Download App

మంచి నటుడిని మాత్రమే కాదు.. మంచి మనిషిని కోల్పోయాం: సీఎం చంద్రబాబు

జూలై 14, 2025 By Srinivas
ప్రముఖ సినీనటుడు, మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కోట గారి భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. "తెలుగు చిత్రసీమకు కోట శ్రీనివాసరావు సేవలు అమూల్యమైనవి....
మంచి నటుడిని మాత్రమే కాదు.. మంచి మనిషిని కోల్పోయాం: సీఎం చంద్రబాబు

ప్రముఖ సినీనటుడు, మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కోట గారి భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు.

“తెలుగు చిత్రసీమకు కోట శ్రీనివాసరావు సేవలు అమూల్యమైనవి. మంచి నటుడిని మాత్రమే కాకుండా మంచి మనిషిని కోల్పోయాం. వివిధ భాషల్లో 750కు పైగా చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను,” అని ముఖ్యమంత్రి తెలిపారు.

మంచి నటుడిని మాత్రమే కాదు.. మంచి మనిషిని కోల్పోయాం: సీఎం చంద్రబాబు

కోట శ్రీనివాసరావు జీవిత నేపథ్యం

1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్‌లోని కంకిపాడు గ్రామంలో జన్మించిన కోట శ్రీనివాసరావు, బాల్యంనుంచి నాటకాల పట్ల ఆకర్షణ చూపారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంకులో ఉద్యోగిగా పనిచేశారు. నటనపై ఆసక్తితో రంగస్థలంపై నుంచి వెండితెరకు ప్రవేశించిన ఆయన, కాలక్రమేణా తెలుగు సినిమా ప్రముఖ నటుల్లో ఒకరిగా ఎదిగారు.

1968లో రుక్మిణిని వివాహమాడిన కోట శ్రీనివాసరావుకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆయన కుమారుడు కోట ప్రసాద్, 2010 జూన్ 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

మంచి నటుడిని మాత్రమే కాదు.. మంచి మనిషిని కోల్పోయాం: సీఎం చంద్రబాబు

రాజకీయ ప్రస్థానం

కోట శ్రీనివాసరావు కేవలం నటుడిగా మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా తన సేవలను అందించారు. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికై ప్రజలకు సేవలందించారు.

ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన సేవలను స్మరిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading