక్రమంలో భాగంగా, లోకేష్ చొరవతో నెల్లూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన వీఆర్ మోడల్ పాఠశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా...
నెల్లూరు: లోకేష్ చేతుల మీదుగా వీఆర్ మోడల్ పాఠశాల ప్రారంభం

మంత్రి నారా లోకేష్ నెల్లూరుకు చేరుకున్న సందర్భంగా ఆయనకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విద్యా రంగాన్ని సమూలంగా మార్చేందుకు కొనసాగుతున్న పీ4 కార్యక్రమంలో భాగంగా, లోకేష్ చొరవతో నెల్లూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన వీఆర్ మోడల్ పాఠశాలను ఆయన ప్రారంభించారు.

నెల్లూరు: లోకేష్ చేతుల మీదుగా వీఆర్ మోడల్ పాఠశాల ప్రారంభం

ఈ సందర్భంగా ఆయన తరగతి గదులను సందర్శించి, డిజిటల్ విద్యావిధానాన్ని పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో పీ4 మార్గదర్శకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, పొంగూరు శరణిని మంత్రివర్యులు సత్కరించారు.

నెల్లూరు: లోకేష్ చేతుల మీదుగా వీఆర్ మోడల్ పాఠశాల ప్రారంభం

అనంతరం మంత్రి క్రీడా మైదానాన్ని సందర్శించి, విద్యార్థులతో కలిసి క్రికెట్, వాలీబాల్ ఆడి జోష్ నింపారు. కార్యక్రమంలో పలు శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

నెల్లూరు: లోకేష్ చేతుల మీదుగా వీఆర్ మోడల్ పాఠశాల ప్రారంభం

విద్యా రంగంలో ఈ మోడల్ పాఠశాలలు పిల్లల భవిష్యత్తుకు బలమైన బాటలు వేసేలా ఉండేలా నారా లోకేష్, మంత్రి వర్గం అంకిత భావంతో పని చేస్తోందని నేతలు అన్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading