Download App

జగన్ పాలనలో రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం..

జూలై 22, 2025 • By Rahul N
2019 ఎన్నికల ముందు మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామన్న జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీని తాకట్టుపెట్టి, మద్యం పాలసీలో భారీ మార్పులు చేశారు. లక్షల మంది ప్రజల ప్రాణాలను బలిచేసేలా నాసిరకం మద్యం సరఫరాకు మార్గం సుగమం చేశారు. తాజాగా బయటపడిన...
జగన్ పాలనలో రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం..

2019 ఎన్నికల ముందు మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామన్న జగన్ మోహన్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత తన హామీని తాకట్టుపెట్టి, మద్యం పాలసీలో భారీ మార్పులు చేశారు. లక్షల మంది ప్రజల ప్రాణాలను బలిచేసేలా నాసిరకం మద్యం సరఫరాకు మార్గం సుగమం చేశారు. తాజాగా బయటపడిన నివేదికల ప్రకారం, కల్తీ మద్యం తాగి దాదాపు 30 వేల మందికిపైగా మృతి చెందారు. 35 లక్షల మందికి పైగా కిడ్నీ, లివర్ సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చేరారు.

జగన్ హయాంలో ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మద్యం వ్యాపారం వాస్తవానికి భారీగా అక్రమ ఆదాయానికి మార్గం అయ్యిందని అంటున్నారు. మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు మానేసి, పూర్తిగా నగదు లావాదేవీలకు మొగ్గుచూపిన తీరు వెనుక భారీ నిధుల దారి మళ్లింపు కుట్ర ఉందని విమర్శలు వస్తున్నాయి.

కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారు కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్, సినిమాలు తీయడం, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగ్‌, దుబాయి, ఆఫ్రికా దేశాలకు షెల్ కంపెనీల ద్వారా తరలించడం, ప్రజా తీర్పును ప్రభావితం చేసేలా ఎన్నికల్లో ఖర్చు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

ఇటీవల వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, కల్తీ మద్యం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. జేబ్రాండ్స్ పేరుతో వచ్చిన కొన్ని మద్యాల్లో ఆల్కహాల్ బదులు హానికర రసాయనాలుండటం, వాటిని తాగిన తర్వాత ప్రజల్లో తీవ్ర ఆరోగ్య సమస్యలు రావడం, ఆసుపత్రుల పాలవడం వంటి పరిణామాలు కలకలం రేపుతున్నాయి.

దీనికి తోడు, ఇమిటేషన్ బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యం కేసులకు అధిక ధరలు చెల్లించి, అసలు బ్రాండ్లతో పోల్చితే ఒక్కో కేసుపై రూ.1,000కి పైగా వ్యత్యాసం ఉండటం ద్వారా వేల కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కొందరి చేతుల్లోకి చేరినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఉదాహరణకు, ‘బ్యాగ్ పైపర్’ అసలు బ్రాండ్ స్థానంలో ‘బ్యాగ్ పైపర్ గోల్డ్ రిజర్వ్’ పేరుతో నకిలీ మద్యం తీసుకొచ్చినట్టు ఆరోపణలున్నాయి.

వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే, దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం కన్నా ఇది 10 రెట్లు పెద్దదని పలువురు విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఆరోపణలపై ఇప్పటికీ ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం, సిట్ దాఖలు చేసిన ప్రాథమిక చార్జిషీట్‌లో మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరును ప్రస్తావించారని వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని వార్తలు

Trending Now

No trending articles in this category from the last 3 days.