Download App

వన్యప్రాణి సంరక్షణ – ప్రజా రక్షణలకు… పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం…

మే 31, 2026 By Suresh Thota
పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతం, తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోంది. అడవికి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్న ఆయిల్ ఫాం తోటలోని పశువుల పాకపై పులి దాడి చేసి తొమ్మిది దూడలను పొట్టనబెట్టుకున్న ఉదంతం పరిస్థితి...
వన్యప్రాణి సంరక్షణ – ప్రజా రక్షణలకు… పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం…

పోలవరం జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతం, తిమ్మాపురం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోంది. అడవికి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్న ఆయిల్ ఫాం తోటలోని పశువుల పాకపై పులి దాడి చేసి తొమ్మిది దూడలను పొట్టనబెట్టుకున్న ఉదంతం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే, ఈ ఆందోళనకర పరిస్థితుల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించిన తీరు, యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన తీరు అభినందనీయం.

​ పవన్ కళ్యాణ్ తక్షణ సమీక్ష …

సమస్య తీవ్రతను గుర్తించిన పవన్ కళ్యాణ్, బుధవారం రాత్రి జరిగిన ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో నిరంతర నిఘా ఉంచాలని, కేవలం సంప్రదాయ పద్ధతులకు పరిమితం కాకుండా, వన్యప్రాణి కదలికలను, వాటి ప్రతి అడుగూ ట్రాక్ చేసేందుకు అత్యాధునిక సాంకేతికతను వాడుకోవాలని ఆయన సూచించడం, అటవీ ప్రాంతాల్లోని, వన్య ప్రాణుల పై ఆయనకు ఉన్న ప్రేమ ను తెలియజేస్తుంది.

వన్యప్రాణి సంరక్షణ – ప్రజా రక్షణలకు… పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం…

​హనుమాన్ బృందాలతో నిఘా….

పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అత్యంత కీలకమైనది “హనుమాన్ బృందాల” ను రంగంలోకి దించారు. పులి సంచరిస్తున్న గ్రామాల్లో ఈ ప్రత్యేక బృందాలతో 24 గంటల పాటు నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని, అవసరమైతే అదనపు టీంలను పంపాలని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ మొత్తం ఆపరేషన్‌ను అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ స్వయంగా పర్యవేక్షించాలని, అవసరమైతే కేంద్ర కార్యాలయం నుండి సీనియర్ అధికారిని క్షేత్రస్థాయికి పంపాలని ఆదేశించడం ద్వారా బాధ్యతను, జవాబుదారీతనాన్ని నిర్దేశించారు.

​మానవతా దృక్పథం – తక్షణ పరిహారం

సాధారణంగా వన్యప్రాణుల దాడులు జరిగినప్పుడు ప్రభుత్వ పరిహారం అందడంలో తీవ్ర ఆలస్యం జరుగుతుంటుంది. ఉప ముఖ్యమంత్రి”పవన్ కళ్యాణ్” బాధిత రైతాంగాన్ని ఆదుకోవడంలో మానవత్వాన్ని చాటుకున్నారు. పశువులను నష్టపోయిన రైతులకు ఇప్పటికే కొంత తక్షణ పరిహారం అందేలా చూసారు. పశువైద్యుల నివేదిక రాగానే పూర్తి స్థాయి పరిహారం ఇస్తామని ప్రకటించడం. అధికారుల ప్రవర్తన బాధిత ప్రజల పట్ల సున్నితంగా, మానవతా దృక్పథంతో ఉండాలన్న ఆయన ఉద్దేశ్యం… ప్రభుత్వ ప్రజాస్వామ్య బద్ధమైన వైఖరిని ప్రతిబింబిస్తోంది.

వన్యప్రాణి సంరక్షణ – ప్రజా రక్షణలకు… పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం…

​అవగాహనే రక్షణ కవచం

ఈ రకమైన సంక్షోభ సమయాల్లో ప్రజల భాగస్వామ్యం, అవగాహన అత్యంత ముఖ్యం. అటవీ సరిహద్దు గ్రామాల్లో నిరంతరం అవగాహన శిబిరాలు నిర్వహించాలని, రైతులు తమ పశువులను అడవి సమీపంలోకి తీసుకు వెళ్లకుండా జాగ్రత్తపడేలా చేయాలని, అనవసరంగా అడవుల్లోకి వెళ్లకుండా నియంత్రించాలని డిప్యూటీ సీఎం ఇచ్చిన పలు సూచనలు భవిష్యత్తు ప్రమాదాలను నివారించేందుకు ఎంతగానో తోడ్పడతాయి.

​ముగింపు: వన్యప్రాణి సంరక్షణ చట్టాల నిబంధనలను గౌరవిస్తూనే, స్థానిక ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించడమే పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని అటవీ శాఖ యొక్క పరమార్థం. గతంలో జనారణ్యంలోకి వచ్చిన పులిని చాకచక్యంగా అడవిలోకి మళ్లించిన అటవీ సిబ్బంది అనుభవాన్ని గుర్తు చేస్తూ వారిలో ధైర్యాన్ని నింపిన తీరు బాగుంది. డిప్యూటీ సీఎం సంకల్పం, సాంకేతికత, మరియు ప్రజా సహకారం సముచితంగా మేళవిస్తే… “పోలవరం” అడవుల్లో తలెత్తిన ఈ తాత్కాలిక సంక్షోభాన్ని సమర్థవంతంగా అధిగమించవచ్చు. మానవ ప్రాణం, వన్యప్రాణి మనుగడ రెండూ సమానంగా రక్షించబడటమే నిజమైన పర్యావరణ సమతుల్యత…..

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading