
పశ్చిమ బెంగాల్” రాజకీయాలు అక్రమ వలసల అంశంతో మళ్లీ దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. బంగ్లాదేశ్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న ఈ రాష్ట్రం గత కొన్ని దశాబ్దాలుగా అక్రమ చొరబాట్ల ను ఎదుర్కొంటూనే ఉంది. ఇప్పుడు అదే అంశాన్ని ప్రధాన అజెండాగా తీసుకుని ప. బెంగాల్ ముఖ్యమంత్రి “సువేందు అధికారి” చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని మరింత పెంచాయి.
చొరబాటుదారులను ఉద్దేశించి “ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకముందే మీ అంతట మీరే వెళ్లిపోండి” అంటూ ఆయన చేసిన హెచ్చరిక సాధారణ రాజకీయ వ్యాఖ్య కాదు. అది బెంగాల్‌లో పెరుగుతున్న జాతీయ భద్రతా చర్చకు సంకేతం. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిని గుర్తించి, ఓటరు జాబితాల నుంచి తొలగించి, అనంతరం దేశం బయటకు పంపించాలనే “Detect, Delete, Deport” విధానాన్ని బీజేపీ వర్గాలు ఇప్పుడు బహిరంగంగా ముందుకు తెస్తున్నాయి. అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను, జైళ్లలో పెట్టకుండా BSF కి అప్పగించాలని, వారిని దేశ సరిహద్దుల నుండే వెనక్కి పంపించేస్తామని ప. బెంగాల్ సీఎం “సువేందు అధికారి” తెలిపిన విషయం విదితమే.
సువేందు అధికారి చేసిన “వాళ్ళు చొరబాటుదారులు మన అల్లుళ్ళు కాదు…” అన్న ఘాటు వ్యాఖ్య రాజకీయంగా చాలా పదునైన మాట. ఎందుకంటే ఈ వ్యాఖ్య వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది, అక్రమంగా దేశంలోకి వచ్చిన వారిపై భారతదేశం తన వనరులు ఖర్చు చేయకూడదని బీజేపీ వాదిస్తోంది. జైళ్లలో ఉంచి ప్రజలు చెల్లిస్తున్న పన్ను రూపంలో డబ్బును వారికి ఖర్చు చేయడం కంటే వారిని నేరుగా సరిహద్దులకు పంపించాలనే కఠిన దృక్పథాన్ని ఈ వ్యాఖ్య ప్రతిబింబిస్తోంది.
దీని మూలంగా ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని “హకీంపూర్” సరిహద్దు ప్రాంతంలో మంగళవారం ఉదయం భారీగా అక్రమ వలసదారులు గుమిగూడారు. ప్రభుత్వం తనిఖీలను తీవ్రతరం చేయడంతో, వారంతా తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపోవడానికి అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
అక్రమ వలసల సమస్యను భారత రాజకీయ పార్టీలు చాలా కాలం పాటు ఓటు బ్యాంక్ రాజకీయాల కోణంలోనే చూశాయి. ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో, ఈ అంశంపై కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి అనేక ప్రభుత్వాలు వెనుకంజ వేసాయి. ఫలితంగా కొన్ని నియోజకవర్గాలు లో స్థానిక జనాభా లో తగ్గుదల ప్రారంభమైనది, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఒత్తిడి పెరిగి పోయింది. ఇక్కడ ప్రజల కోసం ఏర్పాటు చేసిన పథకాలను వీళ్ళు అనుభవిస్తున్నారు కొందరి అవినీతి రాజకీయ నాయకులు ప్రోద్భలంతో….
మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఈ విధమైన వ్యాఖ్యలను ప్రమాదకర రాజకీయ భాషగా అభివర్ణిస్తున్నాయి. అక్రమ వలసదారుల సమస్యను మతపరమైన కోణంలో చూపించడం సమాజంలో విభజనలకు దారి తీస్తుందని, చట్టపరమైన ప్రక్రియలను పక్కనబెట్టి నేరుగా…. “పంపించివేయాలి” అనే ధోరణి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కూడా అంటున్నాయి.
కానీ వాస్తవ పరిస్థితులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కూడా సాధ్యం కాదు. సరిహద్దు జిల్లాల్లో గుర్తింపు పత్రాలు లేకుండా నివసిస్తున్న వారిపై కేంద్ర భద్రతా సంస్థలు గతంలో పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. దేశ వ్యతిరేక శక్తులకు, బంగ్లాదేశ్ నుండే ఆదేశాలు వస్తున్నాయి అని కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థలు నివేదికలు చెబుతున్నాయి.
ముగింపు: ఇప్పుడు ప. బెంగాల్‌లో కనిపిస్తున్న అసలు పోరాటం కేవలం అక్రమ వలసలపై కాదు. జాతీయ భద్రత, దేశ ప్రయోజనాలకు సంబంధించిన అంశం. అందుకే “ప. బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి వ్యాఖ్యలు సాధారణ రాజకీయ ప్రసంగంగా కాకుండా, రాబోయే కాలంలో భారత రాజకీయాల దిశను సూచించే విధంగా కనిపిస్తున్నాయి.
