
అగ్రస్థానంలో అధికార పీఠాన్ని అధిరోహించిన రాజకీయ నాయకులకు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఎత్తుగడలు, నిత్యకృత్యం… వాళ్ళకి సేద తీరే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి స్థానంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారిక పర్యటన నిమిత్తం హైదరాబాద్ విచ్చేశారు. కాని దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ, జనసేనాని పవన్ కళ్యాణ్ నివాసానికి విచ్చేసారు. పవన్ కళ్యాణ్ మొన్న తన ముక్కుకి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆయన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పడానికి, ఆరోగ్యం ఎలా ఉంది అని పరామర్శకి, హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటి కి వచ్చారు. ప్రధాని మోదీ అక్కడ ఒక దేశాధినేతలా కాకుండా, ఆ ఇంటి పెద్ద దిక్కులా వ్యవహరించడం ఒకింత సంతోషంగాను, ఒకింత ఆశర్యానికి గురి చేసింది. ఇప్పటి వరకు మోదీ ఎవరి ఇంటికి ఈ విధంగా వెళ్లలేదు.
కాని ఒక ప్రధాన విషయం ఏమిటంటే… ప్రధాని మోడీ విషయంలో 2014 లో జనసేనాని ఒక మాట అన్నారు మోడీతో… “దేశ కోసం, దేశ భవిష్యత్తు కోసం మీ లాంటి వారికి నా వంతు సహాయం నేను చేస్తాను. నేను పోటీ చేయను, మీరు గెలవడం ముఖ్యం” అని తను పోటీ చేయకుండా ప్రధాని గెలుపు తన గెలుపు గా కృషి చేసి, ఆనాడే మోదీ మనసు చూరగొన్నారు. ఆ అనుబంధం ఇద్దరి మధ్య దృఢంగా ఉంది. ఇదే బంధం తో పార్లమెంట్ సాక్షిగా పవన్ కళ్యాణ్ ను తుఫాన్ తో పోల్చారు. ఇంత అనుబంధం ఉంది కాబట్టే, దేశ ప్రధాని మోడీ రాజకీయ విషయాలను పక్కన పెట్టి, ఆత్మీయ పలకరింపు గా, పవన్ కళ్యాణ్ నివాసానికి విచ్చేశారు. అంతే గాకుండా “మీరు సమాజానికి ఎంతో చేయాలి.. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు” అని ఆయన పవన్ కు, ఒక అన్న తన తమ్ముడికి ఇచ్చినట్లు అమూల్యమైన సలహా ఇచ్చారు.

ఆ ఇంటి వాతావరణం ప్రధాని రాకతో ఒక పండగలా మారిపోయింది. ఉప ముఖ్యమంత్రి “పవన్ కళ్యాణ్” పిల్లలతో, ప్రధాని మోదీ జరిపిన సంభాషణలు ఆద్యంతం ప్రతి ఒక్కరికి ఆశక్తిని కలిగించాయి. ఈ సందర్భంగా, పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ప్రఖ్యాత హిందీ కవి రాంధారీ సింగ్ దినకర్ జీ రాసిన కఠినమైన కవితను అకీరా వినిపిస్తుంటే, మోదీ గారు పరవశించిపోయారు. “అంత కఠినమైన హిందీ నేర్చుకోవడం మామూలు విషయం కాదు” అంటూ అకీరాను అభినందిస్తూనే, పవన్ గారి వైపు చూసి “ఇంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్ స్టార్ ఉంటే.. నువ్వు కూడా అదే బాటలో ఉన్నావా?” అని సరదాగా చమత్కరించడం వారి మధ్య ఉన్న సాన్నిహిత్యానికి అద్దం పడుతుంది.
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తన చిన్నారి తన చేతులతో స్వయంగా తయారు చేసిన వెల్కమ్’ కార్డును అందిస్తుంటే ప్రధాని మురిసి పోయారు. గతంలో సింగపూర్‌లో మార్క్ శంకర్ ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తుచేస్తూ, “నీ గురించి మేమంతా ఎంతో ఆందోళన పడ్డామురా బాబూ” అని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడం మోదీలో ఆ కుటుంబం పైన ఉన్న ఆపేక్షను తెలియజేస్తుంది. పవన్ కూతురు ఆద్య తన తల్లి వైపు గుజరాతీ మూలాలు ఉన్నాయని, చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరో కూతురు పలీనా అంజనితో మాట్లాడుతూ, నీకు హిందీ వచ్చా అని అడిగారు. తాను రాదు అనడంతో “వచ్చేసారి కలిసేటప్పటికి హిందీ నేర్చుకోవాలి” అని సరదాగా అన్నారు.

పవన్ సతీమణి అన్నా లెజినోవా తో రష్యన్ పదాల్లో పలకరించి ప్రధాని అందరినీ ఆశ్చర్యపరిచారు. పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా ప్రజల కోసం పడుతున్న శ్రమ, ఆ పర్యటనల్లో పీల్చిన దుమ్ము, ధూళి వల్ల కలిగిన అనారోగ్యం (Sinus Surgery) గురించి ప్రధాని మోదీ ఆరా తీశారు. “నువ్వు ప్రజలకు ఇంకా చాలా సేవ చేయాలి.. నీ ఆరోగ్యం నాకే కాదు, దేశానికి చాలా ముఖ్యం” అనడం కొసమెరుపు.
పవన్ కళ్యాణ్ నిజాయితీకి, నిబద్ధతకు దక్కిన గౌరవం ఇది. ఒక నాయకుడి ఆరోగ్యం పట్ల దేశ ప్రధాని చూపిన శ్రద్ధ, ఆ కుటుంబం పట్ల చూపిన ప్రేమ.. పవన్ కళ్యాణ్ ఒంటరి వారు కాదు, ఆయన వెనుక దేశాధినేత ఆశీస్సులు ఉన్నాయి.
ముగింపు: పవన్ కళ్యాణ్ ఆశయాలకు, మోదీ గారి మార్గదర్శనం తోడైతే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బంగారుమయమే… అని సోషల్ మీడియా వేదికగా జనసేన నాయకులు, కార్యకర్తలు వేనోళ్ళ కొనియాడుతుంటే… అధికారం కోసం పాకులాడే నాయకులు ఎందరో ఉండొచ్చు.. కానీ ఆప్యాయతను గెలుచుకునే నాయకుడు మన పవన్ కళ్యాణ్ ఒక్కడే. అని సోషల్ మీడియా వేదికగా అభిమానులు అంటున్నారు.
